Home /News /andhra-pradesh /

AP POLITICS NARA LOKESH PADAYATRA WILL START FROM OCTBER 2ND MAIN TARGET NEXT ELECTIONS NGS BK

Lokesh: జ‌గ‌న్ ముగించిన చోటు నుంచే లోకేష్ స్టార్ట్? అక్టోబ‌ర్ 2 నుంచి లోకేష్ పాద‌యాత్ర‌? రోడ్ మ్యాప్ ఇదే

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

Nara Lokesh: వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా ప్రతిపక్ష తెలుగు దేశం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్.. పాద యాత్రకు సిద్ధమయ్యారు. అయితే జగన్ ఎక్కడ ముగించారో అక్కడ నుంచే లోకేష్ యాత్ర ప్రారంభించనున్నారు.. ఆయన రూట్ మ్యాప్ ఇదే..

ఇంకా చదవండి ...
  M BalaKrishna, Hyderabad, News18 

  Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Prsesh) లో ఎన్నికల వాతావారణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. విపక్షాలు అయితే ముందస్తు ఫిక్స్ అనే భావనలో ఉన్నాయి. అందుకే దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం (Telugu Desam).. ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఇటీవల మహానాడు (Mahanadu) సక్సెస్ అవ్వడం ఆ పార్టీలో మరింత జోష్ పెరిగింది. ఆ ఊపును అలాగే కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉమ్మడి జిల్లాల్లో పార్టీ పటిష్టతపై ఫోకస్ చేస్తున్నారు. వారానికి ఓ జిల్లా చొప్పిన ఆయా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి.. అందర్నీ గాడిలో పెట్టే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో ఇక అధినేత చంద్రబాబుతో సాహా.. నారా లోకేష్ (Nara Lokesh) సైతం ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు.  ప్రస్తుత సీఎం.. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ముగించిన చోటు నుంచే లోకేష్ పాద యాత్ర ప్రారంభం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అక్టోబ‌ర్ 2 నుంచి లోకేష్ పాద‌యాత్ర ఉంటుందని టీడీపీ వర్గాల బోగట్టా..

  బాదుడే బాదుడుకు ప్రజాధారణ కనిపించడం.. మహానాడు సూపర్ సక్సెస్ అవ్వడంతో.. కేడర్ ఉత్సాహంగా ఉన్నారు.ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తే ఎన్నికల్లో గెలుపు తప్పదని టీడీపీ అధిష్టానం అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర‌కి రెడీ అవుతుంటే.. లోకేష్ పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. ఇప్పుడు లోకేష్ పాద‌యాత్ర‌పై నే అంద‌రి దృష్టి ప‌డింది. లోకేష్ పాద‌యాత్ర ఎప్ప‌టి నుంచి ప్రారంభిస్తారు. ప్రారంభిస్తే ఎక్క‌డ నుంచి ప్రారంభిస్తారు అనే అంశాలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు కూడా పాద‌యాత్ర చేశారు అప్పుడు ఆ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం కూడా సాధించింది.

  ఇదీ చదవండి : ఎయిర్‌క్రాప్ట్‌ల గురించి తెలుసుకోవాలనుందా? ఈ మ్యూజియాన్ని సందర్శించాల్సిందే.. ప్రత్యేకతలు ఇవే

  ప్రస్తుతం ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త పార్టీకి ప్ల‌స్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు బాబు బ‌స్సు యాత్ర లోకేష్ పాద‌యాత్ర కూడా పార్టీకి మ‌రింత క‌లిసోచ్చే అంశాలు అంటున్నాయి పార్టీ శ్రేణులు. ఇప్ప‌డు లోకేష్ పాద‌యాత్ర ఎక్క‌డ నుంచి ప్రారంభిస్తార‌నేది చ‌ర్చ‌నీయంశంగా మారింది. గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను ఇడుపులపాయ నుంచి న‌వంబ‌ర్ 6,2017 న ప్రారంభించి సుమారు 341 రోజుల పాటు 3,648 కిలోమీట‌ర్లు 125 నియోక‌వ‌ర్గ‌ల్లో జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. 2019 జ‌న‌వ‌రి 10న ఆయ‌న త‌న పాద‌యాత్రను ఇచ్చాపురంలో ముగించారు. ఇప్పుడు స‌రిగ్గ జ‌గ‌న్ ఎక్క‌డ పాద‌యాత్ర‌ను ముగించారో అదే ప్రాంతం నుంచి లోకేష్ పాద‌యాత్ర ప్రారంభించ‌డానికి మొగ్గు చూపుతున్న‌ట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  ఇదీ చదవండి : రోబోలే ఆహ్వానిస్తాయి.. సర్వ్‌ చేస్తాయ్‌.. సరికొత్త ఫీల్ కలిగించే ఆ రెస్టారెంట్‌ ఎక్కడంటే..?

  అన్నీ అనుకూలిస్తే గాంధీ జ‌యంతి రోజున.. అంటే అక్టోబ‌ర్ 2 న లోకేష్ త‌న పాద‌యాత్ర ను ప్రారంభించ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. దాదాపు 6 నెల‌ల‌ పాటు లోకేష్ పాద‌యాత్ర చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఒక వేళ ప్ర‌భుత్వం ముంద‌స్తుకు వెళ్ల‌త్తే అంత‌క‌న్న ముందే లోకేష్ త‌న పాద‌యాత్ర‌ను స్టార్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో వైపు లోకేష్ పాద‌యాత్ర‌లో క‌వ‌ర్ చేయాలేని ప్రాంతాల‌ను బాబు బ‌స్సుయాత్ర ద్వార క‌వ‌ర్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఇద్ద‌రు నేత‌ల‌కు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ఇప్ప‌టికే పార్టీ వ‌ర్గాలు రెడీ చేసిన‌ట్లు స‌మ‌చారం. లోకేష్ ఇప్పుడు ఎన్ని నియోక‌వ‌ర్గ‌ల్లో ప‌ర్య‌టిస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. జ‌గ‌న్ ప‌ర్య‌టించిన‌ట్లు 125 నియోక‌వ‌ర్గ‌ల్లో ప‌ర్య‌టిస్తారా లేక కొన్ని ముఖ్య‌మైన ప్రాంతాల దిశ‌గా త‌న పాద‌యాత్ర సాగుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP

  తదుపరి వార్తలు