ఓ వైపు టీడీపీ (TDP) మహానాడు (Mahanadu).. మరోవైపు వైసీపీ (YSRCP) సామాజిక న్యాయభేరీ యాత్ర.. రెండు కార్యక్రమాలతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. దీనికి తోడు కోనసీమ (Konaseema) ఘటన రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం కూడా జోరుగా సాగుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), మహనాడుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) మండిపడ్డారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నరోజా.. ప్రతిపక్షాలపై హాట్ కామెంట్స్ చేశారు. గడప గడపకు మన ప్రభుత్సం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.., జగన్ లాంటి మంచి సీఎంను ఎన్నడూ చూడలేదని ప్రజలు చెప్తున్నారని రోజా అన్నారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాధరణ చూసి టీడీపీ నేతలు అవాకులుచవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహానాడు నాడు అని పెట్టి మహిళలతో నీచాతినీచంగా మమ్మల్ని తిట్టిస్తున్న ఘటనలు చూస్తున్నామని., రాష్ట్రానికి, తెలుగు దేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబే అని గతంలో ఎన్టీఆర్ అన్నారని రోజా గుర్తు చేశారు. మామ ప్రాణాలు తీసిన చేత్తోనే దండం పెడుతున్న చంద్రబాబు ఎంత ఘనుడో ప్రజలకే తెలుసన్నారు.
14 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రజల కోసం ఏమీ చేయలేదని రోజా విమర్శించారు. సీఎం జగన్., మంత్రులైన మమ్మల్ని తిట్టడానికే మహానాడు పెట్టుకున్నారన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు నమ్మకం తెప్పించి... వారికి మంచి పనులు చేస్తామన్న హామీ మహానాడులో ఇవ్వలేకపోయారని ఆమె విమర్శించారు.
ఎన్టీఆర్ చనిపోయిన ఆయన విగ్రహాలు ఎక్కడ పెట్టని చంద్రబాబు.. ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకు పెడితే సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం కూడా చేయకపోవడం శోచనీయమని రోజా అన్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు అంటే నచ్చదని.., అసలు ఆ పేరంటేనే భయమన్న రోజా.. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను చూసి భయపడి పార్టీ నుంచి బయటకు పంపేశారన్నారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని రవాణా కాష్టం గా మార్చే ప్రయత్నం చేస్తున్నాడని.., తన పుత్రుడు ముద్దపప్పు ఎందుకు పనికిరాడని., దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టుకున్నాడన్నారు. కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని అడిగిన టీడీపీ, జనసేన నాయకులే విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. దళిత మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను కాల్చి వేశారని.., పోలీసులు దెబ్బలు తిన్న కూడా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారని రోజా చెప్పారు. ఈ కుట్ర వెనుకాల ఎవరు ఉన్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె హ్చచరించారు. చంద్రబాబు 14 ఏళ్లలో చేయలేనిది.. జగన్ మూడేళ్లలో చేసి చూపించారని రోజా అన్నారు. చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పినా, మహిళలతో తిట్టించిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, Minister Roja