Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసు లింకులు తెలుగు రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మొన్నటి వరకు తెలంగాణ (Telangana) లోనే రాజకీయంగా రచ్చ రచ్చ అయిన ఈ విషయం ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా ఈ స్కామ్ కేసులో ఈడీ దూకుడు మరింత పెంచింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార పార్టీ నేతలు కవిత, మాగుంట పేర్లను చేర్చడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రకపంనలు రేగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ (TRS vs BJP) లో పోరు తీవ్రంగా మారింది. ఈ ఘటనతో వైరం మరో లెవెల్ కు వెళ్తోంది. అయితే ఏపీలోనూ అలాంటి పరిస్థితి కనిపిస్తుందా..? లేక కేవలం ఎంపీ విచారణతో వివాదం ముగుస్తుందా చూడాలి.. సాధారణంగా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. వైసీపీ ప్రభుత్వం సహకరిస్తూనే ఉంది.. అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తోంది. బీజేపీ విమర్శలు చేసేది కూడా తక్కువే..? కానీ ఈ కేసులో తనపేరు పెట్టడంతో.. ఎంపీ మాగుంట ఘాటుగా స్పందించారు..
కేంద్రం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతోందా..? అంటే అవుననే అంటున్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కార్ కుట్ర చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ మాగుంట పేరు చేర్చడంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమిత్ అరోరా నార్త్ ఇండియన్.. అతనితో తామెందుకు లిక్కర్ వ్యాపారాలు చేస్తామని ప్రశ్నించారు. అమిత్ అరోరా ఎవరో తనకు తెలియదన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (MP Magunta Srinivasula Reddy).
అసలు రిమాండ్ రిపోర్టులో తన పేరు ఎందుకు చేర్చారో కూడా తెలియదన్నారు. లిక్కర్ స్కామ్ ఎపిసోడ్లో వినయ్ నాయర్‌కి సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ గ్రూప్ కవిత, మాగుంట, శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నటడుస్తోందని, దీంతో వీరి పేర్లను చేర్చింది ఈడీ. లేటెస్ట్గా వంద కోట్ల రూపాయలు సమకూర్చిన వారిలో ఎమ్మెల్సీ కవిత, మాగుంట పేర్లను చేర్చింది ఈడీ. ఈడీ లేటెస్ట్ రిపోర్ట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మొత్తం 32 పేజీల రిమాండ్ రిపోర్టులో కవిత రెండు ఫోన్ నంబర్లను పది ఫోన్లలో వాడినట్లు పేర్కొన్నారు ఈడీ అధికారులు.
ఈ కేసుపై ఎమ్మెల్సీ కవిత కూడా ఘాటుగా స్పందించారు. .తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే మోడీ కంటే ఈడీ (Enforcement Directorate) ముందుగా వచ్చింది. నా మీద, మా ఎమ్మెల్యేలపై, మంత్రులపై కేసులు పెడుతున్నారు. ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జరుగుతుంది. బిజెపి చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తుంది. కేసులు పెట్టుకోండి..అరెస్టులు చేసుకోండి..జైల్లో పెట్టుకోండి అని కవిత (MLC Kavita) సవాల్ విసిరారు. ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలని బీజేపీ పడగొట్టింది. మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా..ఈ పంథా మార్చుకోవాలన్నారు.
ఇదీ చదవండి : : ఆ విషయాలు చెపితే ఉరి వేసుకోవాల్సిందే..? చంద్రబాబుపై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
ఎవరి వాదన ఎలా ఉన్నా ఈ కేసులో ఇప్పటికే గుర్గావ్కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడు. ఢిల్లీ మద్యం పాలసీ, మనీలాండరింగ్ కేసులో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Delhi liquor Scam