Home /News /andhra-pradesh /

AP POLITICS NANDAMURI TARAKA RATNA INTERESTING COMMENTS ABOUT TDP AND CHANDRABABU NAIDU SB

Chandrababu: చంద్రబాబు నందమూరి ఫ్యామిలీని.. టీడీపీకి దూరం పెట్టారా? ఆ హీరో ఏమన్నాడంటే

చంద్రబాబు ,జూనియర్ ఎన్టీఆర్

చంద్రబాబు ,జూనియర్ ఎన్టీఆర్

జగన్ కూడా వైఎస్ షర్మిల, విజయమ్మను ఎన్నికల ప్రచారం కోసం వాడుకొని తర్వాత పక్కన పెట్టేశారని అడిగిన యాంకర్ ప్రశ్నకు.. నందమూరి హీరో ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తమ విషయంలో అలాంటివి ఎప్పుడు జరగలేదన్నారు.

    తెలుగుదేశం పార్టీ రాజకీయాలు.. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu),నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family) చుట్టూ తిరుగుతంటాయి. ఎప్పుడు కూడా ఇవి తెలుగు ప్రజలకు హట్ టాపిక్‌గానే ఉంటాయి. తాజాగా టీడీపీ, చంద్రబాబు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నందమూరి హీరో తారకరత్న(Taraka Ratna) తెలుగుదేశం పార్టీ నారా కుటుంబానిదో .. నందమూరి కుటుంబానిదో కాదన్నారు.. నందమూరి హీరో తారక్ రత్న. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తెలుగువాడి పార్టీ... తాతగారు తెలుగు ప్రజలకోసం పెట్టిన పార్టీ అన్నారు. ఎప్పుడు కూడా ఈయన తర్వాత పార్టీకి మేం అని ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. మా పార్టీ అని కూడా నేను అననని.. మన పార్టీ అంటానన్నారు.

    మన పార్టీ తెలుగు ప్రజలకు మంచి చేసే వరకు నడుస్తూనే ఉంటుందన్నారు. అది ఒక్కరి పార్టీ కాదు తెలుగు ప్రజల పార్టీ అన్నారు తారక్. టీడీపీ (TDP) నందమూరి ఫ్యామిలీని పగ్గాలు చేపట్టుకోండి అంటుందంటే.. కానీ చంద్రబాబు నాయుడు గారు నందమూరి ఫ్యామిలీన దూరంగా ఉంచండి అంటున్నారని యాంకర్ అడిగిన ప్రశ్నకు తారక్ సమాధానం చెప్పారు. అలాంటి మాటల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. అవన్నీ ఊహాజనితమే అన్నారు. మామయ్య చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించరే కానీ.. నందూమరి ఫ్యామిలీని రానివ్వకూడదని ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. ఆయనకు నిజంగా అలా ఉంటే.. ఆయన మమ్మల్ని ఎన్నికల ప్రచారానికి కూడా రానిచ్చేవారు కాదన్నారు. అయితే రాజకీయాలు వేరు.. ఎన్నికల ప్రచారం వేరు. ప్రచారానికి వాడుకొని... విజయమ్మ(Vijayamma), వైఎస్ షర్మిలను( YS Sharmila ) కూడా జగన్ పక్కన పెట్టేశారన్న విమర్శలు ఉన్నాయి.

    అయితే ఇదే విషయం మీకు కూడా జరిగిందా అని యాంకర్ తారక్‌ను ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన తారక్... మాకు ఎప్పుడు అలాంటిది ఏం జరగలేదన్నారు. చాలా క్లారిటీతో చెబుతున్నాను...ఏ రోజు మమ్మల్ని మామయ్య చంద్రబాబు దూరంగా పెట్టలేదన్నారు. మాకు ఎప్పుడు ఏం కావాలన్న.. ఏ సమస్య వచ్చిన మామయ్య మాకిది కావాలి... ఈ సమస్య ఉంది అని చెప్పుకొనే స్వేచ్ఛ, ధైర్యం చంద్రబాబు వద్ద తమకు ఉన్నాయన్నారు. మేం మామయ్య చంద్రబాబు దగ్గరకు వెళ్లి చెప్పుకోని స్వేచ్ఛ ఉందన్నారు. మాకు కూడా తెలుస్తుంది ఏటైంలో రాజకీయాల్లోకి రావాలి... అప్పుడు మేం మామయ్యతో కూర్చొని మాట్లాడి అడిగితే ఆయన తప్పకుండా ఇస్తారన్నారు. ఇప్పుడు ఏం ఇచ్చిన మేం చేయలేమన్నారు. మాకే క్లారిటీ లేనప్పుడు ఆయన ఎంత పెద్ద అవకాశం ఇచ్చిన ప్రయోజనం ఉండదన్నారు. ఏ రోజు కూడా ఆయన మమ్మల్నిదూరం చేసింది లేదు.. పక్కన పెట్టింది లేదన్నారు తారక్. మా అత్తయ్య భువనేశ్వరి.. ఇవాల్టికి ఓ అమ్మలాగా మమ్మల్ని కూర్చొని మాట్లాడి పంపించే వ్యక్తి భువనేశ్వరి అన్నారు. నారా, నంద మూరి సేమ్ ఎప్పుడూ మేం ఆ కుటుంబాల్ని వేరేగా చూడలేమన్నారు. చంద్రబాబు నా మేనమామ.. మేమంతా ఒకటే కుటుంబం అన్నారు.

    ఇక నందమూరి తారకరత్న విషయానికి వస్తే... నందమూరి కుటుంబం నుంచి ఒకడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు 2002 లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న తారకరత్న.. ఈ సినిమా తరువాత వరుసగా 13 సినిమాలకు సైన్ చేసిన ఏకైక హీరోగా రికార్డ్ సాధించాడు. ఇక ఆ సినిమాల్లో కొన్ని అటకెక్కిన విషయం వేరే సంగతి.. ఇక హీరో నుంచి విలన్ గా మారాడు. అమరావతి చిత్రంలో విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు... సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన 9 అవర్స్ వెబ్ సిరీస్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తారక్ రత్న.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Chandrababu Naidu, Jr ntr, Taraka Ratna, TDP

    తదుపరి వార్తలు