Home /News /andhra-pradesh /

AP POLITICS MP KESINENI SRINIVAS NOT SEEN IN CHANDRABABU NAIDU ELECTIONS CAMPAIGN IN VIJAYAWADA FULL DETAILS HERE PRN

Telugu Desham Party: బెజవాడలో చంద్రబాబు రోడ్ షో... కనిపించనే కేశినేని నాని... కారణం అదేనా..?

చంద్రబాబునాయుడు

చంద్రబాబునాయుడు

చంద్రబాబు (Nara Chandrababu Naidu) పర్యటనకు ఒక్కరోజు ముందు పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, సీనియర్ నేత నాగుల్ మీరా.. కేశినేని నానిపై మండిపడ్డారు.

    ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలో పర్యటించిన చంద్రబాబు.. ఆదివారం విజయవాడలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనలో ఎంపీ కేశినేని శ్రీనివాస్ లేకపోవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు పర్యటనకు ఒక్కరోజు ముందు పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, సీనియర్ నేత నాగుల్ మీరా.. కేశినేని నానిపై మండిపడ్డారు. 24గంటలు ముగియకముందే ఐక్యతారాగం ఆలపించారు. దీంతో వివాదాని ఫుల్ స్టాప్ పడినట్టేనని అంతా భావించారు. ఐతే చంద్రబాబు ప్రచారం సందర్భంగా కేశినేని నాని లేకపోవడంతో వివాదం చల్లారేలదన్న చర్చ జరుగుతోంది. ఐతే కేశినేని నాని గైర్హాజరుకు మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

    తన పర్యటనకు కేశినేని నాని దూరంగా ఉండాల్సిందిగా చంద్రబాబు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. శనివారం చోటు చేసుకున్న వివాదంతో పాటు మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేతను ప్రమోట్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చంద్రబాబు పర్యటనలో కీలకాత్ర పోషించిన కేశినేని నాని ఆయన పక్కన లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కేశినేని నానిపై మండిపడ్డ బుద్ధా వెంకన్న, బొండా ఉమా, నాగుల్ మీరా మాత్రం ఆయన పర్యటనలో పాల్గొనడం గమనార్హం.

    ఇక తన పర్యటనలో భాగంగా చంద్రబాబు.. వైఎస్ జగన్ పాలనపై మండిపడ్డారు. గత 20 నెలల వైసీపీ పాలనలో సీఎం జగన్ వీధికో రౌడీని తయారు చేశారని మండిపడ్డారు. అలాగే సొంత పార్టీ నేలకు కూడా చంద్రబాబు చిన్నసైజు క్లాస్ పీకారు. పార్టీలో కొంతమంది వ్యక్తులకు స్వేచ్ఛ ఎక్కువైందని.. వారిని నియంత్రిస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. నాయకులు కూడా క్రమశిక్షణతో ఉండాలన్నారు.

    రాజధాని అమరావతి కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి కోసం విజయవాడ ప్రజలు గట్టిగా నిలబడి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పట్టిసీమ ప్రజల కోసం తీసుకొచ్చానని.. పట్టిసీమ లబ్ధిదారులంతా ఆలోచించాలన్నారు. విజయవాడ మేయర్ పీఠంపై కచ్చితంగా టీడీపీ అభ్యర్థే ఉండాలన్న చంద్రబాబు.. అలా జరగని పక్షంలో ఇక్కడి ప్రజలు తలెత్తుకు తిరగలేరన్నారు. పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లను కూడా వైసీపీ ప్రభుత్వం తీసేసిందని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, Chandrababu naidu, Vijayawada

    తదుపరి వార్తలు