హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: నా భర్తకు ప్రాణ హానీ ఉంది.. జగన్ కళ్లో ఆనందం చూసేందుకే అలా చేస్తున్నారు

Andhra Pradesh: నా భర్తకు ప్రాణ హానీ ఉంది.. జగన్ కళ్లో ఆనందం చూసేందుకే అలా చేస్తున్నారు

రఘురామకృష్ణం రాజు

రఘురామకృష్ణం రాజు

తన భర్తకు ప్రాణ హాని ఉందని ఎంపీ రఘురామ భార్య రమ ఆరోపించారు. ఆయనకు ఏది జరిగిన ఏపీ ప్రభుత్వం, సీఐడీ పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు జగన్ కళ్లలో ఆనందం చూసేందుకే కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎలాంటి కారణాలు లేకుండా అరెస్ట్ చేయడం దారుణమని విపక్షాలు మండిపడుతున్నాయి. కేవలం అరెస్ట్ చేయడం కాదు పోలీసులు కొట్టడంపైనా విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నాయి. అసలు ఏపీలో పరిపాలన ఉందా అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి అరాచక పాలన మరే రాష్ట్రంలో లేదని.. ఆరోపిస్తున్నాయి. మరోవైపు తన భర్తకు ప్రాణహాని ఉందని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు భార్య రమ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి మంగళగిరి తీసుకెళ్లిపోయారని, శుక్రవారం రాత్రంతా నానా ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించాలని కోర్టు చెప్పినా వినకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారని అన్నారు. తన భర్తకు ఏది జరిగినా దానికి ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సీఐడీ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

  కుటుంబ సభ్యుల ఆవేదన నేపథ్యంలో గుంటూరు జైలులో ఉన్న ఎంపీ రఘురామ కృష్ణరాజును తక్షణమే రమేశ్‌ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. ఆయన శరీరంపై గాయాలకు సంబంధించి వైద్య నివేదిక జిల్లా కోర్టు నుంచి ప్రత్యేక మెసెంజర్‌లో అందిన తర్వాత హైకోర్టు విచారణ చేపట్టింది. మెడికల్‌ బోర్డుతోపాటు రమేశ్‌ ఆస్పత్రి వైద్యులు గాయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ పట్టించుకోలేదని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. కస్టడీలో ఉండగా సీఐడీ అధికారి పిటిషనర్‌ను కలిశారని, ఇది చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రిమాండ్‌ విధిస్తూ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తక్షణమే రఘురామను రమేశ్‌ ఆస్పత్రికి పంపాలని ఆదేశించింది.

  ఇదీ చదవండి: వైఎస్ భారతిని సీఎం చేయండి.. కరోనా కట్టడి అవ్వాలంటే అదే మార్గం

  ఏపీ ప్రభుత్వం తీరుపై విపక్షాలు సైతం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమన్నందుకే ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ప్రభుత్వం కక్షసాధింపులకు దిగిందని టీడీపీ నేత, మాజీమంత్రి చినరాజప్ప అన్నారు. రఘురామ ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. రూల్ ఆఫ్ లా కంటే లాఠీకే పనిచెబుతున్న పోలీసుల తీరు హేయమన్నారు. వైసీపీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని చినరాజప్ప ప్రశ్నించారు. జగన్ కళ్లల్లో ఆనందం చూసేందుకు కొంతమంది పోలీసులు ఇలా హింసిస్తున్నారని, ఏపీలో అరాచకాలపై రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్ స్పందించాలన్నారు.

  ఇదీ చదవండి: ఎంపీని కొట్టిన ఆధారాల్లేవు.. పోలీసులపై హైకోర్టు సీరియస్.. ఆస్పత్రికి తరలించాలని ఆదేశం

  ఎంపీ రఘురామకృష్ణంరాజు పట్ల అధికారుల తీరును జనసేన ఖండిస్తోందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎంపీ విషయంలో నిబంధనలకు, చట్టానికి అధికారులు తూట్లు పొడిచారని విమర్శించారు. ఎంపీ విషయంలోనే ఇలా జరిగితే.. సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. రఘురామ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై..లోక్‌సభ స్పీకర్ సుమోటోగా విచారణకు ఆదేశించాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP News, Janasena, MP raghurama krishnam raju, Nadendla Manohar, TDP, Ycp

  ఉత్తమ కథలు