Home /News /andhra-pradesh /

AP POLITICS MLA ROJA FULL JOSH SHE EXERCISE WITH HER HUSBAND RK SELVAMANI IN PUTTURU CHITOOR DISTRICT NGS

MLA Roja: భర్తతో కలిసి రోజా వ్యాయామాలు చూశారా..? ఫులో జోష్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్

భర్తతో కలిసి రోజా వ్యాయామం

భర్తతో కలిసి రోజా వ్యాయామం

MLA Roja: వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మంత్రి బెర్త్ ఖరారైందా..? సీఎం జగన్ హమీ ఇచ్చారా..? అందుకే గత కొంతకాలంగా ఆమె ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారా..? సీఎం జగన్ చెప్పినట్టు నిత్యం ప్రజల్లో ఉండేందుకే రోజా అధిక సమయం కేటాయిస్తున్నారు. తాజాగా ఆమె భర్తతో కలిసి వ్యాయామాలు చేస్తూ సందడి చేశారు.

ఇంకా చదవండి ...
    MLA Roja:  వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా (MLA Roja) ఫుల్ జోష్ లో ఉన్నారు.. ఆటలాడుతున్నారు.. డ్యాన్సులేస్తన్నారు.. ప్రార్థనలు చేస్తున్నారు.. ప్రజల్లోనే ఉంటున్నారు.. తాజాగా భర్తతో కలిసి వ్యాయామాలు చేస్తూ సందడిగా కనిపించారు. ఇలా నిత్యం బిజీగా ఉన్నారు రోజా.. సర్జరీ నుంచి కోలుకున్న తరువాత నుంచి గతంలో లేనంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు.   ఆమె ఉత్సాహానికి అసలు కారణం సీఎం జగన్ (CM Jagan) ఇచ్చిన హామీనే అంటున్నారు. ఇప్పటికే కేబినెట్ లో మార్పులు ఉంటాయని జగన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. త్వరలోనే రాజీనామాలకు సిద్ధపడాలి అంటూ సంకేతాలు ఇచ్చారు. అయితే మంత్రి పదవి పోయిందనే చింతించవద్దని.. పార్టీ బాధ్యతలు అప్పచెపుతా అంటూ ఆయన హామీ ఇచ్చారు. అయితే ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అన్నదానిపైనా జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పార్టీకి ఉపయోగపడతారు అనుకునే వారితో పాటు.. సామాజిక సమీకరణాలను అన్నీ లెక్కలు వేసుకున్న తరువాత సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అధినేత నుంచి రోజాకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని.. నిత్యం ప్రజల్లో ఉంటే తప్పక పదవి వస్తుందని గతంలోనే ఆయన చెప్పారని.. అప్పటి నుంచి ఆమె నియోజకవర్గానికే పరిమితమై.. అధినేత ఫోకస్ తనపై పడేలా చేసుకున్నారని రోజా అనుచరులు చెబుతున్నారు.

    తాజాగా చిత్తూరు జిల్లా (Chittoor District) నగరి (Nagari) నియోజకవర్గంలో నగరిలో ఎమ్మెల్యే రోజా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. నగరిలోని బుగ్గ అగ్రహారంలో 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బోరు, పైప్ లైన్ పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. అలాగే పుత్తూరులో 1.10 కోట్ల రూపాయల తుడ నిధులతో నిర్మించిన మునిసిపల్ పార్క్ ను ప్రారంభించారు. తరువాత ఆ పార్క్ లో ఏర్పాటు చేసిన జిమ్ లో రోజా దంపతుల ఎక్సర్ సైజ్ చేశారు. భర్తతో కలిసి వ్యాయామాలు చేస్తూ ఆమె కొంత సేపు సరదాగా గడిపారు..

    కేవలం ఇప్పుడే కాదు.. గత కొంతకాలంగా ఆమె ఇలా బిజీగానే ఉంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. మేకతోటి సుచరిత, పాముల పుష్ప శ్రీవాణి, తానేటి వనిత.. అయితే ఈ ముగ్గురు త్వరలోనే తమ పదవులకు రాజీనామా చేసి.. పార్టీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.

    ఇదీ చదవండి : ఏపీలో చంద్రబాబు పెగాసస్ రచ్చ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం ఆమోదం.. ఏం జరుగుతోంది..

    ఇప్పటికే దీనిపై వారికి సీఎం జగన్ నుంచి క్లారిటీ వచ్చినట్టు సమాచారం. దీంతో వారి స్థానంలో కొత్తగా ఎవరు మంత్రి పదవుల్లోకి వస్తారన్నదానిపై ఆసక్తి పెరిగింది. అయితే అందులో ఒకరు రోజా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు ఆమెకు హోం మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. కాకపోతే కొన్ని అంశాలు ఆమెకు మైనస్ గా కనిపిస్తున్నాయి. కానీ రోజా అనుచరులు మాత్రం.. తనకు తప్పక మంత్రి పదవి వస్తుందని ధీమాగా చెబుతున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Nagari MLA Roja

    తదుపరి వార్తలు