Home /News /andhra-pradesh /

AP POLITICS NARA LOKESH INTERESTING COMMENTS LEADS TO NEW DISCUSSION ON CHANDRABABU NAIDU STRATEGY IN TDP AK

Chandrababu| Lokesh: చంద్రబాబు ప్లాన్ మారిందా ?.. లోకేశ్ అందుకే రంగంలోకి దిగారా ?.. ఆ నేతల్లో టెన్షన్

లోకేశ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

లోకేశ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Chandrababu| Lokesh: ప్రస్తుతం లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీకి మళ్లీ కొత్త ఉత్సాహం రావాలంటే.. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు నేతలు బాహాటంగానే చెబుతున్నారు.

    ఏపీలో ఈసారి కచ్చితంగా అధికారం దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్న టీడీపీ.. అందుకు తగ్గట్టుగా రెండేళ్ల ముందే నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. ఇప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటేనే.. పార్టీ వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తామని భావిస్తోంది. ఆ మార్పును చంద్రబాబులో గమనిస్తున్నామని నేతలు చెబుతున్నారు. అయితే తాజాగా మహానాడు సందర్భంగా చంద్రబాబు (Chandrababu Naidu) తనయుడు, మాజీమంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో, టీడీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీని బలోపేతం చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్న లోకేష్ (Nara Lokesh).. పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ విధానాన్ని నా నుంచే అమలు చేయాలని భావిస్తున్నానంటూ కామెంట్స్ చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు చేశానని.., ఈ సారి నేను తప్పుకుని వేరొకరికి అవకాశం కల్పిస్తాని లోకేష్ చెప్పారు.

    అలాగే వరుసగా రెండుసార్లు ఒకే పదవిలో ఉన్నవారికి బ్రేక్ ఇవ్వాలన్నారు. అలాగే వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నేతలకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడాదని.. ఆయా నియోజకవర్గాల్లో కొత్తవారికి, కష్టపడి పనిచేసేవారికి అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే నారా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక చంద్రబాబు ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో చంద్రబాబు వెనకాడుతుంటారనే వాదన ఉంది. ముఖ్యంగా పార్టీ విషయంలో ఆయన ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడుతుంటారని.. దాని కారణంగానే టీడీపీ చాలావరకు దెబ్బతిందనే చర్చ ఇప్పటికీ టీడీపీలో ఉంది.

    అయితే ప్రస్తుత తరుణంలో పార్టీపరంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోకతప్పదని నిర్ణయించుకున్న చంద్రబాబు.. నారా లోకేశ్ ద్వారా ఈ వాదనను తెరపైకి తీసుకొచ్చారని పలువురు అభిప్రాయడుతున్నారు. ప్రస్తుతం లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీకి మళ్లీ కొత్త ఉత్సాహం రావాలంటే.. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు నేతలు బాహాటంగానే చెబుతున్నారు.

    Nara Lokesh: నారా లోకేష్ సంచలన నిర్ణయం.. పార్టీ పదవికి రాజీనామా.? ఆ నేతలకు నో టికెట్..

    Balakrishna: కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టం.. వైసీపీ నేతలకు బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్

    అయితే తనతో సమకాలీకులైన నేతలను పక్కన పెట్టడం చంద్రబాబుకు కష్టంగా మారుతుందని.. అందుకే నారా లోకేశ్ ద్వారా చంద్రబాబు ఈ పని చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు రాబోయే రోజుల్లో నారా లోకేశ్ టీడీపీని సంస్కరించే విషయంలో మరింత దూకుడుగా ముందుకు సాగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలతో చంద్రబాబులో మొదటి నుంచి పని చేస్తున్న కొందరు సీనియర్ నేతల్లో టెన్షన్ మొదలైందనే టాక్ మొదలైంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Nara Lokesh, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు