MP Raghurama: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం వర్సెస్.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghu Rama Krisna Raju) వార్ పీక్ కు చేరింది. ఇప్పటికే ఆయన అనేక విధాల ఏపీ ప్రభుత్వాన్ని (AP Government) విమర్శిస్తూ ఇబ్బందికరంగా మారారు. అయితే ఆయన్ను పదవి నుంచి తప్పించేలా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు.. కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి అన్నా న్యాయస్థానాల ద్వారా ఊరట పొందుతున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ పెద్దలు, అధికారులు సైతం రఘు రామను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన్ను భీమవరం (Bheemavaram) రాకుండా అడ్డుకోగలిగారు. ఎందుకంటే.. ప్రధాని మోదీ (Prime Minster) సభకు రావాలని శతవిధాలా ఎంపీ ప్రయత్నాలు చేశారు.. అందుకు కోర్టు ద్వారా అరెస్టు చేయకుండా ముందస్తు అనుమతి కూడా తీసుకున్నారు. కానీ చివరికి పోలీసులు నిఘా పెట్టడంతో.. ఏక్షణమైనా అరెస్ట్ చేస ప్రమాదం ఉందని భావించి.. ఆయన తిరిగి వెనక్కు వెళ్లిపోయారు కూడా.. అయితే అదే సమయంలో రఘు రామ ఇంటి దగ్గర గుర్తు తెలియన వ్యక్తి సంచారాన్ని గుర్తించారు. దీంతో రఘురామ అనుచరులు, సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారు... అయితే తాను పోలీసుని అని చెప్పినా అనుచరులు వినలేదని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులను కిడ్నాప్ చేశారంటూ ఏపీ అధికారులు నేరుగా హైదరాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చుట్టూ ఉన్న జనం అందరూ చూస్తుండగానే ఎంపీకి సంబంధించిన కారులో కానిస్టేబుల్ ను ఎక్కించుకుని వెళ్లారని ఘటన జరిగిన సమయంలో మీడియా కూడా అక్కడే ఉందని చెబుతున్నారు ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు. తమ కానిస్టేబుల్ ఫారూఖ్ భాషాను ఎంపీ ఇంట్లో 3గంటల పాటు నిర్భందించి అతనిపై దాడి జరిపినట్లు తెలుస్తోంది అన్నారు. ఆ సమయంలో రఘురామ కృష్ణం రాజు ఇంట్లోనే ఉన్నట్లుగా సమాచారం అందింది అంటూ పోలీసులకు తెలిపారు.
ఆ ఫిర్యాదులో ఏం చెప్పారంటే... ఏపి ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ని కారులో తీసుకెళ్లి చితక్కొట్టిన ఎంపీ రఘురామకృష్ణంరాజు భద్రత సిబ్బంది దాడి చేశారని.. రఘురామకృష్ణం రాజు సెక్యూరిటీ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఏపి ఇంటిలిజెంస్ అధికారులు.
ఇదీ చదవండి : ప్రధాని మోదీ సభకు పవన్ ఎందుకు రాలేదంటే..? క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు.. ఏమన్నారంటే..?
దాడికి పాల్పడ్డ వారు మొత్తం ఐదుగురు అని పేర్కొన్నారు. వారందరిపై కేసు నమోదు చేయాలని కోరారు. దీంతోపాటు ఎంపీ రఘురామరాజు కొడుకు భరత్ పిఏ శాస్త్రి ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు సస్పెన్షన్ విధించింది ఏపీ ప్రభుత్వం. ఎంపీ అనుచరులు 7777 కార్‌లో వచ్చి కానిస్టేబుల్‌ను లాక్కెళ్లారని ఇంటలిజెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ప్రధాని భద్రతా విధుల్లో భాగంగా ఐఎస్బీ గేట్ వద్ద స్పాటర్ డ్యూటీలో ఉన్న తనను లాక్కెళ్లి కారులో బలవంతంగా ఎక్కించి కిడ్నాప్ కు పాల్పడినట్లు కంప్లైంట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ycp