Home /News /andhra-pradesh /

AP POLITICS MP KESINENI NANI COMPLAINT TO CYBER CELL ON FAKE TWEETS FROM HIS ACCOUNT ON CHANDRABABU DELHI TOUR NGS

Kesineni Nani: ఢిల్లీలో బాబు వంగి వంగి దండాలు పెట్టారంటూ ట్వీట్.. సైబర్ సెల్ కు ఫిర్యాదు.. ఎందుకంటే?

బాబు ఢిల్లీ పర్యటనపై కేశినాని పేరుతో ట్వీట్ల దుమారం

బాబు ఢిల్లీ పర్యటనపై కేశినాని పేరుతో ట్వీట్ల దుమారం

Kesineni Nani: తెలుగు దేశంలో కేశినేని నాని చర్చ ఆగడం లేదు.. ఓ వైపు చంద్రబాబును ప్రధాని మోదీ పక్కకు పిలిచి మాట్లాడడాన్ని తెలుగు దేశం పార్టీ వర్గాలు హైలైట్ చేస్తుంటే.. ఇదే సమయంలో చంద్రబాబు వంగి వంగి దండాలు పెట్టారంటూ కేశినేని నాని పేరు మీద ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. దీంతో సైబర్ సెల్ కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India
  Kesineni Nani: గత కొంతకాలంగా ఎంపీ కేశినేని నాని  (MP Kesineni Nani) వ్యవహారం తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తో ఆయన వ్యవహరిస్తున్న తీరు.. ఆయన చేస్తున్న విమర్శలు.. ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. తరువాత కేశినాని నాని.. టీడీపీ ఎంపీలతో ఢిల్లీలో సఖ్యంగా ఉండడం.. ఆయన ఇంట వివాహానికి చంద్రబాబు హాజరయ్యి.. ఆప్యాయంగా మాట్లాడడంతో వివాదం సద్దుమణిగిందని అంతా అనుకుంటుంటే ఇప్పుడు మరో రచ్చ మొదలైంది. తాజాగా ధానమంత్రి నరేంద్ర మోదీ (Preime Minster Modi) అధ్యక్షతన ఏర్పాటైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav ) కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. మోదీతో కొన్ని నిమిషాల పాటు వ్యక్తిగతంగా మాట్లాడారు. దీంతో ఈ అంశాన్ని పార్టీ వర్గాలు హైలైట్ చేస్తున్నాయి. చంద్రబాబుకు ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇచ్చారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతుంటే.. సోషల్ మీడియాలో ఊహించని షాక్ తగిలింది..

  టీడీపీ ఎంపీ కేశినేని నాని.. పేరుతో సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ట్వీట్లు కొత్త దుమారానికి తెరలేపాయి.. అంతకు ముందు కూడా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. తరువాత శాలువాతో సత్కరించి ఫుష్పగుచ్చం అందించారు. ఆ సమయంలో చంద్రబాబుకు బొకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ కేశినానికి ఇవ్వబోయారు.. కానీ నాని బొకేను అసహనంతో తోసేశారు. పార్టీ అధినేత ముందే నాని ఈ విధంగ వ్యవహరించడం హాట్ టాపిక్ గా మారింది.  ఆ ఘటన దుమారం ఆగకముందే.. మరో వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్లు సోషల్ మీడియాలో వెలిశాయి. కేశినేని నాని అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసినట్లుగా ఒకటి రెండు ట్వీట్లు వచ్చాయి. వెంటనే వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా గ్రూప్స్‌లల్లో విస్తృతంగా సర్కులేట్ అయ్యాయి. ప్రధాని మోడీ-చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడుకోవడాన్ని ఆధారంగా చేసుకుని ఈ ట్వీట్లు ట్రెండ్ అవుతున్నాయి. 

  వంగి వంగి దండాలు పెట్టడమే కాకుండా..? ఎప్పుడూ తోడుగా ఉంటానంటూ.. తనను కొంచెం పట్టించుకోవాలని, రాజకీయంగా ఎప్పుడూ తోడుగా ఉంటానని అభ్యర్థిస్తున్నట్లుగా ఆ ట్వీట్లలో పేర్కొన్నారు. తనకు అపాయింట్‌మెంట్ ఇస్తే తానే స్వయంగా వచ్చి కలుస్తాననీ విజ్ఞప్తి చేసినట్లు ట్వీట్ లో ఉంది. అలాగే ఢిల్లీలో చూసిన ఒక వచ్చీ రాని హిందీ సినిమాలోని సన్నివేశంగా అభివర్ణిస్తూ ఈ పోస్ట్ చేశారు.  అయితే ఈ వ్యవహారంపై కేశినేని స్పందించారు. అవి తాను చేసిన కామెంట్స్ కావని తేల్చి చెబుతున్నారు. తన పేరు మీద, బ్లూ టిక్ మార్క్ ఉన్న తన అధికారిక ట్వీట్టర్ అకౌంట్ నుంచి వెలువడిన పోస్టులను ఫ్యాబ్రికేట్ చేశారని కేశినేని ఆరోపిస్త్తోన్నారు. వాటిని ఎవరూ విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. అవి తాను చేసిన ట్వీట్స్ కావని స్పష్టం చేశారు. దీనిపై సైబర్ సెల్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం కౌంటర్లు కొనసాగుతున్నాయి. కేశినేని నాని ఆ ట్వీట్ ను ఎందుకు డిలీట్ చేశారని కొందరు కామెంట్ చేస్తే.. బాబు బతిమాలడంతో డిలీట్ చేశారని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Kesineni Nani, TDP, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు