AP POLITICS NEW HEADACHE FOR ANDHRA PRADESH CM YS JAGAN IF HE OPTS YV SUBBA REDDY FOR RAJYA SABHA SEAT AK
YS Jagan: జగన్ అలాంటి నిర్ణయం తీసుకుంటారా ? కొత్త తలనొప్పి తెచ్చుకుంటారా ?
సీఎం జగన్ (పాత ఫొటో)
AP Politics: విజయసాయిరెడ్డికి మరోసారి రాజ్యసభ సీటు దక్కడం ఖాయమనే చర్చ ఓ వైపు జరుగుతుంటే. ఆయన స్థానంలో ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లను సీఎం జగన్ పరిశీలిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏపీ నుంచి త్వరలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లు వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి. ఈ నాలుగు స్థానాల కోసం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎవరిని ఎంపిక చేయబోతున్నారన్న అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. అయితే కీలక పదవులను భర్తీ చేసే సమయంలో సామాజిక సమీకరణాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటున్న సీఎం జగన్.. ఈ నాలుగు పదవుల విషయంలోనూ అదే రకమైన ఫార్ములాను ఫాలో అవుతారనే చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డిని(Vijayasai Reddy) తిరిగి జగన్ రాజ్యసభకు ఎంపిక చేస్తారా ? అన్నది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
విజయసాయిరెడ్డికి మరోసారి రాజ్యసభ సీటు దక్కడం ఖాయమనే చర్చ ఓ వైపు జరుగుతుంటే. ఆయన స్థానంలో ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) పేర్లను సీఎం జగన్ పరిశీలిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పదవికి వైవీ సుబ్బారెడ్డిని ఎంపిక చేస్తే సీఎం జగన్‌కు కొత్త తలనొప్పులు రావడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఒకవేళ వైవీ సుబ్బారెడ్డిని (YV Subba Reddy) రాజ్యసభకు పంపితే.. ఆయనను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించాల్సి ఉంటుంది.
అదే జరిగితే ఆ పదవిని మరొకరికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏపీలో మంత్రి పదవితో సమానమైన ప్రాధాన్యత ఉంటే టీటీడీ చైర్మన్ పదవికి పోటీ పడే వారి జాబితా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఈ పదవి ఖాళీ అయితే.. దీన్ని ఆశించే వారిలో జగన్ సన్నిహితులే అనేక మంది ఉంటారని చెప్పనవసరం లేదు.
ఇక ఇటీవల మంత్రివర్గం నుంచి తప్పించిన నేతలు కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ పదవి కోసం మరో నాయకుడిని ఎంపిక చేయడం సీఎం జగన్‌కు అంత ఈజీ కాదని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకే టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపించే విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వైసీపీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.