Home /News /andhra-pradesh /

AP POLITICS MORE INVESTMENTS FOR ANDHRA PRADESH CM JAGAN WILL FOUNDATION STONE THIS MONTH NGS VSP

Good News: ఏపీకి పెట్టుబడుల ప్రవాహం.. ఆరువేల కోట్లతో పలు పరిశ్రమలు

ఏపీకి భారీ పెట్టుబడులు

ఏపీకి భారీ పెట్టుబడులు

Good News to Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. భారీ పరిశ్రమలు ఏపీలో ప్రారంభం కానున్నాయి. సుమారు 6 వేల కోట్లతో పలు పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈనెల 23వ తేదీన సీఎం జగ సిఎంన శంకుస్థాపన చేయనున్నారు.

    P Anand Mohan, Visakhapatnam, News18

    Good News for Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు శుభవార్త.. సీఎం జగన్ మోహన్  రెడ్డి (CM Jagan Mohan Reddy)  అధికారం చేపట్టిన తరువాత ఏపీకి పెట్టుబడులు (Investments for andhra pradesh) రావడం లేదని.. ఉన్న పరిశ్రమలు సైతం వెనక్కు తరలిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కేవలం విపక్షాలే కాదు.. సామాన్య ప్రజల్లో సైతం ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి పెట్టుబడులు రాలేదు.  అయితే త్వరలో ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల దావోస్ పర్యటనలో సీఎం జగన్ (AP CM jagan Davos Tour) భారీ ఒప్పందాలపై సంతకాలు చేశారు. తాజాగా ఇన్ఫోసిస్ (Infosys).. విశాఖపట్నం (Visakhapatnam) ఆఫీసు ప్రారంభం అవుతోంది. వీటికి తోడు.. తాజాగా ఏపి పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ఘట్టం  ఆవిష్కరణ కాబోతోంది. తిరుపతి (Tirupati), శ్రీకాళహస్తి (Srikalahasthi) చుట్టుపక్కల ప్రాంతాల్లో  సుమారు ఆరు వేల కోట్ల రూపాయలతో పలు కంపెనీలు యేర్పాటు చేయడానికి రాష్ట్రప్రభుత్వం  రంగం సిద్ధం చేసింది.

    ఈ కొత్త కంపెనీలకు సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఈ నెల 23 న శంకుస్థాపనలు  చేయనున్నారు. భూమి పూజ ఏర్పాట్లను  రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ్ ఆదివారం పరిశీలించారు. శ్రీకాళహస్తి, రేణిగుంట,  మండలాల్లో  పర్యటన శ్రీకాళహస్తి మండలం ఇనగళూరు దగ్గర హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (అపాచి) సంస్థ కు భూమి పూజ సమావేశ ప్రాంతం, హెలీప్యాడ్ ఏర్పాట్లను, రేణిగుంట విమానాశ్రయం దగ్గర ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లకు సంబంధించిన వివిధ యూనిట్లను, టీసీఎల్   సంస్థకు భూమి పూజ ప్రాంతాలను, హెలిప్యాడ్ ఏర్పాట్లు ను పరిశీలించారు.



     తిరుపతి జిల్లాను పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు  మంత్రి.  ఈ నెల 23న శ్రీకాళహస్తి మండలం, ఇనగలూరు గ్రామం దగ్గర సుమారు  290 ఎకరాలలో  పదివేల మందికి ఉపాధి కల్పించేందుకు ఎనిమిది వందల కోట్లతో అపాచి సంస్థకు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 

    ఇదీ చదవండి : మాజీ మంత్రి అయ్యన్న కబ్జా చేశారా..? ఇరిగేషన్ శాఖ ఏం చెప్పంది..? మంత్రి ఏమన్నారంటే?

    తరువాత రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సుమారు వెయ్యి కోట్లతో పదివేల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాటు చేసిన టీసీఎల్  సంస్థకు సంబంధించి శంకుస్థాపన, వివిధ యూనిట్ల ప్రారంభోత్సవంగా ముఖ్య మంత్రి చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహిస్తారని ఇందులో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొంటారని తెలిపారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు