తెలుగుదేశం (Telugu Desham Party) పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) శతజయంతి ఉత్సవాలు ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా (Krishna District) నిమ్మకూరులో ఘనంగా జరుగుతున్నాయి. నందమూరి కుటుంబ (Nandamuri Family) సభ్యులు, బంధువులు, స్థానికులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ (NTR) తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna).. నిమ్మకూరులో తల్లిదండ్రులకు నివాళులర్పించారు. తన తల్లిదండ్రులు అంటే పార్వతీపరమేశ్వరుకు లాంటి వారని.., ఎన్టీఆర్ జయంతిని తెలుగువారంతా ఘనంగా జరుపుకుంటారని బాలయ్య అన్నారు. ప్రపంచపటంలో తెలుగు సంతకం, ఆత్మగౌరవ నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని.., నేటి నుండి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఎన్టీఆర్ ఇల్లే ఒక నటనాలయమని.., ఆయన అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని బాలకష్ణ అన్నారు. సామాన్య రైతుగా, ప్రభుత్వం ఉద్యోగిగా, కళాకారునిగా, సీఎంగా ఎన్నో సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. సామాజికం, పౌరాణికం ప్రతికూల పాత్రలను పోషించారని.. తెలుగువారి ఆత్మగౌరవం కోసం నేనున్నాంటూ ముందుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని బాలయ్య ప్రశంసించారు. శ్రామికులు, రైతులు, అన్నార్ధుల కోసమే టీడీపీని స్థాపించారన్న ఆయన.., సమాజామే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతో పనిచేశారన్నారు.
సామాన్యలను చట్ట సభల్లో కూర్చోబెట్టడమే కాకుండా.. పేదల కడుపు నింపేలా రెండు రూపాయల కు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనన్నారు. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను వింటే తనువు పులకరిస్తుందన్నారు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని నిమ్మకూరు చెరువు వద్ద 35 అడుగుల విగ్రహం ఏర్పాటుకు గ్రామస్తులు తీర్మానించారని.., బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి ఈ విగ్రహాన్ని నిర్మిస్తారని బాలకృష్ణ తెలిపారు. నిమ్మకూరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నేటి యువత రాజకీయాల్లోకి రావాలని.. ఉత్సాహంతో పనిచేయాలి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనని.. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారన్నారు.
అటు హైదరాబాద్ (Hyderabad) లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్ (Jr.NTR), కల్యాణ్ రామ్ (KalyanRam) లు తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని వాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తారక్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. సదా మిమ్మల్ని స్మరించుకుంటూ అంటూ.. తాతగారి ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోపై అద్భుతమైన కవిత కూడా రాశాడు జూనియర్ ఎన్టీఆర్. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్ద మనసుతో మరొక్కసారి ఈ ధరిత్రిని, ఈ గుండెను తాకిపో తాతా... నీ ప్రేమకు బానిసను అంటూ.. ఎన్టీఆర్ తన సంతకంతో కూడిన ఫోటోను షేర్ చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bala Krishna Nandamuri, NTR