హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ramgopal Varma: నాకెందుకు దండేశారంటూ RGV ట్వీట్‌ .. రాంగోపాల్‌వర్మపై సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్

Ramgopal Varma: నాకెందుకు దండేశారంటూ RGV ట్వీట్‌ .. రాంగోపాల్‌వర్మపై సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Ramgopal Varma: సోషల్ మీడియా పోస్ట్‌లు, రివ్యూలు, ఏవైనా తనదైన స్టైల్లో పంచ్‌లతో కూడిన పోస్ట్‌లు పెట్టడం వార్తల్లో నిలవడం ఒక్క ఆర్జీవీకే సాధ్యం. అయితే రీసెంట్‌గా రాంగోపాల్‌వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోతో పాటు పెట్టిన పోస్ట్‌కు న్యూట్రల్ రెస్పాన్స్ వస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏ విషయాన్నైనా కాంట్రవర్సీ చేయడంలో ధిట్టా డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ(Ramgopal Varma). సినిమాలు, రాజకీయాలు, సోషల్ మీడియా(Social media) పోస్ట్‌లు, రివ్యూలు, ఏవైనా తనదైన స్టైల్లో పంచ్‌లతో కూడిన పోస్ట్‌లు పెట్టడం వార్తల్లో నిలవడం ఒక్క ఆర్జీవీకే సాధ్యం. అయితే రీసెంట్‌గా రాంగోపాల్‌వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోతో పాటు పెట్టిన పోస్ట్‌కు న్యూట్రల్ రెస్పాన్స్ వస్తోంది. ప్రొడ్యూసర్ దాసరి కిరణ్(Dasari Kiran)బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పేందుకు వెళ్లిన ఆర్జీవీ మెడలో పెద్ద పూలదండ వేశారు. అంతే దానికి ఆయన ఎంతో సెటైరికల్‌గా ట్వీట్ (Tweet)చేశారు. రాంగోపాల్‌వర్మ రియాక్షన్‌పై నెటిజన్లు (Netizens)అంతే కొంటెగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇంకా గమ్మత్తేన విషయం ఏమిటంటే ఆ ప్రొడ్యూసర్ మా వ్యూహం అనే పొలిటికల్ సినిమా తీస్తున్నందున అటు టీడీపీ, ఇటు వైసీపీ ఫాలోవర్స్‌ రియాక్ట్ అవుతున్నారు.

Ananya Panday: అందాల ఆరబోతలో లైగర్ బ్యూటీ రచ్చ .. అనన్యపాండేను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ఆర్జీవీ పోస్ట్‌పై ట్రోలింగ్ ..

తనపై తానే జోకు వేసుకునే ప్రయత్నం చేసిన ఆర్జీవీపై నెటిజన్లు వింతగా స్పందిస్తున్నారు. ఎవరెలా స్పందించినా ఈక్రేజీ డైరెక్టర్ ఏమాత్రం రియాక్షన్ ఇవ్వకుండా లైట్ తీసుకుంటారు. ఈసారి అదే జరుగుతోంది. ఏపీ పాలిటిక్స్‌పై మా వ్యూహం అనే సినిమా తీసేందుకు సిద్దమయ్యారు డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ. అయితే ఆ మూవీ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ పుట్టిన సెలబ్రేషన్‌కి వెళ్లిన ఆర్జీవీకి పెద్ద పూలదండ వేశారు. అప్పుడు హ్యాపీగా రిసీవ్ చేసుకున్న వర్మ..ట్విట్టర్‌లో ఫోటోని షేర్ చేసి మా వ్యూహం ప్రొడ్యూసర్‌ దాసరి కిరణ్‌కుమార్ బర్త్ డే అయితే నాకెందుకు దండేశారో నాకర్ధం కాలేదని చెబుతూనే ప్రొడ్యూసర్‌కి విషెస్ చెప్పారు.

పొలిటికల్ సెటైర్లు..

అయితే రాంగోపాల్‌వర్మ ట్వీట్‌కి టీడీపీ అభిమానులు ఘాటుగా స్పందించారు. ఓ గొర్రెను బలిస్తున్న ఫోటోని షేర్ చేసి బలి ఇవ్వబోయే మేకపోతుకు దండ వేస్తారు..ఈఫోటోలో మర్చిపోయారు.నీకు మాత్రం మర్చిపోకుండా వేశారు. నువ్వు తీయబోయే సినిమా వైసీపీ గొర్రెల కోసమే అందుకే సింబాలిక్‌గా నీకు దండ వేశారు..కొన్ని లక్షల గొర్రెల కోసం ఒక గొర్ర సినిమా తీస్తోందంటూ సెటైర్లు వేశారు.

గంటలోనే వేల లైక్‌లు..

టీడీపీ అభిమానుల ట్వీట్‌తో వైసీపీ ఫాలోవర్స్‌ ట్వీట్ చేసి వర్మను అభినందిస్తున్నారు. రాళ్లు వేసిన చోటే పూల వర్షం కురిపించడం అనేది ఒక్క ఆర్జీవీకే సాధ్యమని నిరూపించారు సార్ ..మొదటి నుంచి మీరిలాగే సన్మానాలను స్వీకరించి ఉంటే మిమ్మల్ని నమ్ముకొని మరి కొందరికి పూలు వ్యాపారం పేరుతో జీవనోపాధి లభించేదని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్..

అయితే ఈ ట్వీట్‌ షేర్ చేసిన గంటలోపే ఐదు వేల లైక్‌లు వచ్చాయంటే ఆర్జీవీ గ్రేస్ ఇంకా పడిపోలేదని ..ఆయనకు సోషల్ మీడియాలో పొలిటికల్ పాలోవర్స్‌ కూడా గట్టిగానే ఉన్నారని తెలుస్తోంది.

First published:

Tags: Andhra pradesh news, Ramgopal varma, Tollywood

ఉత్తమ కథలు