Nara Lokesh Zoom Meeting: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల (AP 10th Exams Result) పై తీవ్ర దుమారం రేగుతోంది. ఎక్కువ మంది ఫరీక్షల్లో ఫెయిల్ అవ్వడం.. కొందరు ఒక్కో మార్కు తేడాతో ఫెయిలై ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులకు ఏపీ ప్రభుత్వ (AP Government) అసమర్ధతే కారణమని.. విపక్షాలు ఆరోపిస్తున్నాయి.. ప్రభుత్వం చేతకానికి తనంతోనే.. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పది పరీక్షల్లో అతి తక్కువ శాతం మంది పాసయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) జూమ్ మీటింగ్ నిర్వహించారు.. వారి సమస్యలను వింటూ.. అన్ని విధలా అండగా ఉంటామని.. ఎవరూ అధైర్య పడి మానసిక ఒత్తిడకి గురి కావొద్దని భరోసా ఇచ్చారు.. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. అయితే ఇదే సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabaneni Vamsi), మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) జూమ్ మీటింగ్ కు హాజరు కావడంతో లోకేష్ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
నారా లోకేశ్ మీటింగ్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ రావడంతో అంతా ఒక్కసారి షాకయ్యారు. కావాలనే రచ్చ చేయడానికి వచ్చారని టీడీపీ వాళ్లకు అర్థమైంది. దీంతో వీళ్లిద్దరిని గమనించిన టీడీపీ నిర్వాహకులు.. మీటింగ్ ను మధ్యలోనే కట్ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో నారా లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. స్టూడెంట్స్ తో లైవ్ లో మాట్లాడుతుంగానే సడెన్ గా కొడాలి నాని, వల్లభనేని వంశీ జూమ్ లోకి వచ్చారు. అయితే వల్లభనేని వంశీ ఆఫీసులోనే కూర్చుని ల్యాప్ టాప్ ద్వారా ఓ విద్యార్థి లోకేష్ జూమ్ మీటింగ్ కు లాగిన్ అయ్యారని తెలుస్తోంది.
ఇదీ చదవండి : వస్తున్నా మీకోసం.. ఎన్నికలకు సై అంటూ ఇక జనంలోనే చంద్రబాబు.. రూట్ మ్యాప్ ఇదే..
ఈ జూమ్ మీటింగ్ కు కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు చూసే దేవెందర్ రెడ్డి కూడా లాగిన్ అయ్యారు. లోకేష్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో నిర్వాహకులు లైవ్ కట్ చేశారు. పది పరీక్షలను లోకేష్ రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు.. అందుకే మాట్లాడుదాం అని వస్తే లైవ్ కట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ నేతల తీరుపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. జూమ్ లో కాదు డైరెక్ట్ గా మాట్లాడుతానని లోకేష్ సవాల్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP, Vallabaneni Vamsi