Three Capitals issue: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం అమరావతి రాజధాని (Amaravati Capital)గా పాలన చేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం (YCP Government) వచ్చిన తరువాత.. మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తెచ్చింది. అది అమల్లోకి తెచ్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు.. కానీ న్యాయస్థానాల్లో సమస్యలు ఎదురవ్వడంతో అది ప్రతిపాదన దిశలోనే ఉండిపోయింది. బిల్లులను సైతం ఉపసంహరించుకోక తప్పలేదు.. మూడు రాజధానుల బిల్లు (Three Capital Bill) ను అయితే వెనక్కు తీసుకుంది.. కానీ.. అమరావతే రాజధాని అన్నవిషయాన్ని ఒప్పుకోవడం లేదు.. కచ్చితంగా మూడు రాజధానులు తెచ్చే తీరుతామని ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తోంది. త్వరలో మరో కొత్త బిల్లు తెచ్చే ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసింది. దీనిపై కేంద్రం కూడా డబుల్ స్టాండ్ తో ఉంది. ఎందుకంటే పార్లమెంట్ లో ఏపీ రాజధానులపై ప్రశ్నించినప్పుడు.. రాజధాని ఏది అన్నది.. రాష్ట్ర ప్రభుత్వ (State Government) ఇష్టం అంటోంది. అమరావతినే రాజధానిగా ప్రకటించడం కుదరదని తేల్చి చెప్పేస్తోంది. కానీ పార్టీ పరంగా అమరావతే రాజధాని అంటూ మద్దతు ఇస్తోంది. పార్టీ విధానం ఒకటై.. కేంద్ర ప్రభుత్వం (Central Government) విధానం మరొకటిగా ఉంది. ఈ సమయంలో మూడు రాజధానుల విషయంలో ఆర్ఎస్ఎస్ కార్యవర్గ సభ్యుడు.. బీజేపీ కీలక నేత రాంమాధవ్ (Ram Madhav) సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఆయన పరోక్షంగా విమర్శించారు. ఆఖరి వ్యక్తి వినిపించే గళానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని.. బలవంతులపై బలహీనులకు అధికారం దక్కాలని అదే అసలైన స్వాతంత్ర్యానికి అర్థం అని అన్నారు. రాజధానులు ఎక్కడ ఉండాలో పాలకులు నిర్ణయించకూడదంటూ పరోక్షంగా ఏపీ ప్రభుత్వం తీరును తప్పు పట్టారు.
ఇదీ చదవండి : ఛీ ఛీ మీరు మనుషులేనా..? దహనసంస్కారం విషయంలో 2 గ్రామాల మధ్య ఘర్షణ..
విజయవాడలో ది హిందూత్వ నమూనా.. చర్చాకార్యక్రమంలో పాల్గొన్న రాం మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో రాజధాని, నెల్లూరులో ఓ రాజధాని అంటూ పాలకులు రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించకూడదని.. ప్రజల ఆకాంక్ష మేరకే రాజధాని ఉండాలని రాం మాధవ్ అన్నారు. ఇలా పార్టీ నేతలు రాజధాని విషయంలో ఒక స్టాండ్ తీసుకుంటే.. కేంద్రం ప్రభుత్వం మాత్రం మరో స్టాండ్ తీసుకుంది. దీంతో బీజేపీ నేతల్లోనూ గందరగోళం తప్పడం లేదు. నిజంగా కేంద్రం తలచుకుంటే.. అమరావతిని రాజధానిగా ప్రకటించడం పెద్ద కష్టమేమి కాదు.
ఇదీ చదవండి : వైసీపీ-జనసేన మధ్య పేలుతున్న పంచ్‌లు.. కేటీఆర్ ట్వీట్ తో ప్రారంభం.. రంభల రాంబాబు అంటూ బండ్ల ఎంట్రీ
మరోవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల నుంచి వెనక్కు తగ్గేదే లే అంటోంది. అమరావతికి భూములిచ్చిన రైతులంతా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అమరావతి ఒక్కటే రాజధాని అనే ప్రకటన ప్రభుత్వం చేసే వరకు తమ దీక్ష కొనసాగుతుందని అని తేల్చి చెబుతున్నారు.
ఇదీ చదవండి : పిడుగుపాటుతో నలుగురు కూలీల దుర్మరణం.. ఆ సమయంలో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?
కానీ మూడు రాజధానుల విషయంలో ఘోరంగా విఫలమైన ఏపీ ప్రభుత్వం తేలు కుట్టిన దొంగలాగా మిన్నకుండిపోయింది. దీనిపై ముదుకు వెళ్లటంలేదు..అలాగని వెనక్కి తగ్గినట్లుగా చెప్పటంలేదు. రాజధాని విషయంలో శాసన సభకు సర్వాధికారాలున్నాయని..మూడు రాజధానులు కాకపోతే 30 రాజధానులు నిర్ణయిస్తామంటూ అహంకారపు వ్యాఖ్యలు చేసారు వైసీప ప్రభుత్వ నేతలు. ఈ క్రమంలో రాం మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, AP News, Bjp, Ram Madhav