Home /News /andhra-pradesh /

AP POLITICS NARA LOKESH INTERESTED TO GO FOR PADAYATRA BEFORE 2024 ASSEMBLY ELECTIONS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Lokesh Padayatra: పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేష్.? త్వరలోనే రంగంలోకి.. బాబు స్కెచ్ ఇదేనా..?

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష టీడీపీ (TDP) పావులు కదుపుతోంది. మహానాడు (Mahanadu) తర్వాత గెలుపు ఖాయమన్న దీమాతో ఉన్నారు. మహానాడు సక్సెస్ కావడం, బాదుడే బాదుడు కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో ఎన్నికల వరకు అదే వ్యూహాన్ని అమలు చేయాలని టీడీపీ భావిస్తోంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష టీడీపీ (TDP) పావులు కదుపుతోంది. మహానాడు (Mahanadu) తర్వాత గెలుపు ఖాయమన్న దీమాతో ఉన్నారు. మహానాడు సక్సెస్ కావడం, బాదుడే బాదుడు కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో ఎన్నికల వరకు అదే వ్యూహాన్ని అమలు చేయాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ వ్యూహాలను మరింత పదను పెట్టాలని చూస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ త్వరలోనే పాదయాత్ర చేపడతారంటూ తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా లోకేష్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మహానాడు ఇచ్చిన జోష్ తో దేనికైనా రెడీ అనేలా లోకేష్ అంటున్నట్లు సమాచారం.

    2024లో క్విట్ జగన్.. సేవ్ ఏపీ అనే నినాదంతో ముందుకెళ్తామని చంద్రబాబు చెప్పడంతో.. అదే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది టీడీపీ స్ట్రాటజీగా తెలుస్తోంది. సీఎం జగన్ పాదయాత్ర చేసిన సమయంలో బైబై బాబు అనే స్లోగన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో టీడీపీ కూడా ఇప్పుడు అదే ఫార్ములా ఫాలో అవుతోంది. పాదయాత్రకు లోకేష్ కూడా ఆసక్తి చూపిస్తుండటంతో త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

    ఇది చదవండి: ర‌ఘురామ‌ కృష్ణంరాజు కుర్చీ వెనుకున్న కండువా క‌థేంటీ..? ఆ పార్టీకి సంకేతాలిస్తున్నారా..?


    అటు చంద్రబాబు కూడా జిల్లా టూర్లు ప్లాన్ చేస్తున్నారు. మహానాడుకు ముందు ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాల్లో బాదుడే బాదుడు పేరుతో పర్యటించిన చంద్రబాబు.. రానున్న పదినెలల్లో జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

    ఇది చదవండి: సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్..! బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ..? త్వరలో కీలక ప్రకటన..


    ఇదిలా ఉంటే మహానాడులో లోకేష్ చేసిన కామెంట్స్ పార్టీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పార్టీ పదవుల విషయంలో కఠిన నిర్ణయాలు తప్పవని చెప్పిన సంగతి తెలిసిందే. వరుసగా మూడేళ్లు ఒకే పదవిలో ఉండరాదని లోకేష్ అభిప్రాయపడ్డారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తాను తప్పుకొని వేరే వాళ్లకు అవకాశమిస్తానని లోకేష్ అన్నారు. అలాగే వరుసగా మూడేళ్లు ఓడిపోయిన నేతలకు కూడా టికెట్ ఇవ్వారదన్నారు. పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని లోకేష్ చెప్పడంతో.. ఆయనే పార్టీ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారని చర్చ జరుగుతోంది.

    ఇది చదవండి: వైసీపీకి ఆదాయం ఎక్కువ... వ్యయం తక్కువ.., టీడీపీ పరిస్థితి రివర్స్..


    వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ గెలిస్తే.. ఇప్పటివరకు తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టొచ్చని లోకేష్ భావిస్తున్నారు. అందుకే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను విరించడమే కాకుండా.. తాము వస్తే ఏం చేస్తామో వివరించాలని చూస్తున్నారట. ఇప్పటికే మంగళగిరిలో ఇంటింటికీ తిరుగుతున్న లోకేష్.. ఇకపై నియోజకవర్గానికే పరిమితం కాకుండా.. రాష్ట్రమంతా తన మార్క్ చూపించాలని భావిస్తున్నట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మరి లోకేష్.. నిజంగానే పాదయాత్ర చేస్తారా..? లేదా..? అనేది వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Nara Lokesh

    తదుపరి వార్తలు