Home /News /andhra-pradesh /

AP POLITICS NELLORE YCP LEADERS INTERNAL FIGHT WILL DAMAGE TO PARTY IS THERE ANY EFFECT ON ATAMKUR BY ELECTIONS NGS

AP Politics: అధిష్టానం చెప్పినా తీరు మారలేదా..? ఆ ఇద్దరి నేతల మధ్య దూరం పెరుగుతోందా..?

మాజీ వర్సెస్ తాజా మంత్రి

మాజీ వర్సెస్ తాజా మంత్రి

AP Politics: ప్రస్తుత మంత్రి- మాజీ మంత్రి మధ్యా గ్యాప్ మరింత పెరుగుతోందా..? అధిష్టానం సీరియస్ గా క్లాస్ పీకినా ఇద్దరు నేతలు.. దారి మార్చుకోవడం లేదా..? కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్నా.. ఆత్మకూరు ఉప ఎన్నికతో ఆ హీటు మళ్లీ బయటకొచ్చిందా..? అధికార పార్టీలో ఏం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
    AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార పార్టీలో ఇద్దరు కీలక నేతల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. అందులో ఒకరు ప్రస్తుత మంత్రి కాగా.. మరొకరు మాజీ మంత్రి.. ఇద్దరూ నెల్లూరు రాజకీయాల్లో (Nellore Politics) కీలకంగా ఉన్నారు. అలాంటి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. అయితే దీనిపై గతంలో అధిష్టానం సీరియస్ అయ్యింది. ఇద్దర్నీ సీఎం క్యాంప్ ఆఫీస్ కు పిలిపించి.. మరీ క్లాస్ పీకినా ఇద్దరి తీరు మారలేదని ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తరగటం లేదు. తాజాగా ఆత్మకూరు ఉప ఎన్నిక (Atmakur By poll) సందర్భంగా ఈ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మొదట రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ తరువాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav).. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardan Reddy) ల మధ్య విభేదాలు తీవ్రం అయ్యాయి. మంత్రి కాకాణికి తాను రెట్టింపు సహకారం అందిస్తామని అనిల్ కుమార్ సెటైర్లు వేయడంతో విషయం బహిరంగమైంది. కాకాణికి శుభాకాంక్షలు చెప్తూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించేయడంతో అనిల్-కాకాణి వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. మంత్రిగా ప్రమాణం చేసిన తరువాత.. మొదటిసారిగా నెల్లూరుకు వస్తున్న సందర్భంగా గోవర్ధన్ రెడ్డి అనుచరులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇదే రోజున నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో వివాదం మరింత ముదిరింది.

    ఈ విషయంపై అప్పట్లో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఎవరూ విమర్శలు చేసుకోకుండా సభలు నిర్వహించుకోవాలని సర్ది చెప్పారు. తరువాత సీఎం జగన్ స్వయంగా కాకాణి.. అనిల్ కుమార్ యాదవ్‌లతో ప్రత్యేకంగా సమావేశమై సర్ది చెప్పారు. కలిసికట్టుగా పని చేయాలని.. పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఆ తరువాత ఇద్దరు నేతలు సైలెంట్ గానే కనిపించారు. అంతా సర్దుకుంది అనుకుంటున్న సమయంలో మళ్లీ విబేధాలు తెరపైకి వచ్చాయి. నెల్లూరులో మంత్రి కాకాణి నిర్వహిస్తున్న అధికారిక సమావేశాలకు అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడం లేదు. 

    తాజాగా అనిల్ కుమార్ యాదవ్‌తో కోవూరు ఎం.ఎల్.ఏ.నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జత కట్టారని ప్రచారం ఉంది. కాకాణికి మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి ఆయనపై ప్రసన్న కుమార్ రెడ్డి గుర్రుగానే ఉన్నారు. సీఎం ఆదేశాల మేరకు అనిల్ కుమార్..ప్రసన్న కుమార్ రెడ్డిల ఇళ్లకు కాకాణి వెళ్లి సహకరించలని కోరారు. కానీ వాళ్ళు మాత్రం విరోధ ధోరణిలోనే కొనసాగుతున్నారని వైసీపీ వర్గాల్లో టాక్. ప్రసన్న కుమార్ రెడ్డి కూడా కాకాణి నిర్వహిస్తున్న సమావేశాలకు రావడం లేదు. ఆయన అనుచరులు కొందరు అధికారిక పదవుల్లో ఉన్నా వారు కూడా కాకాణికి దూరంగానే ఉంటున్నారు.

    ఇదీ చదవండి : జనసేన కోసం ఆ సీటును టీడీపీ రిజర్వ్ చేసిందా..? అందుకే బాధ్యతలు ఎవరికీ ఇవ్వడం లేదా..?

    ఇప్పుడు ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికల్లోనైనా నేతలు కలిసికట్టుగా పని చేస్తారని భావించారు. అక్కడా సేమ్ సీన్‌ రిపీటైంది.. వై.సి.పి.అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆత్మకూరుకు సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విక్రమ్ రెడ్డి నామినేషన్‌లో పాల్గొనేందుకు అనిల్ కుమార్ యాదవ్.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు ఆలయం దగ్గరకు వచ్చారు. ఇదే సమయంలో మంత్రి కాకాణి కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారనే సమాచారం అందింది. కాకాణి వస్తే ఆయనతో మాట్లాడాల్సి వస్తుందనో లేక మంత్రిగా ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం మర్యాద ఇవ్వాల్సి వస్తుందనో.. ఏమో అభ్యర్థిని హడావుడిగా అభినందించి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనకుండా అనిల్‌.. ప్రసన్నకుమార్‌లు నెల్లూరుకు వెళ్లిపోయారు.

    ఇదీ చదవండి : పవన్ కు వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు.. ఆయన పోరాటం పొత్తుల కోసమే..

    నామినేషన్ కార్యక్రమానికి విక్రమ్ రెడ్డి చిన్నాన్న…ఉదయగిరి ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలంలో చంద్రశేఖర్ రెడ్డికి గట్టి పట్టు ఉంది. ఆయన నామినేషన్‌కు రాకపోవడంతో ఎన్నికలలో ఏ మాత్రం సహకరిస్తారనే విషయంపై అనుమానాలు ఉన్నాయి. అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డితో ఉన్న విభేదాల వల్లే చంద్రశేఖర్ రెడ్డి రాలేదని భావిస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP News, Nellore, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు