Home /News /andhra-pradesh /

AP POLITICS NATIONAL SURVEYS SAYS ONCE AGAIN YSRCP WILL GRAND VICTORY HOW MAY SEATS YCP GET NGS

AP Political Survey: ఏపీలో అధికారం ఆ పార్టీదే.. జాతీయ ఛానెల్ సంచలన సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు..?

 చంద్రబాబు, జగన్, పవన్.. (ఫైల్)

చంద్రబాబు, జగన్, పవన్.. (ఫైల్)

AP Political Survey: ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల్లో విజయం ఎవరిది.. సీఎం జగన్ కు ప్రజలు రెండో ఛాన్స్ ఇస్తారా..? లేదా మళ్లీ చంద్రబాబు అనుభవానికి ఓటేయాలి అనుకుంటున్నారా.. వైసీపిని గద్దె దించుతాం అంటున్న జనసేన ప్రభావం ఎంత..? తాజాగా ఓ జాతీయ ఛానెల్ విడుదల చేసిన సర్వే సంచలనంగా మారింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    AP Political Survey: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో.. ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఇప్పటికైతే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అన్నదానిపై క్లారిటీ లేదు. ముందుస్తు ఉంటాయా..? 2024లోనే ఎన్నికలు జరుగుతాయా అన్నదానిపై అధికార పార్టీ పెదవి విప్పడం లేదు. కానీ అన్ని పార్టీలు ఇప్పుడు.. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లాయి. ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇదే సమయంలోవరుస జాతీయ ఛానెళ్ల సర్వేలు హల్ చల్చేస్తున్నాయి. ఆ మధ్య ఇండియా టీవీ ఏపీలో ఎంపీ సీట్లు ఏ పార్టీకి ఎన్ని వస్తాయి.. అసెంబ్లీ సీట్లలో ఎవరికి ఎన్ని వస్తాయి అన్నదానిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వెంటనే ఇండియా టుడే –సీ ఓటర్‌ కలిసి మూడ్ ఆఫ్ ది నేషన్ (Moon of the Nation) పేరుతో నిర్వహించిన సర్వే లో.. ఏపీలోని పరిస్థితిపైనా క్లారిటీ ఇచ్చింది. తాజాగా టైమ్స్ నౌ సంస్థ సంచలన సర్వే ఫలితాలను ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అధికార వైసీపీ (YCP) మళ్లీ ఘన విజయం సాధిస్తుందని ఈ మూడు సర్వేలు తేల్చి చెప్పాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 40 నెలలు పూర్తి అవుతున్నాఇప్పటికి ప్రజల్లో అధికార పార్టీకి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక సర్వేలకు భిన్నంగా జాతీయ సర్వేలు ఉండడం సంచలనంగా మారింది.

    తాజాగా టైమ్స్ నౌ సైతం.. అధికార వైసీపీ మరోసారి ఘన విజయం సాధిస్తుందని తేల్చి చెప్పింది. ఆగస్టు 15 వరకు జరిపిన సర్వే ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ దాదాపు 17 నుంచి 23 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చింది. అయితే గత ఎన్నికల్లో 22 సీట్లు వైసీపీ గెలుచుకోగా..? టీడీపీ మూడు ఎంపీ సీట్లకు పరిమితమైంది. ఒకవేళ ఈ సర్వే చెప్పినట్టు వైసీపీ 17 ఎంపీ సీట్లు వస్తే.. టీడీపీకి రెండు సీట్లు పెరుగుతాయి.. అదే 23 సీట్లు వైసీపీ ఖాతాలోకి వస్తే.. గత ఎన్నికల కంటే వైసీపీ ఇమేజ్ రెట్టింపు అయింది.



    కానీ ఇటీవల ఇండియా టీవీ సర్వేలో అయితే వైసీపీకి 19 ఎంపీ సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. కొన్ని రోజుల వ్యవధిలో వచ్చిన ఇడియా టుడే -సీ ఓటర్ సర్వేలో వైసీపీకి 18 ఎంపీ సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. అయితే టైమ్స్ నౌ మాత్రం నిర్ధిష్టంగా ఒక సంఖ్య చెప్పకుండా 17 నుంచి 23 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. ఒకవేళ 17 సీట్లకే పరిమితమైతే.. రాను రాను వైసీపీ బలం కాస్త తగ్గుతున్నట్టే.. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ప్రతిపక్షాల పొత్తులపై క్లారిటీ లేదు. ఆ క్లారిటీ వచ్చిన తరువాత.. సర్వే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజా సర్వేలతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

    ఇదీ చదవండి : ఏపీ మాజీ మంత్రికి కేజీఎఫ్ డైరెక్టర్ ఏమవుతాడో తెలుసా? ప్రశాంత్ నీల్ అసలు పేరేంటంటే?

    అయితే ఇప్పటి వరకు వచ్చిన మూడు జాతీయ పార్టీల సర్వేలు చూస్తే.. ఆ లెక్కన అసెంబ్లీ స్థానాలను బేరీజు వేసుకుంటే.. దాదాపు 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు నెగ్గే అవకాశం ఉంటుంది. అయితే సీఎం జగన్ మాత్రం టార్గెట్ 175 అనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నారు. కుప్పంలోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Pawan kalyan

    తదుపరి వార్తలు