హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP New Cabinet: కొత్త కేబినెట్ తో జగన్ కు తలనొప్పులు తప్పవా..? మొదటికే మోసం వస్తుందా..?

AP New Cabinet: కొత్త కేబినెట్ తో జగన్ కు తలనొప్పులు తప్పవా..? మొదటికే మోసం వస్తుందా..?

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఏపీ సీఎం జగన్ కు నల్లేరు మీద నడక అనుకున్న మంత్రివర్గ విస్థీర్ణం ఇప్పుడు నిప్పుల మీద నడకగా మారిందా..? మంత్రివర్గ కూర్పులో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త సమీకరణాలకు దారీతీస్తాయా..?

Anna Raghu, News18, Amaravati

ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) కు నల్లేరు మీద నడక అనుకున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) ఇప్పుడు నిప్పుల మీద నడకగా మారిందా..? మొదటి నుండి విధేయతకు పట్టం కట్టిన వైఎస్ కుటుంబం. మంత్రివర్గ కూర్పులో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త సమీకరణాలకు దారీతీస్తాయా..? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party). జగన్ ఒంటిచేత్తో తన రెక్కలకష్టం మీద నిర్మించిన రాజకీయ సౌధం. పార్టీలో ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరికి ఏ పదవి ఇవ్వాలి ప్రతిదీ జగన్ సొంత నిర్ణయమే.ఆ పార్టీలో ఆయన మాటకు తిరుగులేదు. ఆయన నిర్ణయానికి తిరుగు లేదు. 151 మంది శాసన సభ్యులతో అధికారం చేపట్టిన వైసీపీ పునాదులు కదిలించటానికి వీలులేనంత బలంగా జగన్ నిర్మించారు. మొండితనం, పట్టుదల, నిర్మొహమాటం, మాట చెప్తే వెనక్కి తీసుకునే అలవాటు లేనితనం ఇవన్నీ జగన్ బలాలు.

మంత్రివర్గ కూర్పుతో తనకోటకు ఇప్పుడు తానే బీటలు చేసుకున్నారనేది విశ్లేషకుల వాదన. తొలిసారి మంత్రివర్గం కూర్పులో అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని 25 మందితో క్యాబినెట్ ఏర్పాటు చేసుకున్న జగన్ ఆనాడే మీ పదవులు రెండున్నర ఏళ్ళు మిత్రమే అని కుండబద్దలు కొట్టారు. అప్పుడు ఒక్కరూ జగన్ మాటకు అడ్డు చెప్పలేదు. మూడేళ్ళ తరువాత ఆదివారం మంత్రివర్గ విస్థరణ లో మార్పూలు చేర్పులు జగన్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయనే చెప్పాలి. మంత్రులు అందరి నుండి రాజీనామాలు కోరిన జగన్ రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఒకరో ఇద్దరిని మాత్రం కొనసాగిస్తానంటూ చివరి మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు.

ఇది చదవండి: మంత్రి పదవి రావడంతో రోజా సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్ బై..!


ఐతే ఇప్పుడు ఏకంగా 11మందిని పాతవారినేకొనసాగించడంతో మిగతా వారంతా తాము అసమర్ధులమని జగన్ భావించారా అనని తేగఫీలైపోతున్నారు. పైపెచ్చు జగన్ కు విధేయులు, వీరాభిమానులుగా ఉండి, కష్టకాలంలో పార్టీకి, ప్రభుత్వానికి అండగానిలబడిన అనేక మందిని తప్పించి, కాంగ్రెస్ ప్రభుత్వంలో చివరి వరకు పదవులను అనుభవించి చివరి నిమిషంలో పార్టీలో చేరిన బొత్స సత్యనారాయణలాంటి వారిని కొనసాగించడం వారిని మరింత కలచివేస్తోంది.

ఇది చదవండి: ఏపీ కేబినెట్ లో యంగ్ మినిస్టర్స్ వీళ్లే.. పెద్దోళ్లు ఎవరంటే..!


కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తన మంత్రిపదవిని వదిలేసి జగన్ వెంటనడిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి వచ్చిన మేకతోటి సుచరిత, పిన్నెల్లి.రామక్రిష్ణారెడ్డి వంటివారికి మొండిచేయి మిగిలింది. సామాజిక సమీకరణల పేరు చెప్పి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని మంత్రి వర్గంలోకి తీసుకుని తమను విస్మరించడం తగదని పిన్నెల్లి వంటి నేతలు అంటుంటే, మంత్రివర్గంలో చోటిస్తామని సభాముఖంగా ప్రకటించి కూడా తమ నాయకులకు అన్యాయం చేశారని ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్ వంటివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: కేబినెట్ పై వైసీపీలో అసంతృప్తి జ్వాలాల.. మేకతోటి సుచరిత రాజీనామా..


పార్టీపై ప్రభుత్వంపై సీఎం జగన్ కంటే సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం పెరిగిపోయిందని, అందుకే జగన్ నమ్మిన బంటులను కాదని సజ్జల డైరెక్షన్ లో కొత్తటీమ్ ను తయారు చేసుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇప్పటి మంత్రి వర్గంలో ఎక్కువ శాతం సజ్జల ఆసీస్సులున్నవారే ఉన్నారని, పార్టీలో సీనియారిటీకి, విధేయతకు, మాటకు కట్టుబడి ఉండే వారికి విలువలేదని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ సీనియర్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో ఇప్పటికిప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేక పోయినా రానున్న రోజులల్లో ఆశావాహుల నుండి జగన్ కు కొత్త తలనొప్పులు ఎదురవడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy