Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.
PM Modi Vizag Tour: ప్రధాని మోదీ (PM Modi) విశాఖ పర్యటన ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం (AP Government) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను దగ్గరుండి ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) పరిశీలిస్తున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో నరేంద్ర మోదీ విశాఖపట్నం (Visakhapatnam)లో పర్యటించి.. ఏడు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని విజయసాయి రెడ్డి చెప్పారు. ఆ కార్యక్రమాల తరువాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడనున్నారని ఎంపీ వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన ప్రధాని బహిరంగ సభ కోసం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ ను జిల్లా అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.
ప్రధాని బహిరంగ సభ, ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలు పీఎంఓ ఖరారు చేయగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ బాద్యతలు చేపడుతోంది అన్నారు. అయితే ఇది రాజకీయ పార్టీలకు సంబందించిన కార్యక్రమం కాదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న కార్యక్రమమని అన్నారు స్పష్టం చేశారు. ప్రధాని 11న విశాఖకు చేరుకుంటారని, 12 వ తేదీ ఉదయం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతారని అన్నారు.
ప్రధాని విశాఖ వస్తున్న సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఘనంగా స్వాగతం పలుకుతారన్నారు. ఈ సందర్బంగా రైల్వేజోన్ పై మీడియా ప్రతినిదులు అడిగిన ప్రశ్నలకు బదిలిస్తూ, రైల్వేజోన్ పై ఇప్పటికే రైల్వే మంత్రి స్ఫష్టమైన సమాచారం ఇచ్చారని గుర్తుచేశారు. ప్రధాని భద్రతా కారణాల దృష్ట్యా పర్యావరణానికి హాని కలిగించకుండా చెట్లు నరకకుండా సమీప ప్రాంతానికి తరలించే ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి : యంగ్ టైగర్ కు కమలం గాలం.. బీజేపీకి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర అయినట్టేనా..? టీడీపీ లెక్క ఏంటి..?
ప్రధాని పర్యటనకు సంబందించి పీఎంఓ కార్యాలయం నుంచి మినిట్ టూ మినిట్ ప్రోగ్రాం వివరాలు త్వరలో అందనున్నాయని అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ తో పాటు యూనివర్సిటీ ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్ల కొరకు మరి కొన్ని క్రీడా స్థలాలు పరిశీలించించామన్నారు. యూనివర్సిటీలో పలు బహిరంగ ప్రదేశాలను సుమారు 2 గంటలు పాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, జివిఎంసీ కమీషనర్ రాజాబాబు, ఏయు వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు తో కలిసి పరిశీలించారు.
బహిరంగ సభ ఏర్పాట్లపై కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ 10472 కోట్లతో వివిధ అభివృద్ది పనులకు ప్రధాని చేతులు మీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరగనుందని అన్నారు.
ఇదీ చదవండి : టీడీపీ సీట్లపైనే ఫోకస్.. 175 ఎందుకు గెలమని సీఎం ధీమా.. కార్యకర్తలకు ఏం చెప్పారంటే?
మోదీ ప్రారంభించనున్నవి ఇవే..
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ రాయపూర్- విశాఖపట్నం 6లేన్ల రహదారి
కాన్వెంట్ జంక్షన్- షీలానగర్ పోర్డు రోడ్డు అభివృద్ది
విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరుద్దరణ
గెయిల్ కు సంబందించి శ్రీకాకుళం-అంగుళ్ పైప్ లైన్ ఏర్పాటు
నరసన్నపేట- ఇచ్చాపురం రోడ్డు అభివృద్ది
ఓఎన్ జీసీ యూ ఫీల్డ్ డెవలప్ మెంట్ ఇన్ ఈస్టర్న్ ఆఫ్ షోర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Pm modi, Vijayasai reddy