హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayasai Reddy: ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Vijayasai Reddy: ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎంపీ విజయసాయి రెడ్డి (File)

ఎంపీ విజయసాయి రెడ్డి (File)

Vijayasai Reddy: వైసీపీ రాజ్య సభ సభ్యుడు.. కీలక నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రైల్వే జోన్ రాదనే వార్తలపై స్పందించిన ఆయన.. రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాంటూ ఛాలెంజ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే..?

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Vijayasai Reddy: విశాఖ రైల్వే జోన్ (Visakha Railway Zone) రద్దు అయ్యింది అంటూ కొన్ని పత్రికలు.. సోషల్ మీడియా (Social Media) లో వార్తలు రావడంపై ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం (Visakhapatnam) కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే తాను రాజీనామా చేస్తానని.. ఆ వార్తలను సవాల్ చేశారు. రైల్వే జోన్ రాదంటూ కొన్ని పత్రికలు అసత్య కథనాలకు ప్రచారం చేస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విభజన సమస్యలపై మంగళవారం జరిగిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం.. అసలు ప్రస్తావనకే రాలేదని.. కానీ కావాలనే కొందరు ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీరే ఊహించుకుని.. ఆ ఊహలను ప్రజల మీదకు రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు నిన్నటి సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం చర్చకు రాలేదని తేలితే.. తప్పుడు కథనాలు రాసిన వారంతా బహిరంగంగా క్షమాపణలు చెబుతారా అంటూ ఛాలెంజ్ చేశారు.

  ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. కుట్రలు పన్నినా.. రైల్వే జోన్ ఏర్పాటును ఆపలేరన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావ‌ట్లేద‌ని, ఇది క‌ల‌గా మిగిలిపోతుంద‌ని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. కేంద్ర రైల్వే శాఖ‌ మంత్రిని వైసీపీ పార్లమెంట్ స‌భ్యుల బృందం క‌లిసిన‌ప్పుడు రైల్వే జోన్ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చారని మరోసారి వెల్లడించారు.

  అసత్య ప్రచారాలు చేస్తున్నవారందరి అంచనాలు తల్లకిందులు అవుతూ.. అతి త్వర‌లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అవుతుందని చాలెంజ్ చేసి చెప్పార. కేవలం ప్రజల నుంచి వైసీపీని దూరం చేయాలని, వైసీపీని రాజకీయంగా దెబ్బ కొట్టాలని చెడు ఉద్దేశ్యంతో దురుద్దేశ‌పూర్వకంగానే రైల్వే జోన్ రాదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని దెబ్బ తీసేందుకు టీడీపీ అనుకూల మీడియా చేస్తోన్న ఉద్దేశపూర్వక ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అయ్యాక.. అందరి లెక్కలు తేలుతాయన్నారు.

  ఇదీ చదవండి : రైల్వే జోన్ పై వదంతులు నమ్మొద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

  పునర్విభ‌జ‌న చ‌ట్టంలో రైల్వేజోన్ కు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. రాజధాని ఎక్కడైతే ఉందో ఆ రాజధానిని కొవ్వూరు మీదుగా తెలంగాణ ప్రాంతాలు కలిసే విధంగా రైల్వే లైన్ నిర్మించి, హైదరాబాద్ ను కనెక్ట్ చేయాలనే అంశంపైన కూడా చర్చ జరిగిందన్నారు. చ‌ట్టంలోనే చాలా స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి, కొవ్వూరు మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేసి, హైద‌రాబాద్ కు క‌నెక్ట్ చేయాల‌ని, ఆ మొత్తం నిధులను కేంద్రమే భ‌రించాల‌నేది.. రాష్ట్రం తరఫున కేంద్రాన్ని పలుమార్లు కోరడం.. అందుకు కేంద్రంలోని పెద్దలు సానుకూలంగా స్పందించారని వివరణ ఇచ్చారు.

  ఇదీ చదవండి: అనంతపురంలో మెగా కోలాహలం.. ఉదయం నుంచే సందడి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

  మరోవైపు దీనిపై కేంద్ర మంత్రే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. రైల్వే జోన్‌ హామీకి కేంద్రం కట్టుబడి ఉందని.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ (Aswamy Vaisnav) మరోమారు స్పష్టం చేశారు. అయితే విశాఖ రైల్వే జోన్‌ రద్దంటూ కొన్ని పత్రికలు కథనాలు ఇస్తు్న్నాయని.. అసలు అలాంటి చర్చే జరగలేదు అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఎలాంటి వదంతులు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. గతంలో ప్రకటించిన మాదిరిగానే జోన్ ఏర్పాటు చేస్తామన్నారు

  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు