Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నా.. లోకేష్ (Lokesh) అన్నా విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) తీవ్ర స్థాయిలో మండిపడుతుంటారు. నిత్యం సోషల్ మీడియా (Social Media)లో యాక్టివ్ గా ఉండే విజయసాయి రెడ్డి.. మరోసారి టీడీపీ (TDP) నేతలపై సెటైర్లు వేశారు. చంద్రబాబు ని టార్గెట్ చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. ఇదే సమయంలో నారా లోకేష్ ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి తండ్రి, కొడుకులు ఇద్దరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ యువ నాయకత్వంపై సెటైర్లు వేశారు.
40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే తెలుగు దేశం పార్టీలో 40 శాతం సీట్లు యువతకే అంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త పాట పాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఉద్దేశంలో యువత అంటే నారా లోకేశ్, చింతకాయల విజయ్, గౌతు శిరీష, అదితి గజపతి, పరిటాల శ్రీరామ్ వంటి వారసులేనా బాబూ అంటూ ప్రశ్నించారు. వారికేనా టిక్కెట్లు ఇచ్చేది అంటూ నిలదీశారు. ఇదే సమయంలో సీఎం అభ్యర్ధిగా పాలబుగ్గల పసివాడు పప్పు నాయుడి పేరు ప్రకటిస్తావా బాబూ? అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు.
టీడీపీలో 40 శాతం సీట్లు యువతకే అంటూ ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు చంద్రం. యువత అంటే నారా లోకేశ్, చింతకాయల విజయ్, గౌతు శిరీష, అదితి గజపతి, పరిటాల శ్రీరామ్ వంటి వారసులేనా బాబూ? టిక్కెట్లేనా...సీఎం అభ్యర్ధిగా పాలబుగ్గల పసివాడు పప్పు నాయుడి పేరు ప్రకటిస్తావా బాబూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 30, 2022
టీడీపీ 40వ ఆవిర్భావ సభలో చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ ముచ్చట్లే మాట్లాడరని ఆరోపించారు. ఆ రోజు చంద్రబాబు మాట్లాడుతూ 94లో కోకాపేటలో ఎకరం 60 వేలు ఉందని, ఇప్పుడు 60 కోట్లు ఉందని చంద్రబాబు చెబుతున్నారని.. హైటెక్ సిటీలో అప్పుడంత. ఇప్పుడింత. అమరావతిలో రేట్లు అప్పుడు, ఇప్పుడు అంటూ చంద్రబాబు మాటలు వింటే.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా అనిపిస్తున్నాయంటూ విమర్శించారు. చంద్రబాబూ! లీడర్ అనే భ్రమలో ఒక వర్గం ఉంది. కానీ ఆయన మాత్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్వి అంటూ విజయ సాయి రెడ్డి టార్గెట్ చేశారు.
టీడీపీ వార్షికోత్సవంలో చంద్రబాబుదంతా రియల్ ఎస్టేట్ ముచ్చట్లే. 94లో కోకాపేటలో ఎకరం 60 వేలు. ఇప్పుడు 60కోట్లట! హైటెక్ సిటీలో అప్పుడంత. ఇప్పుడింత. అమరావతిలో రేట్లు అప్పుడు, ఇప్పుడు అంటూ ఏకరవుపెట్టారు. బాబూ! నువ్వు లీడర్ వనే భ్రమలో ఒక వర్గం ఉంది. కానీ నువ్వో రియల్ ఎస్టేట్ బ్రోకర్వి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 30, 2022
అదే సమయంలో లోకేస్ కు చిప్పు డ్యామేజి అయింది అన్నారు. ఏదో విమర్శ చేయబోయి తనే ఇరుక్కుంటాడు అంటూ లోకేష్ ను టార్గెట్ చేశారు. యాక్సిడెంట్ల తీవ్రత, కారణాలను చూసి ఎక్స్ గ్రేషియా నిర్ణయిస్తారు అంటూ పేర్కొన్నారు. కేంద్రం 2 లక్షలు ప్రకటించింది. ఢిల్లీని ప్రశ్నించే ధైర్యం లోకేష్ కు ఉందా అంటూ నిలదీశారు. పుష్కరాల తొక్కిసలాట మృతుల ఉసురు తీసింది మీరే కదా అంటూ నిలదీశారు. కంపెన్సేషన్ ఎంతిచ్చారూ అంటే విజయసాయి రెడ్డి ఎదురు ప్రశ్నించారు.
పప్పుకు చిప్పు డ్యామేజి అయింది. ఏదో విమర్శ చేయబోయి తనే ఇరుక్కుంటాడు. యాక్సిడెంట్ల తీవ్రత, కారణాలను చూసి ఎక్స్ గ్రేషియా నిర్ణయిస్తారు. కేంద్రం 2 లక్షలు ప్రకటించింది. ఢిల్లీని ప్రశ్నించే ధైర్యం ఉందా? పుష్కరాల తొక్కిసలాట మృతుల ఉసురు తీసింది మీరే కదా. కంపెన్సేషన్ ఎంతిచ్చారు?
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 30, 2022
వెన్నుపోటు కుట్రతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నుంచి ఆయననే బహిష్కరించి, పార్టీ బ్యాంకు డిపాజిట్లు సహా ఆస్తులను కొట్టేసిన ఘనుడు అంటూ చంద్రబాబు అంటూ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. నాడు అదొక అనివార్య, చారిత్రక అవసరం అన్నట్టు 'బిల్డప్' ఇచ్చింది పచ్చ మీడియా అని పేర్కొన్నారు. నేడు ఆయన బొమ్మకు దండలేసి, దండాలు పెడితే పాపాలు పరిహారమవుతాయా? అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు.
వెన్నుపోటు కుట్రతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నుంచి ఆయననే బహిష్కరించి, పార్టీ బ్యాంకు డిపాజిట్లు సహా ఆస్తులను కొట్టేశాడు చంద్రబాబు. నాడు అదొక అనివార్య, చారిత్రక అవసరం అన్నట్టు ‘బిల్డప్’ ఇచ్చింది పచ్చ మీడియా. నేడు ఆయన బొమ్మకు దండలేసి, దండాలు పెడితే పాపాలు పరిహారమవుతాయా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 30, 2022
సోషల్ మీడియా వేదికగా పెట్టిన మరో పోస్ట్ లో ప్రజల ఆకాంక్షలు, సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు అవతరించబోతున్నాయి అన్నారు విజయసాయి. ఇప్పుడున్న 13 జిల్లాలను పునర్ వ్యవస్థీకరిస్తూ 26 జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. ఏప్రిల్ 4 ఉదయం 9గం.05ని నుంచి 9గం.45ని. మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగబోతోందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, TDP, Vijayasai reddy, Ycp