Kodali Nani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కొడాలి నాని (Kodali Nani) కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫైర్ బ్రాండ్ గా.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), లోకేష్ (Lokesh) పై విరుచకు పడడంలో ఆయన తరువాతే ఎవరైనా.. మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని టార్గెట్ చేసేవారు.. మాజీ మంత్రి అయిన తరువాత కొంతకాలం సైలెంట్ గా కనిపించిన ఆయన.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ లను తిట్టడంలో కొడాలి నాని ముందు ఉంటారు. టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కొడాలి నానిని ఓడించాలని.. చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అది సాధ్యం కావడం లేదు. తిరుగులేని విజయాలతో నాని గుడివాడను అడ్డాగా మార్చుకున్నారు.
2004లో జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సు ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగు పెట్టిన ఆయన.. ఆ ఎన్నికలతో పాటు.. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున వరుసగా గెలుపొందారు. 2012లో వైసీపీలో జాయిన్ అయిన ఆయన.. 2014, 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఎలాగైనా కొడాలి నాని ఓడించాలని దేవినేని అవినాష్ ను రంగంలోకి దింపారు.. అయినా నాని విజయాన్ని అడ్డుకోలేకపోయారు.
ఆ ఎన్నికల్లో నెగ్గిన తరువాత కొడాలి నాని మరింతంగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడ్ని.. లోకేష్ ను అభ్యంతరక పదాలతో తిడుతూ.. వారికి నిద్ర లేకుండా చేస్తున్నారు. అందుకే ఈ సారి ఎలాగైనా కొడాలి నాని ఓడించాలని అధినేత చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. కానీ అది అంత ఈజీ కాదు. ఇప్పటికే గుడివాడలో ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఉంది. బలమైన నేతగా ఎదిగారు.. దీనికి తోడు టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావు ప్రస్తుతం అంత యాక్టివ్ గా ఉండడం లేదనే అధిష్టానం భావిస్తోంది.
ఇటీవల చంద్రబాబును కలిసిన స్థానిక నేతలు కొందరు.. కొడాలి నాని ఓడించాలంటే నందమూరి కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేస్త బెటరని మనసులో మాట చెప్పారంట.. రాజకీయాలపై ఆసక్తి ఉన్న సుహాసినిని బరిలో దింపితే తామంతా మద్దతుగా నిలిచి.. గెలిపించే బాధ్యత తీసుకుంటామని అడిగినట్టు తెలిసింది. అందుకు చంద్రబాబు ఆసక్తి చూపించలేదని సమాచారం. తెలంగాణలో పార్టీపై ఫోకస్ చేసిన ఆయన.. మరోసారి సుహాసినిని కూకట్ పల్లి నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నట్టు టాక్.
ఇదీ చదవండి: సినిమా, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నఈ పిల్లాడు ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు కీలక నేత కూడా?
ప్రస్తుతం ఉన్న ఇంఛార్జ్ రావికే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు కోరినట్టు తెలుస్తోంది. అయితే అయిన గుడివాడలో గట్టిగా పని చేయడం లేదని.. అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని చంద్రబాబుకు నివేదికలు అందడంతో ఇంకా ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. మరోవైపు ఆర్థిక బలం ఉంది.. రాజీకయంగా అనుభవం ఉంది. వ్యూహాలు రచించడం.. పోల్ మేనేజ్ మెంట్ అన్నింటిలో రావికి అనుభవం ఉన్నా.. సీటు వస్తుందో లేదో తెలియక ఆయన అంత యాక్టివ్ గా ఉండడం లేదని.. ఒకవేళ టికెట్ కన్ఫాం చేస్తే.. ఈ సారి గెలుపు ఆయనదే అంటూ రావి వర్గం ధీమాగా చెబుతోంది. మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Kodali Nani