హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే.. పెద్దాయన పేరు మారిస్తే.. జగన్ జాతకమే మారింది

Nara Lokesh: దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే.. పెద్దాయన పేరు మారిస్తే.. జగన్ జాతకమే మారింది

సీఎం జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

సీఎం జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

Nara Lokesh: పోలే.. అదిరిపోలే..? అంటూ పంచ్ డైలాగ్ లు వేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. దేవుడు స్క్రిప్ట్ అంటే ఇదే.. అంటూ రిటన్ డైలాగ్స్ తో ట్విట్టర్లో సెటైర్లు వేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Nara Lokesh: సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. సమయం వచ్చిన ప్రతిసారీ.. దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) పైనా.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పైనా విమర్శలు చేస్తుంటారు.. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొనుక్కున్నారని.. ఇప్పుడు అదే చంద్రబాబు కేవలం 23 సీట్లలోనే గెలిచారని.. ఇదంతా దేవడి స్క్రిప్ట్ అంటూ పదే పదే జగన్ విమర్శలు చేస్తుంటారు.. అదే డైలాగ్ ను.. రిటన్ గిఫ్ట్ గా ఇచ్చారు నారా లోకేష్.. గతంలో పోలిస్తే నారా లోకేష్ (Nara Lokesh).. పంచ్ డైలాగ్ లు పేల్చడంలో ముందుంటున్నారు.. విమర్శల్లోనూ దూకుడు పెంచారు. అసలు మాట్లాడడమే రాదని తనపై వస్తున్న విమర్శలకు.. తన కౌంటర్లతోనే సమాధానం చెబుతున్నారు. ఇందులో భాగంగా జగన్ కు మరో కౌంటర్ ఇచ్చారు.. దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదే అంటూ చురకలు వేశారు.

  ఇంతకీ ఏమైంది అంటే.. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు.. తొలగించి వైఎస్ఆర్ (YSR) పేరు పెట్టారు.. టీడీపీ నేతలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియాన్ని చట్టుముట్టి.. ఆయనపై బిల్లు పేపర్లు చింపి విసిరారు. వారి ఆందోళనల మధ్యే బిల్లుపై చర్చ జరిపి.. తరువాత వారిని సస్పెండ్ చేసి.. బిల్లును ఆమోదించారు. దీనిపై ఇప్పటికే నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

  ఎన్టీఆర్ పేరును తీసి.. వైఎస్ఆర్ పేరును హెల్త్ యూనివర్శిటీకి పెట్టి.. తెలుగు దేశం పార్టీకి జగన్ షాక్ ఇస్తే.. ఆయనకు ఊహించని షాక్ తగిలింది. అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీకి షాక్ ఇచ్చింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ (YS Jagan) ఎన్నికల చెల్లదని పేర్కొంది. పార్టీలో శాశ్వత పదవులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) నోటీసులు జారీ చేసింది.

  ఇదీ చదవండి : ఈ నెల 27న తిరుమలకు సీఎం జగన్.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రమ్మని ఆహ్వానం

  ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. నారా లోకేష్ తాజా ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి.. తన పార్టీకి తానే అధ్యక్షుడు కాకుండా పోయారని.. రెండూ ఒకే రోజు జరిగాయి. మరి ఇదే దేవుడి స్క్రిప్ట్ అంటూ లోకేష్ సైటైర్ వేశారు. ఇక జగన్ రెడ్డి భవిష్యత్తేంటో చూద్దామంటూ ట్వీట్ చేశారు.

  లోకేష్ ట్వీట్ సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గత జులైలో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో అప్పటివరకు వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న జగన్ తల్లి విజయమ్మ ఆ పదవికి రాజీనామా చేశారు. అంతా ఊహించినట్టుగానే ఆమె ఆ పదవికి రాజీనామా చేయడంతో.. పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక దాదాపు లాంఛనమైంది. అయితే ఎవరూ ఊహించని విధంగా పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ను ఎన్నికున్నారు.

  ఇదీ చదవండి : ఠాగూర్ మూవీని మించిన తెలివితేటలు.. గర్భవతి అంటూ 9 నెలలు ట్రీట్‌మెంట్.. చివరికి కడుపులోనే బిడ్డం మాయం.. ఏం చేశారంటే?

  దీనిపై అప్పుడే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన ఏమైనా నియంతా అంటూ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నించారు. ఇప్పుడు దీనిపై ఎన్నికల సంఘమే సీరియస్ అయ్యింది. ఈ అంశానికి సంబంధించి అనేకసార్లు లేఖలు రాసినా వైసీపీ పట్టించుకోలేదని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎన్నికలు జరగాలని సూచించింది. ఈ అంశంలో పార్టీ శాశ్వత అధ్యక్ష పదవిపై మీడియాలో మరోసారి స్పష్టత ఇవ్వాలని సూచించింది. మరి దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Nara Lokesh

  ఉత్తమ కథలు