హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Atmakuru By Poll: ఆత్మకూరు ఏకగ్రీవం కానట్టేనా..? పోటీలో బీజేపీ..? టీడీపీ లెక్క ఏంటి..? నేటి నుంచి నామినేషన్లు

Atmakuru By Poll: ఆత్మకూరు ఏకగ్రీవం కానట్టేనా..? పోటీలో బీజేపీ..? టీడీపీ లెక్క ఏంటి..? నేటి నుంచి నామినేషన్లు

మేకపాటి విక్రమ్ రెడ్డి (ఫైల్)

మేకపాటి విక్రమ్ రెడ్డి (ఫైల్)

Atmakuru By Poll: ఆత్మకూరు ఏకగ్రీవం అవుతుంది అంటే లెక్కలు తప్పాయా..? ఈ లెక్కలు తప్పడానికి వైసీపీ నిర్ణయమే కారణమా..? లేక విపక్షాలు ఈ ఎన్నికను సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నాయా..? ఏది ఏమైనా ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవమా..? కాదా అన్నది ఒకటి రెండు రోజుల్లోనే క్లారిటీ వస్తుంది.. బీజేపీ అయితే దాదాపు పోటీకి సిద్ధమనే సంకేతాలు వస్తున్నాయి. మరి టీడీపీ పరిస్థితి ఏంటి?

ఇంకా చదవండి ...

  Atmakuru By Poll: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇప్పటికే రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఎక్కడ చూసినా ఎన్నికలలాంటి హడావుడే  కనిపిస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో బిజీ అయ్యాయి. ప్రధాన నేతలంతా జనం బాట పడుతున్నారు. ఇదే సమయంలో సెమీ ఫైనల్ అంటూ ఓ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. అయితే ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం అంతుందని అంతా అనుకున్నారు.. ఇప్పుడు పరిస్థితి మారేలా ఉంది. ఈ ఎన్నికను ఒకటి రెండు రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే నెల్లూరు జిల్లా (Nellore)లలోని ఆత్మకూరు ఉప ఎన్నికకు (Atamakuru By Poll) నోటిఫికేషన్ వెలువడింది. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నామినేషన్లే వేసేందుకు జూన్ 6న వరకు చివరి గడువు ఉంది. మరి ప్రధాన పార్టీలు ఏ రోజు నామినేషన్ వేస్తాయో చూడాలి.. నామినేషన్ వేసిన తరువాత ఉప ఎన్నిక ఏకగ్రీవమా..? పోటీ అనివార్యమా అన్నది తేలనుంది. ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి జూన్ 23న పోలింగ్ జరగనుంది. ఈనెల 26న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి (Mekapati Goutham Reddy) ఫిబ్రవరి 21వ తేదీన హఠాన్మరణంతో ఈ ఉప ఎన్నికల జరగనుంది.

  సాధారణంగా ఏపీ రాజకీయాల్లో ఓ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే కుటుంబ సభ్యులకు సిట్ ఇస్తే పోటీ చేయకూడదని కొన్ని పార్టీలు లైన్ పెట్టుకున్నాయి. అందుకే గత బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ (TDP) ఇదే నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారంగానే పోటీనుంచి తప్పుకుంది. అయితే ఆత్మకూరు లో ఏం చేస్తారనేది ఇంకా తేలలేదు. సాధారణంగా మేకపాటి గౌతమ్ రెడ్డికి సౌమ్యుడిగా.. వివాద రహితుడిగా పేరుంది. అన్ని పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా పోటీ తప్పేలా లేదు.

  ఇదీ చదవండి : దైవ దర్శనానికి వెళ్లి వస్తూ తిరిగి రాని లోకానికి.. పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

  మొదట వైసీపీ ఈ సీటును గౌతమ్ రెడ్డికి భార్యకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ వైసీపీ అభ్యర్థిగా విక్రమ్‌ రెడ్డి (Vikram Reddy) ని ప్రకటించారు సీఎం జగన్ (CM Jagan). అయితే టీడీపీ విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ (BJP) మాత్రం ఖచ్చితంగా బరిలోకి దిగుతామని ఇదివరకే ప్రకటించింది. బీజేపీ నుంచి పోటీలో అదే కుటుంబానికి చెందిన వ్యక్తి సిద్ధమయ్యారు కూడా. మేకపాటి మేనల్లుడే స్వయంగా బరిలో దిగనున్నారని బీజేపీ సైతం సంకేతలు ఇచ్చింది. బీజేపీ పోటీలో ఉంటే మిత్రపక్షమైన జనసేన (Janasena) మద్దతు తప్పక ఉండాలి.. మరి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జనసేన సానుభూతితో పోటీకి దూరంగా ఉంటుందో.. జనసేనకు- బీజేపీకి గ్యాప్ పెరిగిందనే వార్తల నేపథ్యతో మద్దతు ఇస్దుందో చూడాలి. బద్వేల్ ఉప ఎన్నిక విషయంలో జనసేన సైతం తప్పుకుంది. ఇక టీడీపీ మొదటి నుంచి పోటీకి దూరంగా ఉంటారనే ప్రచారం ఉంది. కానీ ఇటీవల నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం వెంకటరామనారాయణ రెడ్డి (Anam Venkata Ramanarayana Reddy) కుమార్తె కైవల్యా రెడ్డి (Kaivalya reddy), అల్లుడు రితేష్ రెడ్డి (Ritesh Reddy).. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ను కలిశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నుంచి పోటీ చేసేందుకు కైవల్యా రెడ్డి ఆసక్తి చూపినట్టు సమాచారం. మరి దీనిపై టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

  ఇదీ చదవండి : వల్లభనేని వంశీ యూటర్న్.. టీడీపీ గొప్ప పార్టీ అంటూ పొగడ్తలు.. కారణం అదేనా..?

  ఆత్మకూరు స్థానానికి గౌతంరెడ్డి వారసుడిగా ఆయన తమ్ముడు మేకపాటి విక్రమ్‌రెడ్డిని వైసీపీ ఇప్పటికే ఖరారు చేసింది. రాజకీయాలకు దూరంగా, పూర్తిగా వ్యాపారానికే పరిమితమైన విక్రమ్‌రెడ్డి కుటుంబ సభ్యుల కోరిక మేరకు రాజకీయ ఆరంగేట్రం చేశారు. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు పరిచయమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. బీజేపీ పోటీ తప్పదని సంకేతాలు ఇస్తున్నాయి. అయితే అది కేవలం ద్విముఖ పోరు ఉంటుందా.. లేదా అన్నది చూడాలి.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. దీని విషయమై ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ఎంపీలు మరణించిన పక్షంలో వారి కుటుంబ సభ్యులకు టిక్కెట్టు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ సంప్రదాయం వుంది. దీనిని బట్టి ఆత్మకూరులో టీడీపీ పోటీ చేయకపోవచ్చని ఆ పార్టీ జిల్లా నాయకత్వం అంటోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా బరిలో నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సమర్థుడైన అభ్యర్థి కోసం ఆ పార్టీ సీనియర్‌ నాయకులు గాలిస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Bjp, Nellore, TDP, Ycp

  ఉత్తమ కథలు