నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లడం దాదాపుగా ఖాయమైంది. ఈ విషయం వైసీపీ ముఖ్యనేత, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలతో స్పష్టమైంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని ఆయన ఆరోపించారు. ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. వెళ్లే వాళ్లు వెళ్లకుండా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు. శ్రీధర్ రెడ్డిని బుజ్జగించి చూశామన్న మాజీమంత్రి బాలినేని.. పార్టీని వీడినందుకు ఆయన బాధపడే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. ఇక శ్రీధర్ రెడ్డి స్థానంలో త్వరలోనే కొత్త ఇంఛార్జ్‌ను నియమిస్తామని తెలిపారు.
కొద్దిరోజుల క్రితం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ ఆరోపణలు ఏపీ రాజకీయాలు, వైసీపీ వర్గాల్లో కలకలం రేపాయి. తాజాగా కోటంరెడ్డి(Kotamreddy Sridhar Reddy) తన అనుచరులతో మాట్లాడినట్టుగా ఉన్న ఓ ఆడియో లీక్ అయింది. ఈ ఆడియో ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని... ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను తాను బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు పోతాయని ఆయన అన్నారు. వైసీపీ(Ysrcp) ప్రభుత్వం షేక్ అవుతుందని... కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ వేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజల మేలు కోసమే తాను పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడానని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తన సన్నిహితులతో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారని నిర్ధారణకు వచ్చిన వైసీపీ అధినాయకత్వం.. నష్టనివారణ చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
ఇటీవల ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) పార్టీ క్రమశిక్షణను అతిక్రమించిన సందర్భంలో ఆయన స్థానంలో వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని ఇంఛార్జ్‌గా నియమించింది వైసీపీ నాయకత్వం. ఆ రకంగా ఆనం రామనారాయణరెడ్డికి చెక్ చెప్పేందుకు పావులు కదిపింది.
Big Breaking: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
Big News: టీడీపీ నుంచి పోటీ..కలకలం రేపుతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో
తాజాగా కోటంరెడ్డి విషయంలోనూ వైసీపీ నాయకత్వం ఇదే రకమైన వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అక్కడ ఎవరిని ఇంఛార్జ్‌గా నియమిస్తే.. వారికే వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుంది ? వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తారని ప్రచారంలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై వైసీపీ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.