Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార వైసీపీ (YCP)-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రజల్లోనే ఉంటున్నాయి. ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) పేరుతో మంత్రులు, ఎమ్మెల్యే ఇతర ప్రజా ప్రతినిధులు అంతా జనం బాట పట్టారు. మరోవైపు 17 మంది మంత్రులు.. సామాజిక న్యాయ భేరి పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో సభలు నిర్వహించారు.. ఆయా వర్గాల ఓటర్లను ఆకర్షించే పని చేస్తున్నారు. ఇటు తెలుగు దేశం (Telugu Desam) కూడా మహానాడు (Mahanadu) వేదికగా ఎన్నిలక సమర శంఖం పూరించింది. క్విట్ జగన్ సేవ్ ఏపీ (Quit Jagan Save AP) అని ప్రజలకు పిలుపు ఇచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. ఎన్నికలకు ఎప్పుడు వచ్చినా సిద్ధం అనే సంకేతాలు ఇచ్చారు. కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇక జనసేన (Janasena) సైతం త్వరలోనే ప్రజా యాత్రకే సిద్ధమవుతోంది. ఇప్పటికే అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కౌలు రైతులకు సాయం పేరుతో గ్రామాలు చుట్టేస్తున్నారు. ఇలా ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లాయి. దీంతో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా తెలుగు దేశం పార్టీ, మహానాడుపై ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒంగోలులో జరుగుతున్నది మహానాడు కాదు మహాప్రస్థానం అని విజయసాయి రెడ్డి ఆరోపించారు. వెన్నుపోటుదారుడు, ఉన్మాది అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అంతేకాదు మాధవరెడ్డిని చంద్రబాబే హత్య చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. అసిలు నారా అంటే నాసిరకం రాజకీయం అంటూ కొత్త అర్థం చెప్పారు. తెలుగు దేశం క్విట్ జగన్.. సేవ్ ఏపీ అని నినాదం ఇస్తే.. విజయసాయి రెడ్డి కిక్ చంద్రబాబు సేవ్ ఏపీ అంటూ మరో కొత్త నినాదం అందుకున్నారు. ఇప్పటికే ప్రజలు పలుమార్లు తన్నినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని.. వచ్చే ఎన్నికల్లో పూర్తిగా ప్రజలే టీడీపీని బాదేస్తారని విజయసాయి అభిప్రాయపడ్డారు.
వంచన, వెన్నుపోటుకు పుట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన ఉన్మాది చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉన్మాది అయిన చంద్రబాబు కొడుకే మరో సంవత్సరంలో వెన్నుపోటు పొడుస్తాడు రాశిపెట్టుకోండి అన్నారు. అలాగే లోకేష్ ను గుర్తింపు లేని వ్యక్తిగా చేసే పరిస్థితి చంద్రబాబు తెచ్చారన్నారు. మాధవరెడ్డిపై చంద్రబాబుకు కోపం ఉంటే ఉండొచ్చు. మాధవరెడ్డిని చంద్రబాబు హత్య చేయించారు. మాధవరెడ్డిపై చంద్రబాబుకు ఎందుకు కోపమో అందరికీ తెలుసు అన్నారు. అందుకే కిక్ బాబు సేవ్ ఏపీ నినాదంతో వైసీపీ ముందుకెళ్తుంది అన్నారు.
ఇదీ చదవండి ఛీ ఛీ.. క్యాంపస్ లో పాడు పనులా? బాయ్స్ హాస్టల్ వెనుక వ్యవహారం చూస్తే మైండ్ బ్లాంక్
మామను వెన్ను పోటు పొడిచి పార్టీని లాక్కుని ఎన్టీఆర్ కే సంవత్సరికంగా మహానాడు నిర్వహిస్తున్నారు. పనికి మాలిన వెధవలు రాష్ట్ర సంపద కొల్లగొట్టాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు. నాసిరకం నాయకుడు అని చంద్రబాబు పేరులోనే ఉంది. చంద్రబాబు ఊహించుకుంటే ముందస్తు ఎన్నికలు వస్తాయా? అని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారు? ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, TDP, Vijayasai reddy, Ycp