హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSRCP: వైసీపీలో ఏం జరుగుతోంది..? సీఎంకు తలనొప్పిగా నేతల వ్యవహారం.. బందరులో పేలిన బాంబ్

YSRCP: వైసీపీలో ఏం జరుగుతోంది..? సీఎంకు తలనొప్పిగా నేతల వ్యవహారం.. బందరులో పేలిన బాంబ్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP Politics: గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అధికార పార్టీ.. అప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ ప్రతిపక్షాలపై ఆధిపత్యం చెలాయిస్తోంది. అంతాబాగానే ఉన్నా.. వైసీపీ (YSRCP) లో కొంతమంది నేతల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

Anna Raghu, News18, Amaravati

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) కి తిరుగులేదు. గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అధికార పార్టీ.. అప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ ప్రతిపక్షాలపై ఆధిపత్యం చెలాయిస్తోంది. అంతాబాగానే ఉన్నా.. వైసీపీ (YSRCP) లో కొంతమంది నేతల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దాదాపు అన్ని జిల్లాలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న పరిణామం ఒక విధంగా పార్టీలో ప్రకంపనలు రేపిందనే చెప్పాలి. ఆ ఇద్దరు నేతల పేరు చెబితే విభేదాలనే మాటే గుర్తుకురాదు. కానీ మూడేళ్లుగా సైలెంట్ గా ఉన్న నియోజకవర్గం.. కాస్త లైన్ క్రాస్ చేసింది. అటు ఎమ్మెల్యే.. ఇటు ఎంపీ.. తగ్గేదేలే అనే విధంగా వ్యవహరించడంతో పార్టీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

ఇప్పటికే పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మంత్రి విడదల రజినీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరూ కలిసి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్నది లేదు. తాజాగా ఇదే లిస్ట్ లో కృష్ణా జిల్లా కేంద్ర మచిలీపట్నం చేరింది. బందరు ఎంపీకి, ఎమ్మెల్యేకి మధ్య సైలెంట్ గా సాగుతున్నవార్ కాస్తా.. ఇప్పుడు ఓపెన్ అయింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీని.. స్థానిక ఎమ్మెల్యే పేర్నినాని వర్గం అడ్డుకోవడంతో ఒక్కసారిగా దుమారం రేగింది.

ఇది చదవండి: ఈ ఎమ్మెల్యే మాకొద్దు మహాప్రభో.. ఆ జిల్లాలో వైసీపీ నేతల గగ్గోలు.. ఇంతకీ గొడవేంటంటే..!


బందరులో పలుచోట్ల పర్యటించేందుకు బాలశౌరి సిద్ధమవగా.. పేర్ని నాని వర్గానికి చెందిన కార్పొరేటర్ తో పాటు పలువురు ఎంపీని అడ్డుకున్నారు. అంతేకాదు ఎంపీ గౌ బ్యాక్ అంటూ నినాదాలు కూడా చేశారు. దీంతో తన నియోజకవర్గంలో తనను ఎందుకు తిరగనీయరంటూ.. ఇక్కడే ఉండి ఎవరి సంగతి ఏంటో తేలుస్తానని బాలశౌరి ఛాలెంజ్ చేశారు.

ఇది చదవండి: వాళ్లేమైనా ప్రభాస్, మహేష్ బాబులా..! వల్లభనేని వంశీ స్ట్రాంగ్ కౌంటర్.. మళ్లీ గరంగంగా గన్నవరం..


ఈ ఘటనతో బందరు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వర్గంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ.. ఆ తర్వాత ఏకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బందరులో పేర్ని నాని ఆగడాలకు అంతేలేకుండా పోతోందని.. మూడేళ్లుగా ఒక్క కార్యక్రమానికి కూడా తనను పిలవలేదని ఆయన ఆరోపించారు. అంతేకాదు ఇతర పార్టీకి చెందిన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ తో అంటకాగుతున్నారని బాంబు పేల్చారు. అంతేకాదు తన ప్రత్యర్థి, టీడీపీకి చెందిన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను వారంవారం కలుస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు.

ఐతే పార్టీలో అసంతృప్తుల సంగతి పక్కనబెడితే.., పేర్నినానికి మంత్రిపదవి ఉన్నంత కాలం ఎంపీ బాలశౌరి సైలెంట్ గానే ఉన్నారు. నానిని కేబినెట్ నుంచి తప్పించిన తర్వాత అసమ్మతి బయటపడింది. మంత్రిగా ఉండగా పేర్ని నాని.. ఎంపీని జనంలోకి రాకుండా అడ్డుకున్నారనేది బాలశౌరి ఆరోపణల ద్వారా తెలుస్తోంది. ఇన్నాళ్లు ఇంత జరుగుతుంటే ఎంపీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లలేదా.. ఒకవేళ ఇంటర్నల్ మీటింగ్స్ లో చెప్పినా.. పేర్ని నాని తన మాటనెగ్గించుకున్నారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదు. తాజాగా ఈ లిస్టులో కృష్ణాజిల్లా చేరడం వైసీపీ అధిష్టానానికి పెద్ద తొలనొప్పే.

First published:

Tags: Andhra Pradesh, Perni nani, Ysrcp

ఉత్తమ కథలు