హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

RRR: ఏపీ పోలీసులకు సుప్రీం ఊహించని షాక్.. ఎంపీ రఘురామకు బెయిల్ మంజూరు

RRR: ఏపీ పోలీసులకు సుప్రీం ఊహించని షాక్.. ఎంపీ రఘురామకు బెయిల్ మంజూరు

రెండున్నరేళ్ల క్రితం వైసీపీ సర్కార్ తో విభేదించిన రఘురామకృష్ణంరాజు రచ్చబండ పేరుతో ప్రతిరోజూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ సీఎం జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు చేస్తూవచ్చారు. ఈక్రమంలోనే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పలు కోర్టుల్లో పిటిషన్లు వేయడం, అవి విచారణకు రావడం ఏపీ వ్యాప్తంగా టెన్షన్ రేకెత్తించింది. ప్రతిగా రఘురామపైనా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. అరెస్టు భయంతో ఢిల్లీకే పరిమితమైన రఘురామ రెండున్నరేళ్లుగా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు..

రెండున్నరేళ్ల క్రితం వైసీపీ సర్కార్ తో విభేదించిన రఘురామకృష్ణంరాజు రచ్చబండ పేరుతో ప్రతిరోజూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ సీఎం జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు చేస్తూవచ్చారు. ఈక్రమంలోనే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పలు కోర్టుల్లో పిటిషన్లు వేయడం, అవి విచారణకు రావడం ఏపీ వ్యాప్తంగా టెన్షన్ రేకెత్తించింది. ప్రతిగా రఘురామపైనా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. అరెస్టు భయంతో ఢిల్లీకే పరిమితమైన రఘురామ రెండున్నరేళ్లుగా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు..

గుంటూరు నుంచి హైదరాబాద్ ఆర్మీ ఆస్పత్రికి వెళ్తున్న సమయంలో కారులో వెళ్తూ మీసం తిప్పిన ఎంపీ రఘురామ విజయం సాధించారు. బెయిల్ వస్తుందన్న ఆయన నమ్మకం నిజమైంది. మొత్తానికి బెయిల్ మంజూరు అయ్యింది. అయితే బెయిల్ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం ఆయనకు కొన్ని షరతులు పెట్టింది.

ఇంకా చదవండి ...

  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రఘురామపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేటంత తీవ్రమైనవి కాదని, పిటిషనర్‌ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ మంజూరరు చేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. అయితే కేసు దర్యాప్తుకు రఘురామకృష్ణరాజు సహకరించాలని పేర్కొంది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని పేర్కొంది. గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి వెంటనే బెయిల్ తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పు ఏపీలో పోలీసులకు షాకింగ్ లాంటిదే అని చెప్పాలి. ఎందుకంటే అసలు ఈ కేసు విచారణకు అర్హత లేదని ఏపీ పోలీసుల తరుపున వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయమూర్తికి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సీఐడీ తరపున వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది..

  రఘు రమాకు బెయిల్ కండీషన్స్ ఇవే..

  దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెంటనే వెళ్లాలి.

  న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలి.

  ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు.

  దర్యాప్తును ప్రభావితం చేయకూడదు.

  మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు.

  అంతకుముందు ఆర్మీ ఆస్పత్రి నివేదికను న్యాయమూర్తి వినయ్ చరణ్‌ చదివి వినిపించారు. రఘురామ పాదాలకి గాయాలున్నట్టు నిర్ధారణ అయ్యిందన్నారు.. ఆర్మీ ఆస్పత్రి నివేదికతో మేం విభేదించడం లేదని సీఐడీ తరపున న్యాయవాది వాదించారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో గాయాలకు గల కారణాలు లేవని అభిప్రాయపడింది. గుజరాత్‌ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయాలి. హైకోర్టులో ఇంకా మెరిట్‌ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు దాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో ఎలా పిటిషన్‌ దాఖలు చేస్తారు?దవే సుప్రీంకు తెలిపారు. ఎంపీ రఘురామ హద్దులు మీరారని, కరోనా సంక్షోభ సమయంలో ఇదంతా సరికాదని ఆయనకు సమయమిచ్చామని దవే కోర్టుకు తెలిపారు. సీఐడీ అధికారులు ఎంపీకి సంబంధించిన 45 వీడియోలు సేకరించి విచారణ చేపట్టారన్నారు. కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడి సృష్టించేందుకు రఘురామ ప్రయత్నించారనీ, ఇవవన్నీ రాజద్రోహం కిందికే వస్తాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామకృష్ణరాజు ఎంపీ అని ముకుల్‌ రోహత్గీ పదేపదే చెబుతున్నారనీ, చట్టం అందరికీ ఒక్కటేనని దవే అన్నారు. ఎంపీ అయినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టేందుకు లైసెన్స్‌ ఇచ్చినట్లు కాదన్నారు. హైకోర్టు బెయిల్‌ కోసం కింది కోర్టుకు వెళ్లమని చెప్పిందని, ఎంపీ అయినంత మాత్రాన బైపాస్‌లో నేరుగా సుప్రీం కోర్టుకు ఎలా వస్తారు? అని దవే ప్రశ్నించారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికపై తాము అభ్యంతరం చెప్పడం లేదని, అదే సమయంలో జీజీహెచ్‌ ఆస్పత్రి నివేదిక కూడా సరైనదేనని కోర్టుకు తెలిపారు. అలాగైతే ఎంపీ కాలికి ఫ్రాక్చర్‌ గురించి ఏం చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. గుంటూరు జైలు నుంచి ఆర్మీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తామంటే ఎంపీ నిరాకరించారనీ, తన కారులో వెళ్తూ అభివాదం చేశారనీ, ఆ సమయంలో కాలిగాయాలు చూపించారనీ చెప్పారు.

  మరోవైపు రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాది రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. జగన్‌ బెయిల్‌ రద్దుకు పిటిషన్‌ వేశారన్న నెపంతోనే ఆయనపై కక్షపెంచుకున్నారని కోర్టుకు తెలిపారు. జగన్‌ ప్రతివాదిగా లేనందున దీనిలోకి ఆయన్ను లాగొద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే అన్నారు. పిటిషనర్‌గా తాను చెప్పాలనుకున్నది తాను చెబుతానని రోహత్గీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు న్యాయవాదులు ఎందుకు తగవులాడుకుంటున్నారని ధర్మాసనం మందలించింది. బెయిల్‌ రాకుండా ఉండటం కోసమే రాజద్రోహం కేసు పెట్టారని రోహత్గీ ఆక్షేపించారు. అరెస్టు, మెజిస్ట్రేట్‌, హైకోర్టు విచారణ పరిణామాలను రోహత్గీ కోర్టుకు వివరించారు. తరువాత ఆర్మీ ఆస్పత్రి వైద్య పరీక్షలను ఆయన ప్రస్తావించారు. కాలి బొటనవేలు పక్కన ప్రాక్చర్‌ అయ్యిందని వైద్యులు తెలిపారన్నారు. సీఐడీ అదుపులో ఉండగా ఎంపీని చిత్రహింసలు పెట్టిన విషయం నిజమేనని వైద్యనివేదికతో నిర్ధారణ అయ్యిందన్నారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరారు. సిట్టింగ్‌ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ముకుల్‌ రోహత్గీ ప్రశ్నించారు. కేదార్‌నాథ్‌ తీర్పులో రాజద్రోహం పెట్టే కారణాలు వివరించారు. కానీ, ఈ సందర్భంలో రాజద్రోహం పెట్టిన కారణం పూర్తిగా బోగస్‌ అని రోహత్గీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

  ఇరు వాదనలు విన్న తరువాత.. సీఐడీ పోలీసుల వాదనను ఏకీభవించిన సూప్రీం కోర్టు రఘురామకు బెయిల్ మంజూరు చేసింది. అయితే సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. విచారణకు మాత్రం సహకరించాలని స్పష్టం చేసింది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, MP raghurama krishnam raju, Supreme Court

  ఉత్తమ కథలు