Viral Photo: ఎవరైనా ఓ నటుడ్ని లేదా నాయకుడ్ని ఇష్టపడితే ఏం చేస్తారు.? ఆయన పుట్టినరోజుకి ఏ ఫ్లెక్సీనో, కటౌటో పెట్టుకుంటారు. మరీ అభిమానిస్తే ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు. కానీ జనసేన (Janasena) అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు కోట్లాది మంది అభిమానులున్నారు. పవన్ పేరు చెబితే పూనకంతో ఊగిపోయే అభిమానులున్నారు. వారిలో చాలామంది పవన్ ను ఇష్టపడడమే కాదు.. ఆయన పార్టీని కూడా అంతా అమితంగా ప్రేమిస్తారు. పవన్ కోసం ఏం చేయడానికి అయినా సిద్ధం అనే రేంజ్ లో అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఓ పెళ్లి జంట చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది. సాధారణంగా ఎవరైనా..? వివాహాలు (Marriages) వేడుకగా జరుపుకుంటారు. స్థోమతను బట్టి ఘనంగా చేసుకుంటారు. ఆకాశమంత పందిరి.. అంటూ వివాహం ఎంత ఘనంగా జరుపుకున్నారో అందరికీ తెలిసేలా చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఓ జంట మాత్రం తమ వివాహ వేడుకలో వినూత్న పద్ధతితో వార్తల్లో నిలిచారు. ఆ జంట వివాహం ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, వారి పెళ్ల ఫొటోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అయిపోయాయి. ఇంతకీ వారు పెళ్లిలో అనుసరించిన వినూత్న పద్ధతి ఏంటో తెలుసా..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద అపారమైన అభిమానం ఉన్న ఆ జంట తమ పెళ్లితో దండలతో పాటు జనసేన కండువాలనూ మార్చుకున్నారు. ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకోవడమే కాకుండా జనసేన కండువాలు కూడా కప్పుకోవడం చూసి అంతా షాక్ కు గురయ్యారు. దీంతో వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అభిమానమంటే ఇదేరా భాయ్ అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. జనసేన ప్రచారానికి ఇదో కొత్త దారి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి జనసేన కండువాలతో జరిగిన పెళ్లిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చదవండి : ఏపీలో విలీనం ఎఫెక్ట్.. రెండు తరగతుల్లో ముగ్గురే విద్యార్థులు...
ఇప్పుడే కాదు గతంలోనూ కొందరు పవన్ అభిమానులు ఇలాగే తమ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ సర్వసంగా భావించే ఆ అభిమాని.. ఏకంగా తన పెళ్లి పత్రికపై తన అభిమాన నాయకుడి ఫోటోను ప్రింట్ చేయించాడు. అంతేకాదు పవన్ ఫోటో ఎదుటే భార్యమెడలో తాళికడతానని భీష్మించుకొని కూర్చున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావు పేట గ్రామంలో జరిగింది. జనసేన పార్టీ కార్యకర్త అయిన శ్రీనివాస రావు.. ఆ మధ్య ఆయన ఎచ్చెర్ల మండలం నుండి స్ధానిక జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా పోటీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, Marriage, Pawan kalyan, Vizag