హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayasai: మీడియాలో యాంకర్ గా కూడా పనికిరావ్.. వైసీపీ ఎంపీవైతే చంద్రబాబుతో పనేంటి..?

Vijayasai: మీడియాలో యాంకర్ గా కూడా పనికిరావ్.. వైసీపీ ఎంపీవైతే చంద్రబాబుతో పనేంటి..?

ఎంపీ రఘురామ రాజు పై విజయసాయి సెటైర్లు

ఎంపీ రఘురామ రాజు పై విజయసాయి సెటైర్లు

Vijayasai Reddy: ప్రధాని మోదీ అధ్యక్షతన జీ20 సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి సమావేశంపై విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు..

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

MP Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) ఎన్నికల వేడి కనిపిస్తోంది. నేతల మధ్య మాటల తూటాలు సైతం పీక్ కు చేరాయి.. అయితే ముఖ్యంగా వైసీపీ (YCP) కి టీడీపీ (TDP), జనసేన (Janasena) ప్రధాన ప్రత్యర్థులు అయితే.. వారికన్నా ఎక్కువ విమర్శలు చేస్తోంది మాత్రం ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Ramakrishna Raju).. తీవ్ర విమర్శలతో వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కంటే.. ఎక్కువగా వైసీీని టార్గెట్ చేస్తున్నది ఎంపీ రఘురామ రాజే.. అందుకే వైసీపీ నేతలు సైతం అవకాశం దొరికినప్పుడల్లా రఘురామపై సెటైర్లు వేస్తుంటారు. అయితే తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన జీ 20 సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడ్ని.. ఎంపీ రఘురామ రాజు కలిశారు..

టీడీపీ ఎంపీలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దానికంటే ముందు ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా చంద్రబాబుతో రఘురామ తెలిపినట్టు సమాచారం. వీరి భేటీలో పలు అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

ఎంపీ రఘురామ టీడీపీ అధినేత చంద్రబాబు కలియికపై తనదైన స్టైల్లో స్పందించారు ఎంపీ విజయసాయి రెడ్డి. విజయసాయి మాటల్లో చెప్పాలి అంటే.. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? ఎవరితో కాపురం చేస్తున్నావు పెగ్గూ? YSRCP ఎంపీని అంటావు...టీడీపీతో అంటకాగుతావు. రాజకీయ వ్యభిచారివి. ఛీ! నీది ఒక బతుకేనా? దమ్ముంటే రాజీనామా చేసి పచ్చకుల పార్టీ తరపున గెలువు అంటూ మండిపడ్డారు.

అక్కడితోనే విజయసాయి రెడ్డి ఆగలేదు. పట్టపగలే పెగ్గేసుకొని పచ్చ మీడియా ముందు వాగుతావు. బ్యాంకుల్లో పేదలు దాచుకొన్న సొమ్ము వెయ్యి కోట్లకుపైగా దోచుకున్నావు. ఏడాది తర్వాత అసలు నీకు ఎంపీ పదవే ఉండదు. పచ్చ మీడియాలో యాంకర్ గా కూడా పనికిరావు. జైలే గతి నీకు. నువ్వేమి ప్రజాప్రతినిధివిరా పెగ్గు? అంటూ ట్వీట్ చేశారు.

చంద్రబాబు నాయుడ్ని కలవడంపై విజయసాయి రెడ్డి విమర్శలు ఎలా ఉన్నా.. రఘురామ మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా.. విభజన హామీల అమలు కోసం టీడీపీ ఎంపీలతో పాటు రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబుకు ఆయన చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మరి చంద్రబాబు సైతం తన ఎంపీలతో రాజీనామాలు చేయించడానికి సిద్ధంగా ఉంటారో లేరో చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, MP raghurama krishnam raju, Vijayasai reddy

ఉత్తమ కథలు