Vijayasai Reddy: వైఎస్ఆర్సీపీ (YSRCP) పార్లమెంటరీ నేత.. రాజ్య సభ సభ్యుడు అయిన విజయ సాయి రెడ్డి (Vijayasai Reddy) కి అరుదైన అవకాశం దక్కింది. ఉపరాష్ట్రపతి.. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) సీట్లో విజయసాయి రెడ్డి కూర్చుకున్నారు. ఆయన స్థానంలో కూర్చొని. విజయవంతంగా సభను నిర్వహించే ఛాన్స్ వైసీపీ ఎంపీకి దక్కించుకున్నారు. ఎందుకంటే ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నెల 10వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ఈ నెల 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ పదవి కోసం ఎన్డీఏ నుంచి ధన్ కర్.. విపక్షాల నుంచి మార్గరేట్ అల్వా పోటీ పడుతున్నారు. ఉపరాష్ట్రపతిగా గెలిచిన వారు రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరించాలి ఉంటుంది. దీంతో రాజ్య సభ ఛైర్మన్ (Rajyasabha Chairman) స్థానంలో వైసీపీ ఎంపీ కూర్చోవలసి వచ్చింది. కొద్ది రోజుల క్రితం రాజ్యసభకు కొత్త ప్యానెల్ స్పీకర్లను వెంకయ్య ప్రకటించారు. అందులో వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా ఉన్న విజయసాయి అవకాశం కల్పించారు. ఆ అవకాశం రావడంతో.. ఈ రోజు సాయిరెడ్డి ఛైర్మన్ స్థానంలో తొలి సారి సభను సజావుగా నడిపించారు..
తొలి సారిగా ఛైర్మన్ స్థానంలోకి వచ్చిన విజయ సాయిరెడ్డికి సభ్యులు స్వాగతం పలికారు. ఆ వెంటనే సాయిరెడ్డి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా సూచించారు. మంత్రి సమాధానంకు ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ సభ్యురాలిని అనుబంధ ప్రశ్నలు అడిగేందుకు సాయిరెడ్డి అవకాశం ఇచ్చారు.
Privileged to have presided over the Rajya Sabha today for the first time. Started my journey 6 years back as the lone MP from YSRCP and then there is today. We have really come a long way. All due to the blessings of @YSJagan Garu, Bharatamma and the people of Andhra Pradesh. pic.twitter.com/sduh3AhmK5
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 4, 2022
మరోవైపు ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు అధిక ధరలను నిరిసిస్తూ నినాదాలతో సభ మారుమోగింది. వారి ఆందోళనల మధ్యే సభను నడిపించారు విజయసాయి రెడ్డి. రాజ్యసభలో ప్రస్తుతం వైసీపీకి 9 మంది సభ్యులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వెంకయ్య నాయుడు పదవీ విరమణ చేస్తుండటం.. ఆయనకు తిరిగి ఛైర్మన్ హోదాలో కొనసాగే అవకాశం లేదు. అయితే ఆ స్థానంలో ప్యానెల్ స్పీకర్ గా తెలుగు రాష్ట్రాలకు చెందిన విజయ సాయిరెడ్డికి అవకాశం దక్కింది.
అంతేకాదు లోక్ సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న అవినాశ్ రెడ్డిని స్పీకర్ ప్యానెల్ స్పీకర్ గా నియమించారు. దీంతో..అవినాశ్ గత సమావేశాల్లో స్పీకర్ స్థానంలో సభను నిర్వహించారు. వైసీపీ - కేంద్రం సంబంధాల్లో కీలకంగా గతంలో ఉమ్మడి ఏపీ నుంచి టీడీపీ ఎంపీ బాలయోగి లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించారు.
ఇదీ చదవండి : చంద్రబాబు ప్రత్యర్థికి సీఎం జగన్ బంపర్ ఆఫర్.. మంత్రి పదవిపై హామీ.. ఇంకా ఏం చెప్పారంటే?
రాజ్యసభ సభ్యుడిగా సాయిరెడ్డికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. అనేక అంశాల్లో చర్చలతో పాటుగా ప్రశ్నలు వేయటంలో ఆయన తొలి వరుసలో ఉన్నారు. సభకు హాజరు విషయంలోనూ ఆయన ముందంజలో నిలిచారు. వైసీపీ నుంచి కేంద్రంతో సంప్రదింపులు.. రాష్ట్ర వ్యవహారాల పైన ఏపీ అధికార ప్రతినిధి హోదాలో సాయిరెడ్డి నిత్యం బిజీగా ఉంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Rajyasabha, Vijayasai reddy