AP Ration: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉచిత బియ్యం పంపిణీపై కొత్త కొత్త అనుమానాలు వెంటుడుతున్నాయి. బియ్యం వద్దు అనుకునే వారికి నగదు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఈ పథకం ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలువుతోంది. అయితే దీన్ని అమలుచేసే తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డుల్లోకి ఎక్కబోతోందని.. అని అంతా లెక్కలు వేసుకుంటున్న సమయంలో.. సర్కార్ ఆలోచనలో పడింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే..? ఓసారి బియ్యం బదులు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాక మళ్లీ బియ్యం కావాలని లబ్దిదారులు అడిగితే పోర్టబిలిటీ ఎలా ఇవ్వాలన్న దానిపై ప్రస్తుతం అధ్యయనం చేస్తోంది. డబ్బు తీసుకుంటే బియ్యం కార్డు (Rice card) తీసేస్తారనే ఆందోళన కూడా లబ్దిదారుల్లో ఉంది. ఏపీ ప్రభుత్వం (AP Government) ఆ నిర్ణయం తీసుకోడవానికి కారణం ఉంది.. ప్రస్తుతం నెలవారీ బియ్యానికి డిమాండ్ అంతంతమాత్రంగానే ఉంటోంది. ప్రభుత్వం నాణ్యమైన బియ్యం ఇస్తున్నట్లుచెప్పుకుంటున్నా దాన్ని తీసుకుని వండుకుని తినే వారు చాలా తక్కువ. ఈ బియ్యం తీసుకుని దాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడమో లేక రేషన్ డీలర్ల వద్ద అమ్ముకోవడమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బియ్యానికి బదులుగా అదే డబ్బు తామే ఇస్తే ప్రజల్లో పరపతి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఈ పథకం రూపకల్పనపై ప్రభుత్వవం ఆలోచనలో పడిందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం బియ్యానికి బదులు నగదు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం లబ్దిదారుల నుంచి సంతకాలు తీసుకుని నగదు ఇవ్వాలని నిర్ణయించింది. ఓసారి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాక తిరిగి బియ్యమే కావాలని లబ్దిదారులు కోరితే అప్పుడు ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇలా పలుమార్లు ఆప్షన్లు మార్చుకుంటుంటే పథకం అమలు కష్టతరంగా మారుతుంది. అందుకే పోర్టబిలిటీ ఇచ్చే విషయంలో ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minster Karumuri Nageswara Rao) వివరణ ఇచ్చారు.
ఇదీ చదవండి : ఆ జిల్లాలో వారం రోజులు లాక్ డౌన్.. ఎందుకో తెలుస్తే.. షాక్ అవుతారు..?
మరోవైపు ఈ పథకం తెస్తారనే ప్రచారం మొదలైన దగ్గర నుంచి మరో అనుమానం మొదలైంది. ఒకవేళ బియ్యం వద్దని చెప్పి.. డబ్బు ఒకసారి తీసుకుంటే.. భవిష్యత్తులో కార్డులు కట్ చేసే ప్రమాదం ఉందనే భయం కూడ వెంటాడుతోంది. బియ్యం అవసరం లేని వారికి బియ్యం ఎందుకని ప్రభుత్వం భావించి.. కార్డుల్లో కోత వేస్తారనే ప్రచారం కూడా ఉంది. ప్రభుత్వం బియ్యానికి బదులు నగదు ఇవ్వాలన్న ప్రతిపాదన వెనుక కార్డుల్లో కోత విధించాలన్న వ్యూహం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో లబ్దిదారుల్లోనూ అదే ఆందోళన మొదలైంది. దీనిపై మంత్రి నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. విపక్షాలు చెప్తున్నది నిజం కాదని, ఎవరి కార్డులూ పోవని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ నగదు కూడా మహిళల ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని అపోహలు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Free Ration