Home /News /andhra-pradesh /

AP POLITICS NEW HEADACHE FOR CM YS JAGAN AFTER CABINET RESHUFFLE AS PARTY LEADERS MAKE SILENCE FULL DETAILS HERE PRN BK

YS Jagan: కొత్త కేబినెట్ తో సీఎం జగన్ కు తలనొప్పులు..? చేతులెత్తేసిన నేతలు..? కారణం ఇదేనా..?

సీఎం జగన్(ఫైల్)

సీఎం జగన్(ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త కేబినేట్ (AP New Cabinet) ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుంచి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (AP CM YS Jagan) కి చిక్కులు వ‌చ్చిప‌డుతున్నాయి. పాత మంత్రులంద‌రిని తీసేసి కొత్త నేత‌ల‌కు మంత్రుల‌గా స్థానం క‌ల్పిచడంతో ప్రారంభ‌మైన జ‌గ‌న్ తలనొప్పులు ఇంకా కొన‌సాగుతున్నాయి.

ఇంకా చదవండి ...
  M Bala Krishna, News18, Hyderabad

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త కేబినేట్ (AP New Cabinet) ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుంచి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (AP CM YS Jagan) కి చిక్కులు వ‌చ్చిప‌డుతున్నాయి. పాత మంత్రులంద‌రిని తీసేసి కొత్త నేత‌ల‌కు మంత్రుల‌గా స్థానం క‌ల్పిచడంతో ప్రారంభ‌మైన జ‌గ‌న్ తలనొప్పులు ఇంకా కొన‌సాగుతున్నాయి. మంత్రి ప‌ద‌వులు ఆశించి భంగ‌ప‌డిన వారు, పదవి కోల్పోయిన మాజీ మంత్రులు నేత‌లు ఇప్పుడు సొంత పార్టీ అధినేతపైనే గుర్రుగా ఉన్నారట. పైకి అంతా సెట్ అయిన‌ట్లు క‌నిపిస్తున్న లోప‌ల మాత్రం అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. కొత్త కేబినేట్ ఏర్పాటు చేసిన త‌రువాత ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కాన్ని మ‌రింత ఎక్కువ చేసుకుందామ‌నుకున్న జ‌గ‌న్ ప్లాన్స్ మొత్తం ఇప్పుడు డైలామాలో ప‌డ్డాయని సొంతపార్టీ నేతలే అంటున్నారు.

  కొత్త కేబినెట్ ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుంచి పార్టీలో నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త కొర‌వ‌డింది. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కొంత మంది దూరంగానే ఉంటుంటే మ‌రికొందరు మాత్రం మీకు కావాల్సి వాళ్ల‌కి మంత్రి ప‌ద‌వులు ఇచ్చుకున్నారు క‌దా వాళ్ల‌తోనే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకొండ‌ని జ‌గ‌న్ ముందు వ్యాఖ్య‌లు చేసే స్థాయికి వెళ్లారు. మ‌రో వైపు ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీ రాష్ట్రంలో పుంజుకుంటుంది తాజాతా చంద్ర‌బాబు నిర్వహించిన బాదుడే బాదుడు కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న రావడంతో వైసీపీ నేతలకు టెన్షన్ మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. ఓవైపు చంద్ర‌బాబుకు ప్ర‌జ‌ల్లో మ‌ద్ద‌తు పెరుతుండ‌డం.., మ‌రో వైపు జ‌న‌సేన టీడీపీ పొత్తు దాదాపు ఖ‌రారు అయ్యే స్థాయికి రావ‌డంతో అధికార‌పార్టీలో గుబులుమొదలైందన్న చర్చ జరుగుతోంది.

  ఇది చదవండి: పీఆర్సీ బకాయిలపై ప్రభుత్వం కీలక ప్రకటన.. రిటైర్మెంట్ తర్వాతే అన్నీ..


  గ‌తంలో మంత్రులుగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన కొడాలి నాని, పేర్ని నాని, బొత్స లాంటి నేత‌లు అప్పుడు చంద్ర‌బాబుపై విరుచుప‌డేవారు. అయితే కొత్త కేబినేట్ వ‌చ్చిన త‌రువాత కొడాలి నాని, పేర్ని నానిలు త‌మ మంత్రి ప‌ద‌వులు పోవ‌డంతో సైలెంట్ అయ్యారు. అప్పుడప్పుడు మాట్లాడుతున్నా మునుపటి స్థాయిలో మాటల తూటాలు పేల్చడం లేదు. మ‌రో కీలకనేత బొత్స ను కొత్త కేబినేట్లో కూడా కొనసాగించినా.. త‌న‌కు ఇచ్చిన శాఖ ప‌ట్ల ఆయ‌న అసంతృప్తిగా ఉన్నారు. దీంతో కేందుకులే అనే దోర‌ణిలో సత్తిబాబు ఉన్నారు.

  ఇది చదవండి: ఆ 8 లక్షల కోట్లు ఏమయ్యాయి.. లేని రోడ్డుపై కేసులా..? జగన్ పై చంద్రబాబు ధ్వజం..


  ఇదిలా ఉంటే కొత్తగా మంత్రి ప‌ద‌వులు చేపట్టినాళ్లలో ఒక్క అంబ‌టి రాంబాబు త‌ప్ప పెద్ద‌గా మంత్రుల లెవ్వ‌రు మీడియా ముందుకొచ్చిన ప్ర‌తిప‌క్ష పార్టీపై విరుచుకుప‌డ్డ సంద‌ర్భాలు క‌నిపించ‌డం లేదు. అయితే ఇదే అంశానికి సంబంధించి జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ప్ర‌తిప‌క్ష‌పార్టీ కాస్త బ‌లం పుంజుకుంటుందని.., మ‌న వైపు నుంచి ఎవ‌రు మాట్లాడటం లేదు.., బాబును కాస్త గట్టిగా టార్గెట్ చేయండని చెప్పినా.. ఒక్కరు కూడా కాన్ఫిడెన్స్ గా యస్ అని చెప్పినట్లు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

  ఇది చదవండి: అంతా నారాయణ మయం.. అందుకే ఇప్పుడు దొరికారు.. సజ్జల సంచలన కామెంట్స్


  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికే 30 నుంచి 50 మంది సిటింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్లు ఇవ్వ‌డం లేద‌ని పార్టీలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో ఈ సమయంలో చంద్ర‌బాబుపై విరుచుకుపడితో వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ గా ఇప్పుదులు తప్పవేమోనని వెనకడుగువేస్తున్నారట. కొత్త కేబినేట్ తో ఉహించ‌ని మ్యాజిక్స్ చేద్దామ‌నుకున్న సీఎం జ‌గ‌న్ కు ఈ ప‌రిణామాలు మింగుడుప‌డ‌డం లేద‌ని సమాచారం.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు