Home /News /andhra-pradesh /

AP POLITICS NANDAMURI BALAKISHNA TO CLARIFY ON VENNUPOTU EPISODE IN WHICH NTR REMOVED FROM CM POST IN 1995 AK

Balakrishna NTR: వెన్నుపోటుపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. పాతికేళ్ల తరువాత ఏం చెప్పబోతున్నారు ?

బాలకృష్ణ, ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

బాలకృష్ణ, ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

Balakrishna Unstoppable: అసలు బాలకృష్ణను ఈ అంశాలపై ప్రశ్నించే స్థాయి వాళ్లెవరూ ఈ టాక్ షోలో పాల్గొనలేదు. అలాంటప్పుడు ఈ షోలో అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందన్నది కూడా తెలియాల్సి ఉంది.

    బుల్లితెరపై అన్‌స్టాపబుల్ అంటూ టాక్ షో చేస్తున్న బాలకృష్ణ.. ఇటీవల అఖండ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఈ టాక్ షోకు సంబంధించి మరో ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఇందులో అఖండ మూవీ డైరెక్టర్ బోయపాటి, ఇందులో విలన్‌గా నటించిన శ్రీకాంత్, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పాల్గొన్నారు. అన్ని ఎపిసోడ్స్ తరహాలోనే ఈ ఎపిసోడ్ కూడా ఫన్నీగా ఉంటుందనే విషయాన్ని ప్రోమోలో చెప్పకనే చెప్పారు. అయితే ఈ ప్రోమోలో బాలకృష్ణ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా గద్దె దించే అంశాన్ని ప్రస్తావించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని వివరణ ఇచ్చుకున్న బాలకృష్ణ.. ఎన్టీఆర్‌కు తాను కేవలం కుమారుడిని మాత్రమే కాదని.. ఆయన అభిమానుల్లో ఒకడినని చెప్పుకొచ్చారు.

    దీంతో ఈ ఎపిసోడ్‌లో అప్పుడు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే అంశంపై బాలయ్య చెప్పబోతున్నారనే విషయం అర్థమవుతోంది. ఆయన ఆనాటి ఘటనపై ఏ రకమైన వివరణ ఇస్తారు ? బాలకృష్ణ ఇచ్చే వివరణ తరువాత మళ్లీ ఈ అంశంపై కొత్త చర్చ ఏమైనా మొదలవుతుందా ? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే సమయంలో ఆయన కుమారులు, అల్లుళ్లు అంతా చంద్రబాబు వైపు ఉన్నారు. ఆ తరువాత వారిలో కొందరు చంద్రబాబుకు కూడా దూరమయ్యారు.

    అలా ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీకి దూరమై.. మళ్లీ ఇటువైపు రాలేదు. అయితే ఈ ఎపిసోడ్ తరువాత కొంతకాలానికి పార్టీకి దూరమైన హరికృష్ణ మాత్రం మళ్లీ టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అయితే బాలకృష్ణ అప్పట్లో రాజకీయాల్లో లేరు. ఆ తరువాత చంద్రబాబు బాలకృష్ణ వియ్యంకులుగా మారారు. ఆ తరువాత బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చి.. ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అత్యత కష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బాలకృష్ణ వెన్నుపోటు అంశంపై వివరణ ఇవ్వడంపై ఆసక్తి రేపుతోంది.

    Akhanda Movie: అఖండకు ఓ వైపు రికార్డుల మోత.. మరోవైపు అపశృతులు.. థియేటర్‌లో భారీగా మంటలు.. భయంతో ప్రేక్షకుల పరుగులు

    Balakrishna | Akhanda : భారీ ధరకు అమ్ముడైన అఖండ హిందీ రైట్స్.. బాలయ్య క్రేజ్ అలాంటిది..

    అయితే అసలు బాలకృష్ణను ఈ అంశాలపై ప్రశ్నించే స్థాయి వాళ్లెవరూ ఈ టాక్ షోలో పాల్గొనలేదు. అలాంటప్పుడు ఈ షోలో అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందన్నది కూడా తెలియాల్సి ఉంది. బాలకృష్ణ తనకు తాను ఈ ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితులు తీసుకొచ్చారా ? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి కొనితెచ్చుకున్నారా ? అన్నది ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే తప్ప ఎవరూ చెప్పలేని పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు, టీడీపీ చరిత్రలోనూ అత్యంత కీలకమైన ఘట్టంగా చెప్పుకునే ఘటనపై బాలకృష్ణ ఏ రకమైన వ్యాఖ్యలు, వివరణ ఇస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Nandamuri balakrishna, NTR

    తదుపరి వార్తలు