హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayasai Reddy: కేంద్రంతో ఢీ అంటున్న వైసీపీ.. రాజధానులపై నిర్ణయాధికారం అసెంబ్లీదే..

Vijayasai Reddy: కేంద్రంతో ఢీ అంటున్న వైసీపీ.. రాజధానులపై నిర్ణయాధికారం అసెంబ్లీదే..

ఎంపీ విజయసాయి రెడ్డి

ఎంపీ విజయసాయి రెడ్డి

Vijayasai Reddy: మొన్నటి వరకు కేంద్రాన్ని ప్రశ్నించని వైసీపీ.. ఇఫ్పుడు రూటు మార్చిందా..? కేంద్రపై యుద్ధాన్ని ప్రకటించిందా..? పార్లమెంట్ వేదికగానే కేంద్రం తీరును ప్రశ్నిస్తోందా..? ఇప్పటికే పెరిగిన ధరలపై కేంద్రం తీరును తప్పు పట్టిన విజయసాయి రెడ్డి.. తాజాగా రాజధానులపై కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, కేంద్ర ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరుగుతోందా..? మొన్నటి వరకు ఒకరికి ఒకరు సాయం చేసుకోవడమే తప్పా.. విమర్శలు వినిపించేవి కాదు.. ఏపీ బీజేపీ నేతలు అధికార వైసీపీని విమర్శించినా..? కేంద్రంలోని పెద్దలు మాత్రం.. ఏమనేవారు కాదు.. ఇటు వైసీపీ నేతలు సైతం కేంద్రాన్ని పల్లెత్తు మాటన్న సందర్భాలు లేవు.. రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా.. కనీసం ఎప్పుడూ ప్రశ్నించలేదు. రాష్ట్ర పతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు ముందే వైసీపీ మద్దతు ప్రకటించింది. అప్పటి వరకు అంతా సవ్యంగానే ఉంది. ఆ తరువాత ఒక్కసారిగా పరిస్థితి మారింది. మొన్న పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ కేంద్రం తీరును తొలిసారి ప్రశ్నించారు. పరిహారం కోసం కేంద్రంతో యుద్ధం చేయాల్సి వస్తోంది అన్నారు.. అక్కడ నుంచి వైసీపీ నేతలు పదే పదే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాజ్యసభ వేదికగా కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఎంపీ విజయసాయి రెడ్డి..

పార్లమెంటులో శుక్రవారం ఓ కీలక బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఏంటంటే..? మూడు రాజధానుల్ని తీసుకొచ్చేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే హైకోర్టు దీన్ని తోసిపుచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించకుండా, అసెంబ్లీలో మరో బిల్లు ప్రవేశపెట్టకుండా.. ఓఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై వైసీపీ ఆలోచిస్తోంది. అందులో భాగంగా వైసీపీ మరోసారి అప్రమత్తమైంది. కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి మూడు రాజధానుల్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

అసెంబ్లీకే అధికారం కోరుతూ బిల్లు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ఆమోదించినా అది చట్టపరంగా చెల్లుబాటు కాకపోవడంతో వైసీపీ ఇరుకున పడింది. ఇప్పుడు మూడు రాజధానుల పేరెత్తేందుకే ఆలోచించాల్సిన పరిస్ధితి. కేవలం అసెంబ్లీకే మూడు రాజధానుల్ని నిర్ణయించే అధికారం ఉండేలా చట్ట సవరణ చేయాలంటూ వైసీపీ పార్లమెంటులో విజయసాయి రెడ్డి బిల్లు ప్రవేశ పెట్టారు. రాజధానులపై అసెంబ్లీకి విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ కోరుతూ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు.

ఇదీ చదవండి : వరలక్ష్మీ వ్రతం మహత్యమా..? గడప ముందుకే వచ్చి పిండకుండానే పాలిస్తున్న గోమాత.. మీరే చూడండి

విజయ సాయి రెడ్డి బిల్లులో ఏముంది అంటే..? ఒక రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై ఆ రాష్ట్ర శాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ కోరుతూ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఒకటి అంతకంటే ఎక్కువ రాజధానుల ఏర్పాటు చేసే అధికారం వాస్తవానికి ఆయా రాష్ట్ర శాసన వ్యవస్థకే ఉందని ఆయన బిల్లులో తెలిపారు. దీనిపై మరింత స్పష్టత కోరుతూ ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్దంగా తిరుగులేని అధికారం కల్పించే ఉద్దేశంతో ఆర్టికల్‌ 3ఏని చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేపట్టడం ఈ బిల్లు ఉద్దేశంగా ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి : కావాలనే ఆయన్ను టార్గెట్ చేస్తున్నారా? మరి మాజీ మంత్రి ఆడియో లీక్ చేసింది ఎవరు..?

మరి ఈ విషయంలో కేంద్రం తన అధికారం వదులుకుంటుందా? అమరావతికి గతంలో ఒప్పుకున్న కేంద్రం.. ఆ తర్వాత ప్రభుత్వం మారి మూడు రాజధానులు తెరపైకి తెస్తే ఒప్పుకోవాలా వద్దా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. కేంద్రం మాత్రం వైసీపీతో కొనసాగిస్తున్న సత్సంబంధాల నేపథ్యంలో రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పింది. దీంతో గతంలో చంద్రబాబు ఎంపిక చేసిన అమరావతి విషయంలో తమ నిర్ణయం కరెక్టే అని స్పష్టం చేసింది. రాజ్యాంగ సవరణ చేసి అసెంబ్లీకే రాజధాని నిర్ణయాధికారం ఇచ్చేస్తే ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతే అప్పుడేం చేయాలన్న దానిపై కేంద్రం ఇరుకునపడే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు కేంద్రం తన అధికారాల్ని వదులుకుని అసెంబ్లీ చేతుల్లో దీన్ని పెడుతుందా లేదా అన్నది చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Vijayasai reddy