హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

సీఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో... కౌంటర్ ఎటాక్ ఇచ్చిన నారా లోకేష్

సీఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో... కౌంటర్ ఎటాక్ ఇచ్చిన నారా లోకేష్

ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని తెలిపారు.

ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని తెలిపారు.

జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్ళారో, ఏం సాధించుకు వచ్చారో చెప్పుకోలేని సిగ్గుమాలిన స్థితిలో ఉన్నారని నారా లోకేష్ తీవ్రంగా విమర్శించారు.

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ స్నాక్స్ కోసం రూ.25 లక్షలు ఖర్చు చేశారా? దీనిపై ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ అధికారికంగా ట్వీట్ చేయడం ఆరోపణలకు మరింత ఆజ్యం పోసింది. ‘విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబు గారి పుత్రరత్నం లోకేశ్ స్నాక్స్ ఖర్చు రూ.25 లక్షలని వైసీపీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ఘాటుగా సమాధానం ఇచ్చారు నారా లోకేష్. అక్రమాస్తుల పెట్టుబడులతో కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక సాక్షి అంటూ మండిపడ్డారు.

జగన్  ఢిల్లీ ఎందుకు వెళ్ళారో, ఏం సాధించుకు వచ్చారో చెప్పుకోలేని సిగ్గుమాలిన స్థితిలో ఉన్నారని నారా లోకేష్ తీవ్రంగా విమర్శించారు. మీడియాకి ఏం చేయాలో తోచక, మతి, నీతీలేని కథనాలతో నా మీద దుష్ప్రచారం మొదలుపెట్టిందన్నారు.

టీడీపీ అధికారంలో ఉండగా విశాఖ ఎయిర్ పోర్టులో కూర్చుని చిరుతిళ్ళ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టేసానంటూ సాక్షి ఒక అసత్య కథనం వండి వార్చిందన్నారు లోకేష్. ఆధారాల కోసం వాళ్ళు చూపించిన ఫుడ్ బిల్లులో తాను ఉన్న తేదీల్లో రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్నానన్నారు. ఐదేళ్ల ఏపీస‌ర్కారు ప్రోటోకాల్ ఖ‌ర్చు నాకు జ‌మ వెయ్య‌మ‌ని దొంగబ్బాయ్ ఆర్డర్ వేసారా?అంటూ లోకేష్ థ్వజమెత్తారు. ఇలాంటి నిరాధార కథనాలు రాసుకోడానికి సిగ్గుండక్కరలేదా?అంటూ వైసీపీని ప్రశ్నించారు. చిల్లరకథనాలు అపకపోతే మీ దొంగ పత్రిక బట్టలు ఊడదీసి ప్రజల ముందు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఒక అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో మరిన్ని అబద్దాలు అతికించే ప్రయత్నం నేరగాళ్లు చేస్తారన్నారు. సాక్షి నాపై బురద చల్లుతూ అలాంటి తప్పులన్నిటినీ చేసిందన్నారు. 2018 ఫిబ్రవరి 4న నేను న్యూజెర్సీలో ఉంటే ఆరోజు విశాఖ ఎయిర్ పోర్టులో రూ.67,096లు బిల్లు చేసినట్టు రాసారన్నారు. అక్టోబర్ 30, 2018న నేను పొద్దుటూరులో ధర్మపోరాట దీక్షకు హాజరయితే ఆరోజు విశాఖ ఎయిర్ పోర్టులో అయిన రూ.79,170లు బిల్లును కూడా నా అకౌంట్లో వేశారని విమర్శలు చేశారు నారా లోకేష్. విమానాశ్రయంలో ప్రభుత్వ విఐపిలందరి కోసం అయిన బిల్లుల్ని నా ఒక్కడి పేరునే వేసి ప్రచారం చేయడం సాక్షిలాంటి నీతిమాలిన మీడియాకే సాధ్యమవుతుందన్నారు. వైసీపీ తీరును ఎండగడుతూ ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు సంచలనాత్మక పోస్టులు పెట్టారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Nara Lokesh, Tdp, Ysrcp