Home /News /andhra-pradesh /

AP POLITICS MLA ROJA NEW TWEET VIRAL SHE SAID SEA COMING FOR RAYALASEEMA AND TDP LEADERS TROLL HER NGS

MLA Roja: సీమకు సముద్రం తెచ్చిన జగన్ అన్న.. రోజా ఆసక్తికర ట్వీట్.. సోషల్ మీడియాలో ట్రోల్స్

ఎమ్మెల్యే రోజా

ఎమ్మెల్యే రోజా

MLA Roja: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాయలసమీకు సముద్రం వచ్చింది. ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారా..? జగన్ అన్నతోనే సాధ్యమైంది అంటూ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర ట్వీట్ చేశారు. అయితే దీనిపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్ మొదలెట్టారు.. దీంతో సీమకు సముద్రం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఇంకా చదవండి ...
    MLA Roja:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాలు (AP New Districts) అమల్లోకి వచ్చాయి. అయితే  పాలనా సౌలభ్యం కోసం జిల్లాలను విభజించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 13 జిల్లాలను 26గా విభజించడంతో చాలా జిల్లాల స్వరూపం మారిపోయింది. గిరిజన, కోస్తా, రాయలసీమ జిల్లాల సంఖ్య పెరగడమే కాదు కొత్త హద్దులు, కొత్త పాలన అమల్లోకి వచ్చింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రభుత్వం ప్రకటించడంతో కొన్ని జిల్లాల భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. అయితే కొన్ని జిల్లాల స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అతి  పెద్ద జిల్లాగా ఉన్న విశాఖ ఇప్పుడు చిన్న జిల్ల కాగా.. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎవరూ ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి.  అంతేకాదు రాయలసీమ ప్రజలు ఎన్నడూ చూడని మార్పు కనిపించింది. అదే రాయలసీమ పరిధిలోకి సముద్రతీరం రావడం కూడా ఒకటి.

    తాజా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో తిరుపతి జిల్లాకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం కలిసింది. అలాగే సముద్రతీరంలో ఉన్న మరో అసెంబ్లీ నియోజకవర్గం గూడూరు కూడా తిరుపతి జిల్లాలో చేరింది. దీంతో రాయలసీమ పరిధిలో ఉన్న తిరుపతి జిల్లాకు సముద్రం వచ్చేసిందని చర్చ జరుగుతోంది. అంతేకాదు మరో మార్పు కూడా చోటు చేసుకుంది. ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగివున్న గుంటూరు జిల్లా ప్రస్తుతం తీర ప్రాంతం లేని జిల్లాగా నిలుస్తోంది. ఎందుకంటే.. గుంటూరు ఉమ్మడి జిల్లాలో సముద్రతీరం ఉండేది.. విభజన తర్వాత సముద్ర తీరం దూరమైంది. బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరం ఉండేది. ఇప్పుడు సూర్యలంక బాపట్ల జిల్లాలోకి వెళ్లిపోయింది. గుంటూరు జిల్లా తీరం లేని జిల్లాగా మారింది. రాయలసీమకు సముద్రం రావడంపై ఎమ్మెల్యే రోజా కూడా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.  అంతేకాదు చంద్రబాబు అధికారంలో ఉండి కూడ తన నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజిన్ చేయలేకపోయారు అంటూ ట్వీట్ చేశారు.



     ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాలు ఏర్పాటు చేసిన సీఎం జగన్ కు  ధన్యవాదాలు అన్నారు రోజా.. 26 జిల్లాల కొత్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధిలో మ‌రింత వేగంగా దూసుకెళ్లాల‌ని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. పునర్‌వ్యవస్థీకరణలో సీమకు సముద్రం రావడం సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు ఎమ్మెల్యే రోజా. 



    ఇటు సీమకు సముద్రం రావడంపై తెలుగు తమ్ముళ్లు సెటైర్లు పేలుస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్ రెడ్డి సీమకు సముద్రం తెచ్చాడా అరి టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. నెల్లూరులోని మూడు నియోజకవర్గాలని.చిత్తూరులోని నాలుగు నియోజకవర్గాలని కలిపి ఈ జిల్లా చేశారు.. కేవలం దీనినే.. సీమకు సముద్రం వచ్చిందని గొప్పలు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.



    మరోవైపు మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలు మాత్రమే ఏజెన్సీ పరిధిలోకి రానున్నాయి. మైదాన ప్రాంతాల జిల్లాల సంఖ్య 13గా ఉంది. వీటిలో తూర్పుగోదావరి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా, కడప, రాజంపేట, చిత్తూరు జిల్లాలున్నాయి. అయితే ఇతర జిల్లాల సంగతి ఎలా ఉన్నా.. రాయలసీమలోకి సముద్రం రావడం మాత్రం హైలెట్ గా నిలుస్తోంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP new districts, AP News, MLA Roja, Nagari MLA Roja

    తదుపరి వార్తలు