Home /News /andhra-pradesh /

AP POLITICS NDA PRESIDENTIAL CANDIDATE DRAUPADI MURMU VISITS ANDHRA PRADESH AND MET WITH YSRCP MPS AND MLAS FULL DETAILS HERE PRN BK

Draupadi Murmu: ద్రౌపది ముర్ముకు మద్దతు అందుకే..! ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు..!

ద్రౌపది ముర్ముతో సీఎం జగన్

ద్రౌపది ముర్ముతో సీఎం జగన్

ఎన్‌డీఏ (NDA) రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపతి ముర్ము (Draupadi Murmu) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పర్యటించారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అయ్యారు.

    ఎన్‌డీఏ (NDA) రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పర్యటించారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSR Congress Party) తన అభ్యర్ధిత్వానికి మద్ధతు తెలియజేసిన నేపధ్యంలో రాష్ట్రానికి వచ్చిన ద్రౌపది ముర్ము తొలుత తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం జగన్ దంపతులు.. ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. సీఎం నివాసం నుంచి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ కు వెళ్లారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను సీఎఎం జగన్., ద్రౌపతి ముర్ముకి పరిచయం చేశారు. ఈ సమావేశంలో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముని మనం అంతా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని., మొట్టమొదటిగా గిరిజన మహిళ ఈ దేశ రాష్ట్రపతిగా ఎన్నుకోబడుతున్నారని జగన్ అన్నారు. మొదటి సారిగా గిరిజన మహిళ దేశ రాష్ట్రపతి అవుతున్నారన్నారు. మన పార్టీ మొదటి రోజు నుంచి ఏ రకంగా సామాజిక న్యాయంవైపున ఉంటుందో అందరికీ తెలుసన్న జగన్.., సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం మనదేనన్నారు. అందులో భాగంగానే మరో అడుగు ముందుకు వేస్తూ ఇవాళ ద్రౌపది ముర్ముని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్ణయాన్ని సహృదయంతో బలపరచాలని పిలుపునిచ్చారు.

    ఇది చదవండి: ఆ జిల్లాలకు రూ.8కోట్ల సాయం.., అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు..


    18న జరిగే ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరూ మిస్‌ కాకుండా ఓటు వేయాలి. అందరూ వచ్చి ఓటువేసేలా విప్‌లంతా ఈ బాధ్యత తీసుకోవాలని జగన్ స్పష్టం చేశారు. 18వ ఉదయం మాక్‌ పోలింగ్‌లో పాల్గొని ఆతర్వాత ఓటింగ్‌కు వెళ్లాలని జగన్ సూచించారు. దీని వల్ల ఓటింగ్‌ లో తప్పులు జరక్కుండా నివారించగలుగుతామని అన్నారు. వేసిన ప్రతి ఓటు చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలని.., జాగ్రత్తలు తీసుకుని ఓటు వేస్తే అన్నీ చెల్లుబాటు అవుతాయన్నారు.

    ఇది చదవండి: ఏపీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందడం ఎలా..? ఎలా అప్లై చేయాలి..? పూర్తి వివరాలివే..


    ఎంపీల వైపు నుంచి సాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే వైపు నుంచి విప్‌లు, మంత్రులు అందరూ వచ్చేలా చూసుకోవాలని గన్ సూచించారు. మంత్రులందరూ వారి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ మిస్‌ కాకుండా ప్రతిఒక్కరూ కూడా హాజరయ్యేలా బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడుతున్నప్పుడు మన వైపు నుంచి ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు సీఎం.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Draupadi Murmu, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు