Home /News /andhra-pradesh /

AP POLITICS MORE THAN 300 EGGS LORRIES TO STOPED IN ODISHA BOARDER BECAUSE VERY LOW PRICE EGG IN ODISHA NGS

Egg Lorries: ఒకటి రెండు కాదు.. 300 లారీలు.. 48 గంటలకుపైగా అవస్థలు.. భువనేశ్వర్ లో ఏం జరిగిందంటే..?

ఒడిషాలో ఏపీ లారీల అడ్డగింత

ఒడిషాలో ఏపీ లారీల అడ్డగింత

Egg Lorries: ఒడిషాలో గుడ్ల రేట్లు దారుణంగా పడిపోయాయి. దీంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ అని అక్కడి వ్యాపారులు మండిపడుతున్నారు. దీంతో మన రాష్ట్రానికి చెందిన 300 లారీలను 48 గంటల పాటు నిలిపివేశారు.. కారణం ఏంటో తెలుసా..?

ఇంకా చదవండి ...
    Egg Lorries: ఒడిషా (Odisha)లో కోడి గుడ్ల వ్యాపారు (Egg Business) ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనూహ్యంగా రేట్లు పడిపోవడంతో.. ఇక వ్యాపారం చేసేది ఎలా అని లబోదిబో అంటున్నారు. కోడి గుడ్లు అమ్మడం కంటే రోడ్డుపై పారేసుకోవడం బెటర్ అని.. కనీసం ట్రాన్స్ పోర్టు (Transport) డబ్బులు రాకపోతే ఎలా ఆవేదన చెందుతున్నాయి. అయితే ఒడిషాలో కోడిగుడ్ల ధరలు ఇంత దారుణంగా పడిపోవడానికి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కారణమని అక్కడి వ్యాపారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. సాధారణంగా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎన్నో వస్తువులు ఎగుమతులు, దిగుమతులు అవుతుంటాయి. అలాగే కోడిగుడ్లు, చికెన్ (Chicken), చేపలు (Fish) కూడా మన దగ్గర నుంచి ఉత్తర భారతదేశం వైపునకు వందలాది లారీలు వెళుతుంటాయి. ఆంధ్రా నుంచి వందలాది లారీలు ఉత్తర భారతదేశం వైపుకు వెళుతుంటాయి. కోడిగుడ్ల లారీలు కూడా ఏపీ నుంచి ఒడిశా, బీహార్, బెంగాల్, అసోంకి లారీలు వెళ్లాయి. కానీ.. భువనేశ్వర్ (Bhuvaneswar) లో ఈ లారీలు నిలిచిపోయాయి.

    ఒకటి రెండు కాదు.. 300లకు పైగా లారీలను ఒడిషా వ్యాపారులు అడ్డుకున్నారు. దాదాపు 48 గంటలుగా కోడిగుడ్లతో ఉన్న 300 లారీలు నిలిపి వేశారు. అంటే రెండు రోజుల పాటు ఏం లేకుండా అలా ఉండాల్సి వచ్చింది. సుమారు 2 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై లారీలు నిలిచిపోయాయి. అందుకు ప్రధాన కారణం ఒడిషాలో కోడిగుడ్ల రేట్లు తగ్గిపోవడమే. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ రాష్ట్రం నుంచి కోడిగుడ్ల దిగుమతితో రేట్లు మరింత పడిపోయాయని వ్యాపారులు వెల్లడిస్తున్నారు.

    ఇదీ చదవండి : ఛీఛీ ఇయనేం డాక్టర్.. కూతురులాంటి మైనర్ తో ఈ వయసులో ఇవేం చేష్టలు..

    సాధారణంగా కోళ్ల దాణా పెరుగుదలతో భారీగా నష్టపోవడం జరిగిందని వాపోతున్నారు. ప్రతి కోడి గుడ్డుకు ఓ రేటును నిర్ణయించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇక గంటల తరబడి లారీలు నిలిచపోవడంతో డ్రైవర్, క్లీనర్, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటే.. కోడి గుడ్లు పాడైపోతాయని వెల్లడిస్తున్నారు. ఏపీ నుంచి కోడి గుడ్ల లారీలను జాతీయ రహదారిపై ఖుర్దారోడ్ వద్ద అడ్డుకున్నారు.

    ఇదీ చదవండి : కూలీలను ఆశ్చర్యపరిచిన కలెక్టర్.. గ్రామీణ ఉపాధి హామీ పనుల పరిశీలనకు ఏం చేశారంటే..?

    దీనిపై ఏపీ ఎగ్ ట్రేడర్స్‌తో ఒడిస్సా అధికారులు చర్చించినా సమస్య కొలిక్కిరాలేదు. ఎండ వేడిమికి గుడ్లు పాడవుతాయని ఏపీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 36 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాల గుడ్లను ఒడిషాలోకి రాకుండా అడ్డుకొని ధరలు పెంచుకునే యోచనలో స్థానిక వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, బీహార్‌ రాష్ట్రాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. గుడ్ల ఎగుమతులను అడ్డుకోవడంపై కేంద్రం చొరవ తీసుకోవాలంటున్నారు ఏపీ ఎగ్ ట్రేడర్స్.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Egg price, Eggs, Odisha news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు