Home /News /andhra-pradesh /

AP POLITICS MP VIJAYASAIREDDY SLAMS ON CHANDRABABU NAIDU AND ALL VIZAG LEADERS HE GAVE STRONG WARNING NGS VSP

Vijayasai Reddy: చంద్రబాబుకు ఆ సమస్య.. దేవుడు కరుణిస్తే వచ్చే ఎన్నికల వరకు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు

ఎంపీ విజయసాయి రెడ్డి

ఎంపీ విజయసాయి రెడ్డి

Vijayasai Reddy: టీడీపీ నేతలపై ఫిర్యాదు చేయడంతో పాటు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎంపీ విజయ సాయి రెడ్డి. అంతేకాదు చంద్రబాబుపై దారుణమైన కామెంట్స్ వచ్చే.. దేవుడు కరుణిస్తే మాత్రమే వచ్చే ఎన్నికల వరకు రాజకీయాలు చేయగలరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అలాగే విశాఖలో టీడీపీ నేతలు ఎవర్నీ వదలమని ఛాలెంజ్ చేశారు.

ఇంకా చదవండి ...
  MP Vijayasai ReddY: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)  అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సహా.. ఇతర నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy).. వైజాగ్ (Vizag) లో ఒక్క టీడీపీ (TDP) నేతను కూడా వదిలేది లేదని.. అందరి అక్రమాలు బయట పెట్టి.. జైల్లో పెట్టిస్తామని శపథం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల విశాఖపట్నం  (Visakhapatnam) ఎన్‌సీసీ భూముల వివాదంలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. తనపై ఇలా అక్రమంగా నిందలు వేసే.. టీడీపీ నాయకులు, కొన్ని మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేశాను అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోనే ఎన్‌సీసీ భూముల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. కాదు అంటే తిరుపతి వేంకటేశ్వర స్వామిపై ఒట్టు పెట్టి నిజాలు చెప్పగలరా..? అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు తీసుకుని ఎన్‌సీసీ కంపెనీకి లబ్ది చేకూర్చింది చంద్రబాబు నాయుడే అని ఆయన ఆరోపించారు.

  గతంలో ఎవరూ చేయని విధంగా చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ విజయసాయి రెడ్డి.  ప్రస్తుతం చంద్రబాబు ఆల్జీ మర్స్ తో బాధ పడుతున్నారని, దేవుడు ఆయుష్హు ఇస్తే వచ్చే ఎన్నికల వరకు మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేయగలిగేది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో బీసీల కడుపు కొట్టి భూములను చంద్రబాబు సామాజిక వర్గం ఆక్రమించిందని, ఆ భూముల విలువ కనీసం 10వేల కోట్లు ఉంటుందన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఇతర నేతల అత్యుత్సాహం చూసి.. గత ఆరు నెలలుగా ఆక్రమణ దారులకు ధైర్యం వచ్చిందని, ఎంత దుష్ప్రచారం చేసిన భూముల అక్రమాలను సహించేది లేదని స్పష్టం చేశారు విజయసాయి రెడ్డి.

  ఇదీ చదవండి : ఏపీ కొత్త కేబినెట్ ఎలా ఉండబోతోంది అంటే..? సజ్జలతో సీఎం భేటీకి కారణం అదేనా..?

  టీడీపీ హయాంలో అన్యక్రాంతం చేసుకున్న అన్నీ స్వాధీనం చేసుకుంటామని, సుజనా చౌదరి ఆర్ధిక నేరగాడు అంటూ మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడు మోస్ట్ వాగుడుకాయి అని, ఆయన ఇంటి పేరు చింత కాయ కాదు మిరపకాయలు అంటూ సెటైర్లు వేశారు. అయ్యన్న తాగితే మనిషి కాదు…రాత్రీ,పగలు తాగే ఉంటాడని ఆయన విమర్శించారు. అయ్యన్న, ఆయన కొడుకు విజయ్ కి బినామీ కంపెనీలు ఉన్నాయని, బెంగుళూరులో మోసాలకు పాల్పడ్డారని విజయసాయి ఆరోపించారు. అయ్యన్న కొడుకుల మోసాలపై ఈడీకి ఫిర్యాదు చేస్తానని, జీఆర్పీఎల్ కంపెనీ మురళీ, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు మంచి స్నేహితుడని, జీఆర్పీఎల్ కంపెనీలో నా అల్లుడికి వాటాలు ఉన్నాయనేది అసత్య ప్రచారమని కొట్టి పారేశారు. విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని, క్రిమినల్ , సివిల్ డిఫార్మేషన్ కేసులను న్యాయస్థానంను ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు.

  ఇదీ చదవండి : ఉరితాళ్లతో చెట్లకు వెళ్లాడుతూ.. చావే శరణ్యం అంటున్న గిరిజన మహిళలు.. కారణం ఏంటో తెలుసా..?

  అంతకుముందు సింహాచల దేవస్థానం ఔన్యత్యన్ని కాపాడాలని, దేవస్థానం అభివృద్ది చేయడంలో చురుకైన పాత్ర పోషించాలని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. సింహాచలం దేవస్థానానికి కొత్తగా నియమితులైన బోర్డు సభ్యులు  గురువారం నగరంలోని సర్క్యూట్ హౌస్ లో ఎంపీ విజయసాయి రెడ్దిని కలిసారు. ఈ సందర్బంగా విజయసాయి రెడ్డి బోర్డు సభ్యులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మెత్తం 14 మంది సభ్యులలో 50 శాతం రిజర్వేషన్ పాటిస్తూ ఏడుగురు మహిళలను నియమించడం జరిగిందని అన్నారు
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Vijayasai reddy, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు