హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MLA Roja: కుప్పం దెబ్బకు పిచ్చెక్కింది.. ఆ సీసీ ఫుటేజ్ తీస్తే చంద్రబాబుకి చిప్పకూడే.. ఎమ్మెల్యే రోజా ఫైర్

MLA Roja: కుప్పం దెబ్బకు పిచ్చెక్కింది.. ఆ సీసీ ఫుటేజ్ తీస్తే చంద్రబాబుకి చిప్పకూడే.. ఎమ్మెల్యే రోజా ఫైర్

చంద్రబాబుపై రోజా కామెంట్స్..

చంద్రబాబుపై రోజా కామెంట్స్..

MLA Roja fire on chandrababu: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం హాట్ హాట్ గా మారింది. ప్రస్తుతం నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యల చుట్టూ మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఆ సెగలు చల్లారక ముందే వరద రాజకీయ హీటెక్కిస్తోంది. వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న చంద్రబాబు.. ప్రభుత్వం తీరుపై మండిపడంది. అదే స్థాయిలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఫైర్ బ్రాండ్ రోజా తనదైన స్టైల్లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.

ఇంకా చదవండి ...

  MLA Roja Fire On Chandrababu:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP), ప్రతిపక్ష టీడీపీ (TDP)ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కౌంటర్లు ఎన్ కౌంటర్లతో రాజకీయం హీటెక్కిస్తోంది. ఇప్పటికే నారా భువనేశ్వరి (nara bhuvaneswari)పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు నాయుడు  (Nara chandrababu naidu) వెక్కి వెక్కి ఏడ్చిన అంశంపై రాజకీయం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. చంద్రబాబుకు మద్దతుగా.. వ్యతిరేకంగా విమర్శలు వర్షం కురుస్తోంది. ఆ వ్యవహారం సెగలు రేపుతూనే ఉంది. ఇప్పుడు వరద రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. ఎగువనుంచి వస్తున్న వరదతో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో జలదిగ్బంధంతో చిక్కుకున్నాయి. మళ్లీ సీఎం అయ్యేంత వరకు అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేసిన చంద్రబాబు.. ప్రస్తుతం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు అండగా ఉన్నానని భరో కల్పిస్తున్నారు.

  మరోవైపు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకునే విషయంలో కానీ.. తరువాత సహాయక చర్యల విషయంలో కానీ పూర్తిగా విఫలమైందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన కామెంట్లపై ఎమ్మెల్యే రోజ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుప్పం దెబ్బకు చంద్రబాబుకు పిచ్చెక్కిందని రోజా అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఏరియల్‌ సర్వే చేయలేదా అని ప్రశ్నించారు. వరద బాధితుల దగ్గరకు వెళ్లిన చంద్రబాబు వారికేం చేశారు. వరద బాధితుల వద్దకు వెళ్లిన చంద్రబాబు.. తన బాధలు చెప్పుకున్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన బెట్టుకోవడం మానవ తప్పిదం. వాస్తవాలు బయటకు రాకుండా సీసీ ఫుటేజ్‌ డిలీట్‌ చేయించారని రోజా మండిపడ్డారు.

  ఇదీ చదవండి: జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు.. సీతయ్యే బతికి ఉంటే.. బొమ్మ వేరేలా ఉండేది..

  ప్రస్తుతం TDP Chief చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తూ డ్రామాలు ఆడుతున్నారని రోజా మండిపడ్డారు. గతంలో మహిళలను ఏడిపించిన చంద్రబాబు ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు లాగా ప్రవచనాలు చెబుతున్నారని రోజా ఎద్దేవా చేసారు. వరదలతో ఇంత పెద్ద ఎత్తున నష్టపోతే cm ys jagan ఏరియల్ సర్వే చేస్తారా అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై రోజా స్పందించారు. ఇప్పటికే వర్షాలు, వరదలతో ఇబ్బందిపడుతున్న జనం దగ్గరకు వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే సీఎం airial survey కు వెళ్లారని వివరించారు. అయినా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏరియల్ సర్వే చేయలేదా...? అని రోజా నిలదీసారు.

  ఇదీ చదవండి: లేచి నిలబడి.. చేతులు జోడించి చంద్ర బాబుకు దండం పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే.. ఎక్కడో తెలుసా..

  ఎల్జీ పాలిమార్ ఘటన బాధితులకు కోటి రూపాయలు ప్రకటించిన సీఎం జగన్.. భారీ వర్షాలు, వరదలతో సర్వస్వాన్ని కోల్పోయి నిరాశ్రయులైతే 5లక్షలు ప్రకటిస్తారా అన్న చంద్రబాబు వ్యాఖ్యలకు రోజా కౌంటరిచ్చారు. చంద్రబాబు హయాంలో ఎవరికైనా కోటి రూపాయలు పరిహారం ఇచ్చారా అని నిలదీసారు. వరద బాధితుల దగ్గర అసెంబ్లీలో అనని మాటలు ఎలా చెప్తారని... తాను చెప్పేదంతా ప్రజలు నమ్ముతారనుకోవడం చంద్రబాబు పొరపాటు అన్నారు రోజా.. తన మాటలు శాడిజంకు పరాకాష్ట. వరదలు మానవ తప్పిదం ఎలా అవుతుందో చెప్పాలి అన్నారు. ఓపిక ఉంటే వరద బాధితులకు సహాయం చేయండి. అనవసర రాజకీయాలు వద్దు అని రోజా హితవు పలికారు.

  ఇదీ చదవండి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లైఫ్ లో ట్విస్ట్ లు.. మిస్ ఇండియా కాలేక పోయారు కానీ..

  జగన్ ఉన్నంతవరకూ చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరని.. చంద్రబాబు కొడుకు ఎమ్మెల్యే కాలేడన్నారు.. సోనియా తో కుమ్మక్కై జగన్ పై తప్పుడు కేసులు పెట్టించారని.. కానీ ఇప్పుడు సోనియా గాంధీ నుంచి శంకర్రావు వరకూ ఏమయ్యారో తెలుసుకోవాలి అంటూ రోజా పంచ్ లు వేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, MLA Roja, Nara Lokesh

  ఉత్తమ కథలు