హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

జనసేన నుంచి ఎమ్మెల్యే సస్పెన్షన్... వైరల్ అవుతున్న ఫేక్ ప్రకటన

జనసేన నుంచి ఎమ్మెల్యే సస్పెన్షన్... వైరల్ అవుతున్న ఫేక్ ప్రకటన

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)

జనసేన నుంచి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ సస్పెన్షన్‌కు సంబంధించిన ఓ ఫేక్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  జనసేనకు చెందిన ఒకే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు, ఆ పార్టీకి మధ్య గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. జనసేన తీసుకున్న నిర్ణయాలను పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్... అసెంబ్లీలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జనసేన షోకాజ్ నోటీసు ఇచ్చిందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆయనకు షోకాజ్ ఇవ్వలేదని...అదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారమని జనసేన క్లారిటీ ఇచ్చింది. కానీ ఈలోగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రాపాక వరప్రసాద్ విమర్శలు గుప్పించారు.

  అయితే ఎమ్మెల్యే రాపాకపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే తాజాగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారనే ప్రచారం మరోసారి మొదలైంది. ఇందుకు సంబంధించిన ఓ ఫేక్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన పార్టీ విడుదల చేసినట్టుగా ఉన్న ఈ ప్రకటనపై ఆ పార్టీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. మొత్తానికి జనసేనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ ప్రకటనలు కొత్త తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది.

  Janasena, pawan kalyan, rapaka varaprasad, rapaka varaprasad suspension from janasena, ap news, ap politics, జనసేన, పవన్ కళ్యాణ్, రాపాక వరప్రసాద్, ఏపీ న్యూస్, ఏపీ పాలిటిక్స్
  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ ప్రకటన

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: AP News, Janasena, Pawan kalyan, Rapaka varaprasad

  ఉత్తమ కథలు