హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan-Nara Lokesh: ఆ ఆస్తులపై కన్నేసిన సీఎం జగన్.. ఉద్యమం ఆగదన్న లోకేశ్

YS Jagan-Nara Lokesh: ఆ ఆస్తులపై కన్నేసిన సీఎం జగన్.. ఉద్యమం ఆగదన్న లోకేశ్

నారా లోకేశ్, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

నారా లోకేశ్, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చ‌దువుతున్న విద్యార్థుల్లో 90 శాతం మంది నిరుపేద విద్యార్థులే అని.. లక్షలాది మంది పిల్లల చదువుకంటే ఎయిడెడ్ సంస్థలకు ఉన్న లక్ష కోట్ల విలువైన భూములు, ఆస్తులే జ‌గ‌న్‌రెడ్డికి ముఖ్యమయ్యాయని నారా లోకేశ్ ఆరోపించారు.

ఇంకా చదవండి ...

  ఏపీలో విద్యార్థులకు మేనమామగా ఉంటానన్న సీఎం వైఎస్ జగన్(YS Jagan) .. కంసుడిలా మారి విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయిస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh) ఆరోపించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన టిఎన్ఎస్ఎఫ్ నాయకుల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. వారిని బాత్రూం దగ్గర కూర్చోబెట్టి ఆహారం కూడా ఇవ్వకుండా 8 గంటలు నిర్బంధించారని విమర్శించారు. 1854లోనే ఎయిడెడ్ వ్యవస్థ ఏర్పడిందని...పేద విద్యార్థులకు అండగా నిలబడటానికి దాతలు, ప్రభుత్వాలు ముందుకు వచ్చాయని లోకేశ్ గుర్తు చేశారు. ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు, జస్టిస్ రమణ(NV Ramana), బలయోగి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య వంటి అనేక మంది ఎయిడెడ్ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని అన్నారు.

  అలాంటి ఎయిడెడ్ విద్యా వ్యవస్థని నాశనం చేస్తూ సీఎం జగన్ జగన్ రెడ్డి జీవో 19,42,50,21 తీసుకొచ్చారని నారా లోకేశ్ విమర్శించారు. అందులో రెండే అప్షన్లు ఇచ్చారని ఒకటి ఉపాధ్యాయులను, ఆస్తులను ప్రభుత్వానికి ఇవ్వడం. రెండు ప్రైవేటీకరణ చేయడమని పేర్కొన్నారు. జీవోలో లేని మూడో అప్షన్ ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారని.. ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ఇప్పుడు మెమో పేరుతో మరో కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆరోపించారు.

  అనంతపురం, కాకినాడ, విజయనగరంలో ఎయిడెడ్ విద్యా సంస్థలు కాపాడాలని శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థుల పై లాఠీ విరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎయిడెడ్ సంస్థల ఆస్తుల‌పై క‌న్ను వేశారని.. ఆస్తులు కొట్టేసేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్నారని.. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థల ప‌రిధిలో 2,203 పాఠశాలల్లో 1,96,313 మంది విద్యార్ధులు చ‌దువుతున్నారని లోకేశ్ తెలిపారు.

  Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?

  K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?

  182 జూనియర్ కాలేజీల్లో 71,035 మంది విద్యార్ధులున్నారని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 116 డిగ్రీ కాలేజీల్లో చ‌దివే విద్యార్థుల భవిష్యత్ ప్రశార్ధకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చ‌దువుతున్న విద్యార్థుల్లో 90 శాతం మంది నిరుపేద విద్యార్థులే అని.. లక్షలాది మంది పిల్లల చదువుకంటే ఎయిడెడ్ సంస్థలకు ఉన్న లక్ష కోట్ల విలువైన భూములు, ఆస్తులే జ‌గ‌న్‌రెడ్డికి ముఖ్యమయ్యాయని అన్నారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థని నాశనం చేస్తూ తెచ్చిన జీవోలు రద్దు చేసే వరకు ఈ ఉద్యమం ఆగదని లోకేశ్ అన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, Nara Lokesh

  ఉత్తమ కథలు