హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP MLA Quota MLC elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలోనూ ట్విస్ట్ తప్పదా.. ఆ ఇద్దరి ఓటు ఎవరికి..?

AP MLA Quota MLC elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలోనూ ట్విస్ట్ తప్పదా.. ఆ ఇద్దరి ఓటు ఎవరికి..?

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

AP MLA Quota MLC elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అధికారా పార్టీకి మరో షాక్ తగులుతుందా..? లేక అధికార పార్టీ తన పట్టు నిలుపుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు ఈ నెల 23వ తేదీన తెర పడనుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

AP MLA Quota MLC elections: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ ముఖ చిత్రాన్ని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలు (MLC Graduate Elections Result) మార్చనున్నాయా..? ఎందుకంటే అధికార వైసీపీ (YCP) కానీ. రాజకీయ విశ్లేషకులు కానీ.. ఇతర పార్టీలు కానీ ఊహించని రీతిలో వచ్చాయి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. ఎందుకంట ప్రతిపక్ష టీడీపి (TDP)కి ఒక సీటు రావొచ్చని అంతా అంచాన వేశారు. టీడీపీ శ్రేణులు సైతం ఒకటి పక్కగా వస్తుందని ధీమాలో కనిపించారు. కానీ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. పోటీ చేసిన మూడు చోట్ల టీడీపీనే విజయం వరించింది. అప్పుడు అదే జోష్ ను మళ్లీ కంటిన్యూ చేయాలి అని భావిస్తోంది తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party).అందులో భాగంగా పూర్తి బలం లేకపోయినా ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టింది. కేవలం టీడీపీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలనే ఉద్దేశంతో కాదు.. కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో బరిలో దింపాము అంటోంది.. మరి బలం లేకపోయినా టీడీపీ ఎలా నెగ్గుతుంది.. మరి చూస్తూ అధికార వైసీపీ ఊరుకుంటుందా..? అసలు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగబోతోంది.. ఒకవేళ టీడీపీ చెప్పినట్టు తమ అభ్యర్థి గెలిస్తే.. ఏపీ రాజకీయాల్లో సంచలనం జరిగినట్టే..?

అందుకే ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాకులకు ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే గెలుపు వ్యూహాలు రచిస్తున్న బాధ్యులకు ఎమ్మెల్సీ ఎన్నికలు టెన్షన్ పెడుతున్నాయి. అయితే మొదటి నుంచి ఏడు ఎమ్మెల్సీ సీట్లు తమవే అని.. టీడీపీ బలం లేదని.. ఆ పార్టీ పోటీలో నిలవదని వైసీపీ అంచనా వేసింది. కానీ అనూహ్యంగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. చివరి నిమిషంలో పంచమర్తి అనురాధతో నామినేషన్ వేయించారు.

ప్రస్తుతం టీడీపీకి 19మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు నెగ్గితే.. ముగ్గురు వైసీపీకి జై కొట్టారు. ఇటీవల వల్లభనేని వంశీ టీడీపీ దూరంగా ఉన్నారు. ఇలా నాలుగు మంది ఎమ్మెల్యేలు దూరం అవ్వడంతో కేవలం 19 ఓట్లే మిగిలాయి. కానీ ఎమ్మెల్సీగా నెగ్గాలి అంటే కనీసం 22 ఓట్లు అవసరం.. ఆ లెక్కన టీడీపీ మరో మూడు ఓట్లు కావాలి.. ప్రస్తుతానికి టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి విప్ జారీ చేసింది టీడీపీ. అయితే ఆ నలుగురూ ఇతర కారణాలు చెప్పివిప్ నుంచి తప్పించుకుంటారు.. వారు కచ్చితంగా టీడీపీకి ఓటు వేసే అవకాశం ఉండదు.

ఇదీ చదవండి: హాలో నేను సీఎం జగన్ .. 12 లక్షలు ఇవ్వాలంటూ కంపెనీకి ఫోన్.. చివరికి ఏమైంది అంటే?

ఇలా ఏ రకంగా చూసుకున్నా టీడీపీ ఎమ్మెల్సీ నెగ్గడం కష్టమే.. మరి తెలిసి చంద్రబాబు ఎందుకు అభ్యర్థి నిలబెట్టారు అనే చర్చ మొదలైంది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి అంటున్నారు. ప్రస్తుతం టీపీడీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తే.. వారు తప్పకుండా టీడీపీకే ఓటు వేయాలని.. కాదంటే వారిపై అనహర్హత వేటు వేయొచ్చు.. అయితే ఇది సీక్రెట్ ఓటు కావడంతో టీడీపీ నుంచి వచ్చిన వారు ఎవరికి ఓటు వేసేరని తెలియకపోవచ్చు.. దీంతో ఆ ఓట్లు పడకపోతే.. టీడీపీ బలం 19 మంది మాత్రమే.. మరి మిగిలిన మూడు ఓట్లు ఎవరు వేస్తారు.

ఇదీ చదవండి : త్వరలో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఈ జాగ్రత్తలు తప్పని సరి అంటున్న అధికారులు

టీడీపీ గెలిచే అవకాశం లేకపోయినా అనురాధతో నామినేషన్ వేయించడం వెనుక ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతుతోపాటు వైసీపీలో మరికొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారనే వాదన వినిపిస్తోంది. అందులో శ్రీధర్ రెడ్డి ఇప్పటికే ఓటు వేస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆనం రామనారయణ రెడ్డి మద్దతు కూడా ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. మరో ఇద్దరు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తామని చంద్రబాబు నాయుడుకు చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే టీడీపీ ఎమ్మెల్సీ విజయం సాధించినట్టే.. మరి అధికార పార్టీ ఎలాంటి వ్యూహంతో వెళ్తుంది అన్నది ఆసక్తి పెంచుతోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics

ఉత్తమ కథలు