హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వైసీపీ మీడియంలో చదివితే అంతే... ఏపీ మంత్రిపై జోరుగా ట్రోలింగ్

వైసీపీ మీడియంలో చదివితే అంతే... ఏపీ మంత్రిపై జోరుగా ట్రోలింగ్

ఏపీ మంత్రి కొడాలి నాని

ఏపీ మంత్రి కొడాలి నాని

మంత్రి కొడాలి సన్నబియ్యంపై చేసిన కామెంట్స్ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఏపీలో సన్నబియ్యం సరఫరాపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యలకు స్పందిస్తూ.. మంత్రి కొడాలి సన్నబియ్యంపై చేసిన కామెంట్స్ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కొడాలి గతంలో సన్నబియ్యం సరఫరా చేస్తామన్న న్యూస్‌తో పాటు.. తాజాగా చేసిన వ్యాఖ్యల్ని సరిపోల్చుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సన్నాసి సన్న బియ్యం - మాటిచ్చినా ఎవ్వరికీ ఇయ్యం!’ అంటూ జనసేన శతఘ్ని టీమ్ ట్విట్టర్లో ట్రోలింగ్ ప్రారంభించింది. తెలుగు మీడియంలో చదివినోడు నాన్న అంటాడు.. ఇంగ్లీషు మీడియంలో చదివినోడు డాడీ అంటాడు.. వైసీపీ మీడియంలో చదివినోడు అలాగే అంటారంటూ మంత్రి కొడాలిని ఆడేసుకుంటున్నారు. మరి దీనిపై మంత్రి ఏ విధంగా సమాధానం ఇస్తారో చూడాల్సిందే.
First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Janasena, Janasena party, Kodali Nani, Ysrcp

ఉత్తమ కథలు