Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna) ఆహా ఓటీటీ (aha ott) లో చేస్తున్న అన్‌స్టాపబుల్-2 (Unstoppable-2) స్ట్రమింగ్‌కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సీజన్-1లో సినీ సెలబ్రెటీలతో సందడి చేసిన బాలయ్య.. ఇప్పుడు పొలిటికల్ మాస్ మసాలా అందించేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఎప్పుడూ గంభీరంగా కనిపించే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (TDP Chief Nara Chandrababu Naidu), ఆయన తనయుడు నారా లోకేష్ (Nara Lokesh) ను షోకి పిలిచి సందడి చేశారు. ఇప్పుడా ప్రోమో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఐతే ఈ ప్రోమోలో.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో హాట్ టాపిక్ అయిన రెండు అంశాలను కూడా టచ్ చేశారు. అవే అమరావతి (Amaravathi), మంగళగిరి (Mangalagiri). అమరావతిని గ్రాఫిక్స్ తో పోల్చడం, మంగళగిరిలో లోకేష్ ఓటమిని ప్రస్తావించడంతో ఈ టాక్ షో కాస్త హీట్ షోగా సాగిందని కూడా అర్ధమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో అమరావతిపై రాజకీయం వేడెక్కింది. ఓ వైపు రైతుల పాదయాత్ర సాగిస్తుంటే.. మరోవైపు అధికార వైసీపీ జేఏసీ గర్జన పేరుతో సభలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోంది. అమరావతి భ్రమరావతి అని.. అదో గ్రాఫిక్స్ రాజధాని అంటూ బాహుహలి గ్రాఫిక్స్ తో పోల్చుతూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని.. గ్రాఫిక్స్ చూపించి మోసం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.
అన్‌స్టాపబుల్ షోలో గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు.. సైబరాబాద్ నిర్మాణం వంటి అంశాలను టచ్ చేసిన బాలయ్య.. రాళ్లు రప్పలున్న చోట.. మీ నిర్ణయాలను అమలు చేసి వేలకోట్ల టర్నోవర్ చేసే కంపెనీలను స్థాపించారని.. అప్పుడు బాహుబలి రాలేదు కాబట్టి సైబరాబాద్ ను గ్రాఫిక్స్ అనలేదని సెటైర్ వేశారు. అమరావతిపై వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని బాలయ్య.. గ్రాఫిక్స్ సిటీ ప్రస్తావన తెచ్చి ఇలా కౌంటర్ వేసుంటారన్న చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే తన అల్లుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయిన సంగతిని కూడా గుర్తు చేశారు బాలయ్య. ప్రజాజీవితంలో వేసిన తొలి అడుగే ఓటమి ఎదురైందని ప్రశ్నించగా.. ఒక్కసారిగా లోకేష్ సైలెంట్ అయ్యారు. సంకల్పం గట్టిదే అంటూ.. కాస్త సీరియస్ ఫేస్ పెట్టారు. దీనికి లోకేష్ ఆన్సర్ ఏమిచ్చారు.. చంద్రబాబు స్పందించారా..? బాలయ్య ఎలా రిసీవ్ చేసుకున్నారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
ఆన్‌స్టాపబుల్ ప్రోమోలో కరెంట్ పాలిటిక్స్ కి సంబంధించి ఈ రెండు అంశాలను మాత్రమే టచ్ చేశారు. మరి ఫుల్ ఎపిసోడ్ లో పొలిటికల్ ప్రశ్నలు ఎన్ని.. వాటికి పెద్దబాబు, చినబాబు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు.. ఈ సమాధానాలకు బాలయ్య బాబు కౌంటర్స్ ఇచ్చారా లేక నవ్వుతూ రిసీవ్ చేసుకున్నారా..? ఇక గత ఎన్నికల్లో 23 సీట్లే వచ్చిన అంశం, పార్టీలో లుకలుకలు, అలిపిరి బ్లాస్ట్ వంటి ప్రశ్నలుంటాయా లేదా అనేది తెలియాలంటే.. ఆహాలా స్ట్రీమ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aha OTT Platform, Andhra Pradesh, Chandrababu Naidu, Nara Lokesh, Unstoppable with NBK