హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: నారా లోకేష్ సంచలన నిర్ణయం.. పార్టీ పదవికి రాజీనామా.? ఆ నేతలకు నో టికెట్..

Nara Lokesh: నారా లోకేష్ సంచలన నిర్ణయం.. పార్టీ పదవికి రాజీనామా.? ఆ నేతలకు నో టికెట్..

లోకేష్, చంద్రబాబు (ఫైల్)

లోకేష్, చంద్రబాబు (ఫైల్)

తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) మహానాడు (TDP Mahanadu) సందర్భంగా మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ సంస్థాగత మార్పులపై ఒక విధంగా షాక్ కు గురిచేసే ప్రతిపాదనలు చేశారాయన.

ఇంకా చదవండి ...

తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) మహానాడు (TDP Mahanadu) సందర్భంగా మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ సంస్థాగత మార్పులపై ఒక విధంగా షాక్ కు గురిచేసే ప్రతిపాదనలు చేశారాయన. మహానాడు ప్రాంగణంలో మీడియాతో చిట్ చాట్ చేసిన లోకేష్.. పార్టీ పదవుల విషయంలో కొత్త పద్ధతికి తెరలేపారు. పార్టీని బలోపేతం చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్న లోకేష్.. పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ విధానాన్ని నా నుంచే అమలు చేయాలని భావిస్తున్నానంటూ కామెంట్స్ చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు చేశానని.., ఈ సారి నేను తప్పుకుని వేరొకరికి అవకాశం కల్పిస్తాని లోకేష్ చెప్పారు. అలాగే వరుసగా రెండుసార్లు ఒకే పదవిలో ఉన్నవారికి బ్రేక్ ఇవ్వాలన్నారు.

అలాగే వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నేతలకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడాదని.. ఆయా నియోజకవర్గాల్లో కొత్తవారికి, కష్టపడి పనిచేసేవారికి అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. లోకేష్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. స్వయంగా పార్టీ పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నేతలకు ఎన్నికల్లో ఛాన్స్ ఇచ్చేది లేదని చెప్పడంతో కొందరు సీనియర్ నేతలకు షాక్ ఇవ్వనున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే కొందరు ఎన్నికల్లో ఓడినా కీలక పదవులు పొందడంపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుసగా ఓడిన నేతలకు గతంలో మంత్రి పదవులు దక్కడమే ఈ అసంతృప్తికి కారణమన్న చర్చ జరుగుతోంది.

ఇది చదవండి: ఇకపై ఆంధ్రాలో చికెన్ దొరకదా..! త్వరలోనే లాక్ డౌన్..? కారణం ఇదే..


2024 ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న తరుణంలో లోకేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులను నియమించాల్సి ఉంది.. అక్కడ పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు వెళ్లి దండం పెట్టినా గెలిచే పరిస్థితులున్నాయని లోకేష్ అన్నారు. ఇంతకీ దండం పెడితే చాలు గెలిచే నియోజకవర్గాలేవీ.. అక్కడ అంతగా కష్టపడుతున్న నేతలవరనేది హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఖాళీగా ఉన్న 30 నియోజకవర్గాల్లో ఎన్నికల్లోపు ధీటైన నేతలను ఎంపిక చేస్తారా లేక చివరి నిముషంలో రంగంలోకి దించుతారా..? అనేది చూడాలి. ఈ 30 నియోజకవర్గాల్లో టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కృష్ణా జిల్లా గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. మరి లోకేష్ ప్రతిపాదనలపై అధినేత చంద్రబాబు, పార్టీ సీనియర్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, Nara Lokesh, TDP

ఉత్తమ కథలు