హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పవన్ కళ్యాణ్ అలాంటోడు... వాటికి కష్టమే అన్న వైసీపీ నేత

పవన్ కళ్యాణ్ అలాంటోడు... వాటికి కష్టమే అన్న వైసీపీ నేత

పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు.

పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు.

పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు.

    పవన్ కళ్యాణ్‌పై ట్విట్టర్‌లో తనదైన సెటైర్లు వేస్తున్న వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి... మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోమారు విమర్శలు గుప్పించారు. 'నిత్య కళ్యాణం' గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే అంటూ మొదలుపెట్టిన విజయసాయిరెడ్డి... సీజన్‌లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడని పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట అని కామెంట్ చేశారు. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై దోమలకు కష్టకాలమే అంటూ ట్వీట్‌ చేశారు.

    ఇక చంద్రబాబుపై కూడా విజయిసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇసుక కొరత తీర్చాలంటూ చేసిన దీక్షలో మెడకు ఇసుక పొట్లాల దండ వేసుకున్నాడని ఎద్దేవా చేశారు. ఎప్పుడైనా కరువు పైన దీక్ష చేయాల్సి వస్తే ఎముకల హారం చుట్టుకునేలా ఉన్నాడని కామెంట్ చేశారు. ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో కూడా చంద్రబాబుకు తెలియట్లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలు కట్టినంత మంది కూడా దొంగ దీక్షకు హాజరు కాలేదని ఎద్దేవా చేశారు.

    First published:

    Tags: Chandrababu Naidu, Janasena, Pawan kalyan, TDP, Vijayasai reddy

    ఉత్తమ కథలు